Rain Alert: హైదరాబాదీలకు అలెర్ట్: మళ్లీ భారీ వర్షం కురిసే అవకాశం!

Rain Alert: హైదరాబాదీలకు అలెర్ట్: మళ్లీ భారీ వర్షం కురిసే అవకాశం!

హైదరాబాద్ మహా నగరంలో మంగళవారం సాయంత్రం కురిసిన వాన బీభత్సం సృష్టించింది. ఆ దెబ్బ నుంచి కోలుక ముందే... మరో అలెర్ట్ వచ్చింది. హైదరాబాద్ లో పాటు తెలంగాణలో మళ్లీ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

హైదరాబాద్ మహా నగరంలో మంగళవారం సాయంత్రం కురిసిన వాన బీభత్సం సృష్టించింది. ఆ దెబ్బ నుంచి కోలుక ముందే... మరో అలెర్ట్ వచ్చింది. హైదరాబాద్ లో పాటు తెలంగాణలో మళ్లీ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

హైదరాబాద్ మహా నగరంలో మంగళవారం సాయంత్రం కురిసిన వాన బీభత్సం సృష్టించింది. ఒక గంటపాటు కురిసిన వాన సిటీని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. రోడ్లన్నీ నదులను తలపించాయి. చాలా ప్రాంతాలు విద్యుత్ లేక అంధకారంగా మారాయి. గత కొంత కాలంగా ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గ్రేటర్ ప్రజలు ఈ వర్షంతో కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో తీవ్ర నరకయాతన అనుభవించారు. నిన్నటి ఘటన మరువక ముందే హైదరాబాద్ ప్రజలకు, అలానే తెలంగాణ ప్రజలకు మరో హెచ్చరిక. మళ్లీ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా భారీ వానలు కురిశాయి. అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చాలా రోజులుగా తీవ్రమైన ఎండతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వాన ఊరట ఇచ్చింది. అదే సమయంలో చాలా తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇదే సమయంలో హైదరాబాద్ నగరంలో మంగళవారం వాన సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు గంట పాటు ఏకధాటిగా వాన విజృంభించింది. నగరంలో కుండపోత వర్షంతో పలు ప్రదేశాల్లోని రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రోడ్లపైన, కాలనీల్లోనూ విరిగిపడిన చెట్ల కొమ్మలు, డ్రైనేజీ పొంగిపొర్లాయి. గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లోని రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాలు బారులుతీరాయి.

ఐటి కారిడార్‌లో వాహనాలు భారీ వర్షంతో ట్రాఫిక్ సమస్యకు గురయ్యాయి. ఈ వానల ధాటికి బాచుపల్లి ఓ భవనం కూలి ఏడుగురు మృతి చెందారు. అలానే రెండు శవాలు నాలలో కోట్టుకువచ్చాయి.  ఇలా మంగళవారం కురిసిన వాన నగర వాసులను భయాందోళనకు గురి చేసింది. ఈ క్రమంలోనే మరో హెచ్చరి వచ్చింది. తెలంగాణలో బుధవార సాయంత్ర కూడా భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.  ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, నాగర్ కర్నూల్‌ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.

Show comments