Family Star Movie Reveiw & Rating In Telugu: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా రివ్యూ!

Family Star Reveiw: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా రివ్యూ!

Vijay Devarakonda's Family Star Review Movie & Rating In Telugu: విజయ్ దేవరకొండ- మృణాళ్ ఠాకూర్ జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'ది ఫ్యామిలీ స్టార్'. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ జంట మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.

Vijay Devarakonda's Family Star Review Movie & Rating In Telugu: విజయ్ దేవరకొండ- మృణాళ్ ఠాకూర్ జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'ది ఫ్యామిలీ స్టార్'. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ జంట మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.

The Family Star

20240405, U/A
Action, Comedy
  • నటినటులు:విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్, జగపతిబాబు, వెన్నెల కిషోర్, తదితరులు
  • దర్శకత్వం:పరశురామ్
  • నిర్మాత:దిల్ రాజు
  • సంగీతం:గోపీ సుందర్
  • సినిమాటోగ్రఫీ:కేయూ మోహనన్

3

ఒక మంచి కథ దొరికితే చెలరేగిపోయే స్టార్ విజయ్ దేవరకొండ. ఒక మంచి స్టార్ దొరికితే.. మంచి అవుట్ పుట్ ఇచ్చే టెక్నీషియన్ పరశురాం. వీరిద్దరి కాంబోలో గీతాగోవిందం తరువాత తెరకెక్కిన మూవీ “ఫ్యామిలీ స్టార్”. ప్రమోషన్స్ తోనే ప్రామిసింగ్ ప్రాజెక్ట్ అనిపించుకున్న “ఫ్యామిలీ స్టార్” ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కథ:

గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) ఓ సాధారణ మధ్య తరగతి కుర్రాడు. కుటుంబ బాధ్యతలు అన్నీతానే మోస్తూ.., అందులోనే ఆనందం వెతుక్కుంటూ గడిపేస్తూ ఉంటాడు. అలాంటి గోవర్ధన్ జీవితంలోకి సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసేందుకు వచ్చిన ఇందు (మృణాల్ ఠాకూర్) ఎంట్రీ ఇస్తుంది. తన ఫ్యామిలీలోకి బయట వ్యక్తులు రావడం ఇష్టంలేని గోవర్ధన్ ముందుగా ఇందుని దూరం పెడతాడు. కానీ.., తరువాత ఆమె ప్రేమలో పడి, తన ఫ్యామిలీలో కలిపేసుకుంటాడు. అయితే.., గోవర్ధన్ తన ప్రేమని బయట పెట్టే సమయానికి ఓ అనుకోని సంఘటన జరుగుతుంది. అక్కడి నుండి గోవర్ధన్ జీవితమే మారిపోతుంది. అసలు ఇందు ఎవరు? గోవర్ధన్ జీవితంలోకి ఎందుకు వచ్చింది? వీరిద్దరి మధ్యలో వచ్చిన ట్విస్ట్ ఏమిటి? చివరికి ఈ జంట ఎలా కలిసింది అన్నదే మిగిలిన కథ!

విశ్లేషణ:

“ఐ లవ్ యూ అంటే ఒక వ్యక్తికి చెప్పేది కాదు.. ఆ కుటుంబం మొత్తానికి చెప్పేది”. ఈ ఒక్క డైలాగ్ చాలు పరశురాం “ఫ్యామిలీ స్టార్” కోసం ఎంత మనసు పెట్టి పని చేశాడో చెప్పడానికి. ఇలాంటి అద్భుతమైన డైలాగ్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. అంతలా పరశురాం పెన్ సక్సెస్ అయ్యింది. ఇలా పరశురాం మ్యాజిక్ చేయగా.. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇంత మంది పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఫ్యామిలీ స్టార్ స్థాయిని పెంచేశాయి. ముఖ్యంగా మనం మరచిపోతున్న కుటుంబ విలువలను ఇందులో చూపించిన విధానం అద్భుతంగా అనిపిస్తుంది. అక్కడక్కడ లాజిక్స్ కి అందని కొన్ని మూమెంట్స్ ఉన్నా.., ఎమోషనల్ జర్నీలో అవి పెద్దగా డిస్టర్బ్ చేయవు.

ప్రథమార్ధంలో హీరో క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. అయితే.., అక్కడ కూడా కామెడీ బాగా జనరేట్ అవడంతో టేకాఫ్ సాఫీగానే సాగినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే కథలోకి మృణాల్ ఎంట్రీ ఇచ్చిందో అక్కడి నుండి ఫ్యామిలీ స్టార్ గుడ్ ట్రాక్ లోకి వచ్చేసింది. ముఖ్యంగా విజయ్, మృణాల్ మధ్య సాగే కొన్ని సన్నివేశాలు.. “గీతాగోవిందం” ఫీల్ రిపీట్ చేశాయి. హీరోయిన్ గా మృణాల్ ని కాస్ట్ చేయడం చాలా బెటర్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు. ఆమె వల్ల కొన్ని సాధారణ సీన్స్ లో కూడా కొంత ఫ్రెష్ నెస్ యాడ్ అయ్యింది. ఇదే ఫస్ట్ ఆఫ్ కి చాలా ప్లస్ అయ్యింది. ఇక.. ఊహించిన ట్విస్ట్ తో ఫస్ట్ ఆఫ్ ముగియడం కూడా ఆడియన్స్ ని బాగా ఎంగేజ్ చేసింది.

ఫ్యామిలీ స్టార్ సెకండ్ ఆఫ్ అంతా విజయ్.. వన్ మ్యాన్ షో. కథ రీత్యా కూడా విజయ్ దేవరకొండకి స్క్రీన్ టైమ్ ఎక్కువ దొరకడంతో.. రౌడీ హీరో రెచ్చిపోయాడు. “గీతాగోవిందం” కన్నా ఇంకా సెటిల్డ్ టైమింగ్ తో విజయ్ చేసిన పర్ఫార్మెన్స్ సూపర్బ్ అని చెప్పుకోవచ్చు. కాకుంటే.. మృణాల్ క్యారెక్టర్ బాగా డల్ అయిపోవడంతో సినిమా కాస్త స్లో అయిన ఫీలింగ్ వస్తుంది. సరిగ్గా.. ఇదే సమయంలో జగపతిబాబు క్యారెక్టర్ తో.. కాన్ ఫ్లిక్ట్ పాయింట్ రివీల్ చేయించి.. డైరెక్టర్ కథలో వేగాన్ని పెంచడం కలిసి వచ్చింది. అక్కడి నుండి క్లైమ్యాక్స్ ఆకట్టుకునే విధంగా ఉండటం, చివరలో మృణాల్ ఎమోషనల్ యాక్టింగ్ తో అదరగొట్టడంతో ఫ్యామిలీ స్టార్.. మంచి చిత్రంగా నిలబడగలిగింది.

నటీనటుల పనితీరు:

విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ కుర్రాడిగా చేసిన యాక్టింగ్ అన్ మ్యాచబుల్. విజయ్ ఈ విషయాన్ని ముందు నుండి చెప్తూనే వచ్చాడు. ఇది మన కథ, మన అందరి ఇళ్లలో ఉండే కథ అని. విజయ్ ఆ పెయిన్ అంతా చూసి వచ్చిన మనిషి కావడంతో.. గోవర్ధన్ పాత్రలో లీనం అయిపోయాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సన్నివేశాల్లో చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ కనపరచడం అభినదించ దగ్గ విషయం. ఇక నటిగా మృణాల్ స్థాయి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అందంలో కూడా ఆమెది ఆ రేంజే. జగపతిబాబు, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను వంటి మిగతా తారాగణం అంతా ఓకే అనిపించారు. కానీ.., సెకండ్ ఆఫ్ లో వెన్నెల కిషొర్ ట్రాక్ పై ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే.. ఇంకా బెస్ట్ కామెడీ వర్కౌట్ అయ్యి ఉండేది.

టెక్నీకల్ విభాగం:

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. పాటల విషయంలో గోపీ సుందర్ పూర్తిగా నిరాశ పరిచాడు. బ్యాగ్రౌండ్ మాత్రం ఓకే అనిపించాడు. కేయూ మోహనన్‌ సినిమాటోగ్రఫీ ఓకే అనిపించుకోగా, ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేది. కాకుంటే.. మాస్ సినిమాల మాదిరి.. ఇలాంటి ఎమోషనల్ జర్నీ మూవీస్ కి ఎక్కువ కట్స్ పడే ఛాన్స్ ఉండదు. కాబట్టి.. స్క్రీన్ ప్లే ఆర్డర్ లోనే.. ఎడిటర్ ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్యామిలీ స్టార్ లో ఇదే జరిగింది. సినిమా మొత్తం మీద.. ఒక్క విషయంలో కూడా ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గలేదు. ఈ విషయంలో దిల్ రాజుని అభినందించాలి. చివరగా దర్శకుడు పరశురాం మళ్ళీ తన సత్తాని చాటాడు. సున్నితమైన భావోద్వేగాలను పట్టుకోవడంలో ఇప్పటి వరకు సక్సెస్ అవుతూనే వచ్చిన ఈ దర్శకుడు.. ఫ్యామిలీ స్టార్ విషయంలో కూడా విజయం సాధించాడు.

చివరి మాట: ఫ్యామిలీ స్టార్.. ఫ్యామిలీతో చూడాల్సిన చిత్రం

రేటింగ్ : 3/5

(*గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)
Show comments