Eluru District Crime News: విషాదం.. పానీ పూరి తిన్న అన్నదమ్ములు మృతి

విషాదం.. పానీ పూరి తిన్న అన్నదమ్ములు మృతి

10 & 5 Years Old Brothers Died After Eating Pani Puriఈ మద్య కొంతమంది కలుషిత ఆహారం, నీరు తాగి చనిపోతున్న విషయం తెలిసిందే. శుచీ శుభ్రత పాటించాలని అధికారులు ఎంత చెబుతున్నా.. కొంతమంది నిర్వహకులు నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.

10 & 5 Years Old Brothers Died After Eating Pani Puriఈ మద్య కొంతమంది కలుషిత ఆహారం, నీరు తాగి చనిపోతున్న విషయం తెలిసిందే. శుచీ శుభ్రత పాటించాలని అధికారులు ఎంత చెబుతున్నా.. కొంతమంది నిర్వహకులు నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.

వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరని పెద్దలు అంటుంటారు. ఇటీవల మనిషికి అనేక రూపాల్లో మృత్యువు వెంటాడుతుంది. రోడ్డు ప్రమాదాలు, హార్ట్ ఎటాక్, అగ్ని ప్రమాదాలు, కరెంట్ షాక్ ఇలా ఎన్నో కారణాల వల్ల చనిపోతున్నారు. తమ వారిని కోల్పోయి కుటుంబాలు తీరని దుఖఃంలో మునిగిపోతున్నాయి. దారుణమైన విషయం ఏంటంటే కొంతమంది తినడం, తాగడం వల్ల కూడా చనిపోతున్నాయి. ఈ మద్యనే న్యూ ఇయర్ సందర్భంగా పార్టీ చేసుకున్న ఇద్దరు స్నేహితులు. అందులో ఒకరికి చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని కొద్ది క్షణాల్లోనే చనిపోయిన ఘటన తీవ్ర కలకం రేపింది. తాజాగా రోడ్ సైడ్ అమ్మే పాని పూరి తిని ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సాధారణంగా చాలా మంది స్ట్రీట్ ఫుడ్ అంటే తెగ ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా రోడ్ సైడ్ దొరికే స్ట్రీట్ ఫుడ్ బజ్జీలు, గారెలు, పావ్ బాజీ, పానీ పూరి అంటే చాలా మంది తెగ ఇష్టపడుతుంటారు. అయితే పానీ పూరి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎంతో మంది చాలా తెగ లాగించేస్తారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా అప్పుడప్పుడు రోడ్ సైడ్ తమ వాహనాలు ఆపి పాని పూరి తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు పాని పూరి తిని చనిపోయిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. తాజాగా ఏలూరు జిల్లాలోని జంగారెడ్డి గూడెంలో విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఇద్దరు అన్నాదమ్ములు పాని పూరి తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం కి కెందిన రామకృష్ణ (10), విజయ్ (6) అన్నదమ్ములు రాత్రి పాని పూరి తిన్నారు. కొద్ది సేపటి తర్వాత ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఇద్దరు అన్నదమ్ములను స్థానిక హాస్పిటల్ కి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు అన్నదమ్ములు కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారుల మృతితో ఆ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల పానీపూరి చేయడంలో చాలా మంది అపరిశుభ్రంగా ఉంటున్నారని.. చేతులుతో పూరీ వడ్డిస్తూ. మరికొంతమంది మురుగు నీరు నీటిని కలుపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show comments