డబ్బు కోసం అలా చేయడం ఇష్టం లేక..! పాపం ఈ ఇల్లాలి కథ దారుణం!

డబ్బు కోసం అలా చేయడం ఇష్టం లేక..! పాపం ఈ ఇల్లాలి కథ దారుణం!

దంపతులు మధ్య గొడవలు అనేవి సహజం. అయితే వాటిని మరీ సాగదీసినప్పుడే దారుణాలు చోటుచేసుకుంటాయి. హత్య చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఓ జంట మధ్య జరిగిన గొడవలో భార్య విగతజీవిగా మారింది.

దంపతులు మధ్య గొడవలు అనేవి సహజం. అయితే వాటిని మరీ సాగదీసినప్పుడే దారుణాలు చోటుచేసుకుంటాయి. హత్య చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఓ జంట మధ్య జరిగిన గొడవలో భార్య విగతజీవిగా మారింది.

సంసారం అనే సాగరంలో ఆటుపోటులు అనేవి సహజం. వాటిని భార్యాభర్తలు కలిసి ఎదుర్కొవాలే కానీ, వాటి గురించి గొడవలు పడకూడదు. ఇద్దరు ఆలోచించేది సంసారం హాయిగా సాగేందుకే కాబట్టి సర్థుకుపోవడం మంచిది. దంపతులు మధ్య గొడవలు అనేవి సహజం. అయితే వాటిని మరీ సాగదీసినప్పుడే దారుణాలు చోటుచేసుకుంటాయి. హత్య చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ విషయంలో భర్తతో ఘర్షణ పడిన ఓ వివాహిత..చివరకు ఆయన చేతిలోనే హత్యకు గురైంది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడేనికి చెందిన బొబ్బర వంశీకి జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురానికి చెందిన ఝాన్సీ(33) అనే ఆమెతో వివాహం జరిగింది. వీరి వివాహం 19 ఏళ్ల క్రితం ఎంతో ఘనంగా జరిగింది. వంశీ తాపీ మేస్త్రీ  పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలానే ఝూన్సీ కూడా జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తో కుటుంబానికి ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

వీరి కుటుంబం శ్రీనివాసపురంలో నివాసం ఉంటుంది. ఇలా ఇద్దరి సంపాదనతో వారి కుటుంబం హాయిగా సాగుతోంది. ఈ క్రమంలోనే కొన్నాళ్ల కిందట.. వాళ్లు నివాసం ఉండే ఇంటిని పడేసి.. డాబా నిర్మించారు. వంశీ చెడు వ్యసనాలు, ఇల్లు కట్టేందుకు అప్పులు అయ్యాయి. అప్పులు వాళ్లు తమ డబ్బులు చెల్లించాలనే అడిగేవారు. వాటిని తీర్చే దారిలేక ఇల్లు అమ్మేద్దాని భార్యతో తరచూ చెబుతుండే వాడు. దీనికి ఝాన్సీ నిరాకరిస్తుండేది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో బుధవారం కూడా ఈ దంపతలు మధ్య ఇంటి విషయంలో గొడవకు  జరిగింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. విచక్షణ కోల్పోయిన వంశీ కత్తితో భార్య మెడపై దాడి చేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి అతడు పారిపోయాడు. కేకలు విని స్థానికంగా ఉంటున్న ఝూన్సీ సోదరుడు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో ఝూన్సీ మృతి చెంది ఉంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతురాలి బంధువుల నుంచి వివరాలు సేకరించారు. తల్లి మృతదేహం వద్ద కుమారులు విలపిస్తున్న తీరు చూపరులు, బంధువులను కలచివేసింది. క్షణికావేశంలో భార్యాభర్తలు గొడవ పడ్డంతో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులేని అనాథలుగా మిగిలారు. ఇళ్లు అమ్మితే డబ్బులు వస్తాయి. అయితే ఆమె అలా వచ్చే డబ్బులు ఇష్టం లేక భర్తను నచ్చజేప్పే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

Show comments