Idream media
Idream media
పట్టుమని మూడు పదుల వయసు లేదు..ఎన్నికల్లో పోటీ చేసే వరకు పెద్ద ఇమేజ్ లేదు, సోషల్ మీడియాలో ఫాలోయింగ్ లేదు, రాజకీయాల్లో ఓనమాల దశలోనే ఉంది ఆ అమ్మాయి..ప్రత్యర్ధి పార్టీకి అది కంచుకోట అనే పేరు, రాష్ట్ర ప్రతిపక్ష నేత నియోజకవర్గం..దశాబ్దాలుగా ఆ పార్టీదే అక్కడ ప్రభావం, అలాంటి నియోజకవర్గంలో చరిత్ర సృష్టించింది యువ కెరటం. 40 ఏళ్ళ ఇండస్ట్రీకి మూడు పదుల వయసు కూడా లేకుండా మర్చిపోలేని షాక్ ఇచ్చింది.
ఆమె పేరే అశ్విని హాసినీ… పరిషత్ ఎన్నికల్లో కుప్పం ఎంపీటీసీ గా నిలిచి గెలిచింది. యువ నాయకత్వ సత్తా ఏంటో భారీ మెజారిటీ తో గెలిచి చూపించింది ఆ అమ్మాయి. రాజకీయాల్లో తల పండిన నేత అయినా సరే ఏ మాత్రం బెదురు లేకుండా ప్రజల్లో మమేకం అయింది. పరిషత్ ఎన్నికల విషయంలో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే… అధికార పార్టీ అక్రమాలకూ పాల్పడుతుందని ఆరోపించినా, అనుకూలంగా ఉన్న మీడియా లేనిదీ ఉన్నట్టు చూపించినా సరే, అశ్విని మాత్రం ఎక్కడా బెదరలేదు. తనకు ఉన్న వనరులను చక్కగా వాడుకుంది.
Also Read : టీడీపీ బూతు పంచాంగం – రాజకీయ ప్రణాళికలో భాగమేనా?
కుప్పం నియోజకవర్గ పరిధిలో ఎదురు లేదు అని భావించిన పసుపు జెండాకు చెమటలు పట్టించింది. 1240 ఓట్లు ఈ ఎన్నికల్లో పోల్ అవ్వగా… 1143 ఓట్లు అశ్వినికి వచ్చాయి. అంటే దాదాపుగా 90 శాతం పైగా ఓటింగ్ సాధించింది. కంచుకోటగా చెప్పుకునే ప్రతిపక్ష పార్టీకి వచ్చిన ఓట్లు కేవలం 70. ఈ విజయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయం అంటే మాటలు కాదు చేతలు అని చూపించి తన ప్రచార అస్త్రాలతో టీడీపీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.
టీడీపీ ఎమ్మెల్సీ, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి, సరిహద్దు నియోజకవర్గాల నాయకులు ఇలా ప్రతీ ఒక్కరు ఆమెను ఓడించే ప్రయత్నం చేసినా సరే ఆమె మాత్రం ఎక్కడా భయపడలేదు. జిల్లా నాయకత్వం అండగా నిలవడం, ప్రజల్లోకి తాను వెళ్లి ప్రచారం చేసిన విధానం, ఏళ్ళ తరబడి అక్కడ పాలకుడిగా ఉన్న నాయకుడు చేసింది శూన్యం కావడంతో ఆమె విజయం నల్లేరు మీద నడకే అయింది. ఈ విజయం తో టీడీపీ ఆత్మరక్షణ లో పడిపోయింది అనే కామెంట్స్ వినపడుతున్నాయి.
పంచాయితీ ఎన్నికల్లో కూడా టీడీపీ ఇక్కడ పెద్దగా ప్రభావం చూపించలేదు. అధికార పార్టీ లక్ష్యంగా, మంత్రి పెద్దిరెడ్డి లక్ష్యంగా ఎన్ని విమర్శలు చేసినా సరే… వైసీపీ ప్రభావం స్పష్టంగా కనపడింది. వెంట వెంటనే ఎన్నికలు జరిగినా ప్రచారానికి పెద్దగా సమయం లేకపోయినా కుప్పం నియోజకవర్గంలో పోటీ చేసిన అధికార పార్టీ అభ్యర్ధులు తమ సత్తా చూపించారు. ఇక బక్క పలుచుగా ఉండే అశ్విని నియోజకవర్గంలో బాహుబలులుగా గర్వంగా తిరిగే నాయకులకు పట్టపగలు చుక్కలు చూపించి జెండా ఎగురవేసింది.
Also Read : తెలుగు రాష్ట్రాల సీఎంల మనసులోని మాట కూడా చెబుతోన్న రాధాకృష్ణ