Netflix Top 10 Movies: నెట్ ఫ్లిక్స్ లో దూసుకుపోతున్న టాప్ 10 మూవీస్ ఇవే! 6th మూవీ అసలు మిస్ కావద్దు!

Netflix Top 10 Movies: నెట్ ఫ్లిక్స్ లో దూసుకుపోతున్న టాప్ 10 మూవీస్ ఇవే! 6th మూవీ అసలు మిస్ కావద్దు!

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ప్రతి వారం ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉన్నాయి. మరి వాటిలో ఈ మధ్య కాలం రిలీజ్ అయిన సినిమాలలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 లో ఉన్న సినిమాలేంటో చూసేద్దాం.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ప్రతి వారం ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉన్నాయి. మరి వాటిలో ఈ మధ్య కాలం రిలీజ్ అయిన సినిమాలలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 లో ఉన్న సినిమాలేంటో చూసేద్దాం.

ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో ఉన్న అన్నిటిలో..ఎక్కువమంది సబ్స్క్రైబర్స్ ను పొందిన ఓటీటీ ప్లాట్ ఫార్మ్ గా బెస్ట్ అనిపించుకుంటుంది నెట్ ఫ్లిక్స్ . అయితే, ఒకప్పుడు పెద్దగా గుర్తింపు రాని నెట్ ఫ్లిక్స్ కు ఇప్పుడు మాత్రం మంచి ఆదరణ లభిస్తోంది. థియేటర్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న ప్రముఖ చిత్రాలను.. ముందుగానే భారీ ధరలకు కొంటూ.. మిగిలిన ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కు గట్టి పోటీ ఇస్తుంది. పైగా ఈ మధ్య కాలంలో చాలా వరకు తెలుగు సినిమాలను కూడా నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేస్తూ.. ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో నిలుస్తుంది. మరి గత వారం రోజులుగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సినిమాలలో టాప్ 10 లో ఏ సినిమా ఏ స్థానాన్ని దక్కించుకుందో చూసేద్దాం.

1. లాపతా లేడీస్:
కేవలం రూ.4కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా రూ.20 కోట్ల వరకు వసూళ్లను రాబట్టిన ఈ సినిమా.. నెట్ ఫ్లిక్స్ లో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ మధ్య కాలంలో బి టౌన్ లో వచ్చిన సినిమాలన్నిటిలో బెస్ట్ సినిమాగా పేరు తెచ్చుకుని లాపతా లేడీస్. ఈ సినిమాకు పలువురు బాలీవుడ్ స్టార్స్ సైతం.. ప్రశంసలు కురిపించారు.

2. టిల్లు స్క్వేర్:
టిల్లు గాడి హావ కేవలం థియేటర్స్ దగ్గరే ఆగిపోకుండా.. అక్కడ 100 కోట్ల క్లబ్ లో చేరిన తర్వాత.. అనుకున్నదానికంటే ముందే ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చి.. నెట్ ఫ్లిక్స్ లో టాప్ 2 స్థానాన్ని దక్కించుకుంది ఈ సినిమా. ఈ సినిమా గురించి ఇప్పటివరకు చాలానే విన్నాము. ఇక ఇప్పుడు అందరూ టిల్లు క్యూబ్ కోసం ఎదురుచూస్తున్నారు.

3. డియర్:
ఏప్రిల్ 11న తమిళంలో రిలీజైన ఈ చిత్రం.. ఒక్క రోజు తర్వాత ఏప్రిల్ 12న తెలుగులో కూడా విడుదలైంది. ఐశ్వర్య రాజేశ్, జీవీ ప్రకాశ్ కుమార్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం.. ఓ మంచి ఎమోషనల్ డ్రామా మూవీ, ఈ సినిమా అందరిని ఎంతో బాగా ఆకట్టుకుని నెట్ ఫ్లిక్స్ లో టాప్ 3 లో నిలిచింది.

4. ఆర్టికల్ 370
యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా.. సీక్రెట్ మిషన్ ఆధారంగా తీసుకుని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మొదటి నుంచే భారీగా హైప్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో నాలుగవ స్థానాన్ని సంపాదించుకుంది.

5. చమ్కీల:
భారతీయ సంగీత చరిత్రలో .. అప్పట్లో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన స్టార్ సింగర్ చమ్కీల. ఇప్పుడు “చమ్కీల” పేరుతో ఆయన జీవిత చరిత్ర మీద ఓ సినిమా తెరకెక్కింది. 1980’స్ లో పంజాబ్ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన సింగర్ .. చివరకు వివాదాల కారణంగా హత్యకు గురయ్యాడు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమానే “చమ్కీల”. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఐదవ స్థానాన్ని సంపాదించుకుంది.

6. డాంగే:
కాలేజ్ ఫెస్టివల్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా .. ఇద్దరు విడిపోయిన పాత స్నేహితుల మధ్య ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి మార్గాలలో వారు పయనించారు అనే కథాశంతో కొనసాగుతుంది. ఈ సినిమాకు నెట్ ఫ్లిక్స్ లో ఆరవ స్థానం లభించింది.

7. ఎనీ వన్ బట్ యు:
ఇది ఖచ్చితంగా యూత్ ను అట్ట్రాక్ట్ చేసే ఓ మూవీ.. తమ ఫస్ట్ డేట్ కు వెళ్లిన ఓ జంట.. మొదట్లో బాగానే ఉన్నా కానీ.. కొద్దీ రోజులకే ఒకరికి ఒకరు బోర్ కొట్టేస్తారు. కానీ అందరి ముందు మాత్రం పర్ఫెక్ట్ కపుల్ లా నటిస్తూ ఉంటారు. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఏడవ స్థానాన్ని దక్కించుకుంది.

8. ఆల్ ఇండియా ర్యాంక్:
ప్రస్తుతం బయట విధ్యార్ధుల మధ్యన ర్యాంక్స్ తెచ్చుకోవాలనే పోటీ ఎలా ఉంటుందో తెలియనిది కాదు. అలాంటి ఓ స్టోరీ నే ఈ సినిమా. ఓ 17 ఏళ్ళ అబ్బాయి IIT, MIT లలో సీట్ సంపాదించే క్రమంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కున్నాడు. అనేదే ఈ సినిమా.. పిల్లలతో పాటు తల్లి దండ్రులు కూడా తప్పక చూడాల్సిన సినిమా.. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఎనిమిదవ స్థానాన్ని సంపాదించుకుంది.

9. ఫైటర్:
హృతిక్ రోషన్, దీపికా పడుకోణె, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా.. కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా తీసుకుని తెరకెక్కించారు. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ లిస్ట్ లో తొమ్మిదవ స్థానాన్ని సంపాదించుకుంది.

10. సిటీ హంటర్:
సిటీ హంటర్ ఒక యాక్షన్ కామెడీ సినిమా.. ఈ సినిమా కొంతమంది అందమైన అమ్మాయిలను వెంటాడే.. ఓ డిటెక్టివ్ చుట్టూ తిరుగుతుంది. ఇక ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 లిస్ట్ లో పదవ స్థానాన్ని సంపాదించుకుంది.

మరి నెట్ ఫ్లిక్స్ లో టాప్ టెన్ లో కొనసాగుతున్న ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments