ఆమెకి 3 ఏళ్లుగా భర్త అంటే ఇష్టం లేదు! రాత్రి పూట ఎవరూ లేని సమయంలో!

ఆమెకి 3 ఏళ్లుగా భర్త అంటే ఇష్టం లేదు! రాత్రి పూట ఎవరూ లేని సమయంలో!

సంసార ప్రయాణం అనేది సాఫీగా సాగాలంటే మాత్రం ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమించుకుంటే..వారి సంసార జీవితం హాయిగా సాగుతోంది. కానీ ఓ వివాహిత మాత్రం ఇష్టం లేని భర్తతో ఉండలేక.. ఓ రోజు రాత్రి..

సంసార ప్రయాణం అనేది సాఫీగా సాగాలంటే మాత్రం ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమించుకుంటే..వారి సంసార జీవితం హాయిగా సాగుతోంది. కానీ ఓ వివాహిత మాత్రం ఇష్టం లేని భర్తతో ఉండలేక.. ఓ రోజు రాత్రి..

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మరో కొత్త ప్రయాణం. కారణం.. అప్పటి వరకు సింగిల్ గా ఉండి..పెళ్లి అనే బంధంతో సంసారం బంధంలోకి  అడుగు పెడతాము. అయితే ఈ సంసార ప్రయాణం అనేది సాఫీగా సాగాలంటే మాత్రం ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమించుకుంటే..వారి సంసార జీవితం హాయిగా సాగుతోంది. అయితే కొందరు మాత్రం భాగస్వామి నచ్చక వివిధ ఘోరాలకు పాల్పడుతుంటారు. చంపడం లేదా చావడం వంటి ఘటనలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వివాహిత..భర్తతో ఉండటం ఇష్టం లేక దారుణానికి పాల్పడింది. పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఈ ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

పార్వతీపురం మన్య జిల్లా భోగాపురం మండలంలోని రాజాపులోవ గ్రామానికి చెందిన ముత్యాలమ్మకు చందక పుష్ప అనే కుమార్తె ఉంది. చందకకు కిలారి శ్రీనుతో వివాహం జరిగింది. చందక, శ్రీనులకు మూడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. పెళ్లైన కొంతకాలం వరకు వారి సంసారం బాగానే ఉంది. అయితే ఆ తరువాతనే చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో వారిద్దరు తరచూ గొడవ పడుతుండే వారని సమాచారం. ఇలా కొంతకాలంగా వారు గొడవల పడుతుండంతో విడిపోయి జీవించాలని భావించారు.

ఇలా చందక, శ్రీనుల మధ్య మనస్పర్థల కారణంగా ఏడాది క్రితం విడిపోయారు.  పెద్దల సమక్షంలోనే వారిద్దరు విడిపోయారు. అయితే చందక తల్లి ముత్యాలమ్మకు కుమార్తె ఒంటరిగా ఉండటం నచ్చలేదు. అందుకే అల్లుడి దగ్గరకు వెళ్లమని చెబుతుండేది. అలా ముత్యాలమ్మ కుమార్తె చందకను భర్తతోనే జీవితం కొనసాగించమని నచ్చజెప్పింది. అయితే అతడిపై చందకకు చాలా విరక్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే ఇష్టం లేని వాడితో జీవించలేక తల్లి మాట వినలేక మానసికంగా సంఘర్షణకు లోనైట్లు సమాచారం. ఆత్మహత్యకు యత్నించే ముందు రోజు రాత్రి తీవ్రవేదనకు గురైనట్లు సమాచారం. ఇలా ఇష్టంలేని వాడితో ఉండకూడదని ఈనెల 23న ఇంట్లో ఎవరు లేని సమయంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది.

చందక పుష్పను గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కేజీ ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా అక్కడ చికిత్స పొందుతూ  చందక ఆదివారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తల్లి ముత్యాలమ్మ పదేళ్ల క్రితం  భర్తను కోల్పోయింది. ఇక బిడ్డపైనే ఎన్నో ఆశలు పెట్టుకుని జీవనం సాగిస్తుంది. ఇలాంటి సమయంలో కుమార్తె కూడా దూరమవడంతో ముత్యాలమ్మ కన్నీరు మున్నీరుగా విలపించింది. మృతురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇలా కుటుంబ సమస్యల కారణంగా తరచూ  ఆత్మహత్య ఘటనలు జరుగుతున్నాయి. ప్రతి సమస్యకు చావే పరిష్కారంగా భావించిన కొందరు నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. మరి..  ఆత్మహత్యల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments