సడెన్‌గా OTTలోకి వచ్చేసిన తెలుగు మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

OTT Release: ప్రతి వీకెండ్‌లానే ఈ శనివారం కూడా ఓ తెలుగు సినిమా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఇంతకు ఆ మూవీ ఏదంటే..

OTT Release: ప్రతి వీకెండ్‌లానే ఈ శనివారం కూడా ఓ తెలుగు సినిమా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఇంతకు ఆ మూవీ ఏదంటే..

వీకెండ్‌ వచ్చిందంటే చాలు.. ఓటీటీల్లోకి వచ్చే కొత్త సినిమాల కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అయితే సాధారణంగా వారం ప్రాంరభంలోనే.. ఆ వీక్‌ వివిధ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో స్ట్రీమింగ్‌ కాబోయే సినిమాల వివరాలు ప్రేక్షకులకు తెలుస్తాయి. అయితే కొన్ని సినిమాలు మధ్యలో.. సడెన్‌గా.. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతాయి. తాజాగా ఈ వీకేండ్‌కి ఓ తెలుగు మూవీ ఇలానే సడెన్‌గా ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంతకు ఇది ఏ సినిమా.. ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతుంది వంటి వివరాలు మీకోసం

ఈ వీకెండ్‌ మరో తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. గత నెలలో థియేటర్లలోనే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో, ఆకట్టుకోవడంలో విఫలమైంది. పైగా విడుదలకు ముందు నుంచి కూడా సినిమా మీద పెద్దగా బజ్‌ లేదు. పైగా రిలీజ్‌ అయ్యాక కూడా ప్లాఫ్‌ కావడంతో.. అందరూ ఆ సినిమా గురించి మర్చిపోయారు. అసలు అలాంటి ఓ సినిమా వచ్చిందని కూడా ఎవరికి గుర్తు లేదు. అలాంటి సినిమా ఇప్పుడు సడెన్‌గా ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీ ప్రేక్షకుల కోసం అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా ఏది అంటే..

సహాయ పాత్రలు చేస్తూ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అదిత్ అరుణ్.. ఆ తర్వాత హీరోగా మారాడు. 24 కిస్సెస్, చీకటి గదిలో చితక్కొట్టుడు, డియర్ మేఘ, ప్రేమదేశం తదితర చిత్రాలు చేశారు. కాకపోతే హిట్స్ లేకపోవడం వల్ల పెద్దగా ఫేమ్ సంపాదించలేకపోయాడు. ఈ క్రమంలోనే తాజాగా ఈ నటుడు ‘లైన్ మ్యాన్’ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఇదే సినిమాతో కన్నడలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అదిత్‌ అరుణ్‌ గత సినిమాల మాదిరే ఈ చిత్రం కూడా పెద్దగా విజయం సాధించలేదు.

ఇక అదిత్‌ అరుణ్‌ నటించిన లైన్‌మ్యాన్‌ సినిమా పోయిన నెల అనగా మార్చి 22న థియేటర్లలోకి వచ్చింది. తెలుగు-కన్నడ భాషల్లో రిలీజైంది. కాకపోతే బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. ఆ సినిమా ఇప్పుడు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఈ సినిమా అమెజాన్‌, హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ప్రముఖ ఓటీటీల్లో కాకుండా లోకల్ కన్నడ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఇది అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్ కూడా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఓ ఊరంతా కలిసి కొన్ని రోజులు కరెంట్ లేకుండా ఉండాలని ఫిక్సవుతారు. అయితే దీనికి కారణమేంటి.. ఏ పనికోసం అందరూ కరెంట్ లేకపోయినా పర్లేదు అని ఒప్పుకొన్నారు అనే కథాంశంతో ‘లైన్ మ్యాన్’ తీశారు. కానీ ఇది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

Show comments