Bhadradri Kothagudem District Crime News: భర్త మరణం తట్టుకోలేక అదే రోజు భార్య మృతి

భర్త మరణం తట్టుకోలేక అదే రోజు భార్య మృతి

Bhadradri Kothagudem District Crime News: టైటిల్: మూడుముళ్ల బంధంతో ఒక్కటైన జంట నిండు నూరేళ్లు కలిసి ఉండాలని పెద్దలు దీవిస్తుంటారు. భర్త మరణం తట్టుకోలేక భార్య కన్నుమూసిన ఘటన హృదయాలను కలచి వేసింది.

Bhadradri Kothagudem District Crime News: టైటిల్: మూడుముళ్ల బంధంతో ఒక్కటైన జంట నిండు నూరేళ్లు కలిసి ఉండాలని పెద్దలు దీవిస్తుంటారు. భర్త మరణం తట్టుకోలేక భార్య కన్నుమూసిన ఘటన హృదయాలను కలచి వేసింది.

పెళ్లి.. రెండు అక్షరాలు. మూడు ముళ్ళతో మొదలై… ఇద్దరి జీవితాలను, తనువులను, మనసులను, కుటుంబాలను అన్నిటినీ ఏకం చేసే ఓ పవిత్ర కార్యం. ఇందుకే నిండు నూరేళ్లు కలిసివుండాలని పెళ్ళైన నూతన వధూవరులను పెద్దలు దీవిస్తారు. అయితే.. మోడ్రన్ ప్రేమలు,పెళ్లిళ్లు పట్టుమని పదేళ్లు కూడా సాగకుండా వీడిపోతున్నాయి. ఒకరికోసం ఒకరు అనే సూత్రాన్ని మరచి.., ఎవరి కంఫర్ట్ వాళ్ళు చూసుకుంటూ ప్రేమ, పెళ్ళికి ఉన్న విలువని అర్ధం చేసుకుకోకుండా జీవితాలను బుగ్గి చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అసలైన ప్రేమ వివాహ వ్యవస్థకి “చావులోనూ తోడంటూ” ఓ వృద్ధ జంట ఆదర్శంగా నిలిచింది. భార్యాభర్తల ప్రేమానుబంధం అన్నిటికంటే పవిత్రబంధం. దానికి సాక్షంగా భర్త చావులోనూ తోడంటూ ఆ పవిత్ర ప్రేమబంధానికి ఆదర్శంగా నిలిచింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకకు చెందిన ఓ వృద్ధ జంట.ఆ వివరాల్లోకి వెళ్తే..

పినపాక మాజీ సర్పంచ్ సుంకరి రాములు గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అతని ఆరోగ్యం చెడిపోయిన నాటి నుండి భార్య నర్సమ్మ భర్తని ఎల్లవేళలా కనిపెట్టుకుంటూ వస్తోంది. నిజానికి ఆమె కూడా వృద్ధురాలే అయినా.. భర్త కోసం ఓపిక తెచ్చుకుని మరీ సపర్యలు చేస్తూ వస్తోంది. కానీ.., సోమవారం రాములు ఆరోగ్యం పూర్తిగా క్షిణించడంతో ఆయన మృతి చెందాడు. భర్త మరణం తెలిశాక నర్సమ్మ కన్నీరుమున్నీరుగా విలపించింది. బిడ్డలు, బంధువులు, ఇరుగుపొరుగు వారు ఎంతలా ఓదార్చినా.. ఆమె భర్త కోసం ఏడుస్తూనే ఉండిపోయింది. ఇలా భర్త మరణం తట్టుకోలేని భార్య నర్సమ్మ ఏడ్చి, ఏడ్చి.. అదే రోజు సాయంత్రం బెంగతో మరణించింది. ఇలా 80 ఏళ్ళు అన్నోన్యంగా, ఎంతో ఆదర్శంగా బ్రతికిన ఆ జంట బంధాన్ని చావు సైతం వేరుచేయలేకపోయింది.

తల్లి తండ్రి ఒకే రోజు మరణించడం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని మిగిలించాయి. ఈ పవిత్ర జంటకు ఊరే కుటుంబమై శోక తప్త హృదయాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తనువులు రెండైనా తాము ఒక్కటే అనే పవిత్ర ప్రేమబంధం పెళ్లి. దానికి వీరిదాంపత్యమే గొప్ప నిదర్శనం. రాములు – నర్సమ్మది ఒక వాస్తవ జీవిత ఆదర్శ గాధ. సినిమా ఫాంటసీలతో బతికే బదులు.. ఇలాంటి నిజ జీవిత వాస్తవ ప్రేమలు నేటి తరానికి నిజమైన ఆదర్శంగా నిలుస్తాయి. మూడు ముళ్ళు వేసినంత ఫాస్ట్ గా.. విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్న నేటి యువత ఈ జంటని చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. మరి,, చూశారు కదా.. రాములు- నర్సమ్మ బంధం ఎంత గొప్పదో! ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments