Idream media
Idream media
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు జూమ్ మీటింగ్ ల ద్వారా పాపులర్ అయితే.. జనసేనాని పవన్ కల్యాణ్ ట్వీట్లు.. ప్రెస్ నోట్ల రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజాక్షేత్రంలో మాత్రం ఉరుములా ఉరిమి, మెరుగుతీగలా ప్రత్యక్ష్యమై అకస్మాత్తుగా మాయమైపోతున్నారు. పవన్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచీ ఇదే తంతు ఎక్కువగా కొనసాగుతోంది.
ఏదైనా అంశంపై సీరియస్ గా చర్చలు జరుగుతున్న సమయంలో స్పందించకుండా.. సమస్య సద్దుమణుగుతున్న క్రమంలో హఠాత్తుగా పవన్ నుంచి ఓ స్టేట్ మెంట్ వస్తుంది. జల వివాదాలు, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ తదితర అంశాలకు సంబంధించి కేంద్రానికి కనీసం విన్నవించిన దాఖలాలు కూడా లేని పవన్ జగన్ ప్రభుత్వంపై మాత్రం విరుచుకు పడుతున్నారు. తాజాగా పవన్ చేసిన ఓ పోస్టుపై చర్చ జరుగుతోంది.
‘స్నాప్షాట్’ రూపంలో పవన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ప్రజాప్రయోజనాల కోసమా.. లేక వ్యక్తిగత ప్రయోజనాల కోసమా అనే చర్చ మొదలైంది. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై ప్రజా తీర్పు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. ‘సేవ్ ఏపీ ఫ్రమ్ వైఎస్ ఆర్ సీపీ’ అంటూ.. ఆ పోస్టులో పేర్కొనడం హాస్యాస్పదమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: అలా చేస్తే ఇరకాటంలో పడేది టీడీపీనే..!
రాష్ట్రాన్ని ‘అప్పుల ప్రదేశ్’ గా మార్చారంటూ సీఎం జగన్ పై కూడా ఆయన విమర్శలు చేశారు. ఏపీకి ఇప్పటి వరకు ఎందరు ముఖ్యమంత్రులుగా వచ్చారు, ఎవరు అప్పులు చేయలేదు.. అనే విషయాలను మరిచి జగన్ మాత్రమే అప్పులు చేస్తున్నారన్నట్లుగా పవన్ పేర్కొనడం వెనుక అసలు లక్ష్యం అంతుపట్టడం లేదు.
ఇక ప్రధానంగా ఆన్ లైన్ టికెటింగ్ పై పవన్ అభిమతం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవలే ఏపీ మంత్రి పేర్ని నానితో సినీ పెద్దలు సమావేశమయ్యారు. ఆన్‌లైన్ టికెట్ విధానంపై విజయవాడలో మంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతోపాటు దిల్ రాజు, డీఎన్‌వీ ప్రసాద్, ఆది శేషగిరి రావు, డీవీవీ దానయ్య వంటి వారు హాజరయ్యారు. భేటీలో ప్రధానంగా ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థ, కరోనా వలన సిని పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చర్చించారు.
అనంతరం నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ఆన్‌లైన్ టికెట్ విధానం తామే అడిగామని స్పష్టంగా పేర్కొన్నారు. దానితో పాటు 4 షోలు 12 గంటలలోపు పూర్తి చేయడంపై చర్చించినట్లు తెలిపారు. విద్యుత్ బిల్లుల అంశం, 100 శాతం ఆక్యుపెన్సీపై కూడా చర్చించామన్నారు. అన్ని వర్గాలు ఈ రోజు చర్చల పట్ల ఆనందంగా ఉన్నాయని, ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి కావాల్సినవి అన్ని ప్రభుత్వం చెప్పిందని త్వరలోనే సీఎం జగన్‌తో భేటీ అవుతామని వెల్లడించారు.
Also Read:మాచర్ల మాజీ ఎమ్మెల్యే మృతి
అయినప్పటికీ ఆన్ లైన్ టిక్కెట్ల బుకింగ్ కోసం ప్రభుత్వం ఒక వెబ్ పోర్టల్ ని ప్రారంభించడానికి తాను వ్యతిరేస్తున్నానని పవన్ పరోక్షంగా చెప్పాడు. అలాగే ఏదో ప్రభుత్వం స్వప్రయోజనం ఆశించి చేస్తున్నట్లుగా ఆయన పేర్కొనడాన్ని చూస్తే.. సినీ పెద్దలకు, పవన్ కు మధ్య ఉన్న తేడాను గుర్తించవచ్చు.
ఇక ఆ పోస్టులో కనిపిస్తున్న మరో అంశం ‘సేవ్ స్టీల్ ప్లాంట్’. స్టీల్ ప్లాంట్ ను సేవ్ చేయాల్సింది ఎవరు, అమ్మేస్తుంది ఎవరు.. అనే అంశాలపై కనీస అవగాహన లేనట్లుగా పవన్ వరుస ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకు కారణం స్టీల్ ప్లాంట్ ను రక్షించాల్సిందిగా కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సింది పోయి.. రాష్ట్రంపై విమర్శలు చేస్తుండడమే. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ప్రభుత్వ చిత్తశుద్ధి ఇప్పటికే చాలా సార్లు స్పష్టమైంది. అయినప్పటికీ పవన్ ఆ అంశంపై కూడా వైసీపీనే టార్గెట్ చేయడం హాస్యాస్పదంగా మారింది.
Also Read: రామచంద్రపురం మీద మంత్రి వేణు ముద్ర
ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను జగన్ చీట్ చేశారంటూ పోస్టులో చెప్పుకొచ్చారు. ఇది వాస్తవమా, కాదా అనేది సచివాలయాలే చాటి చెబుతున్నాయి. సుమారు 1.80 లక్షల మంది శాశ్వత, స్వచ్ఛంద ప్రాతిపదికన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందారు. పరోక్షంగా మరో లక్ష మంది ఉపాధి పొందుతున్నారు. ఉద్యోగులందరూ కళ్ల ముందే కనిపిస్తున్నారు. ఎన్నో ఏళ్లు తర్వాత యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగింది జగన్ సర్కార్ వచ్చాకే. జాబు కావాలంటే బాబు రావాలని నినదించిన వారిలో పవన్ కూడా ఉన్నారు.
బాబు వచ్చి అధికారంలో ఉన్న రోజుల్లో ఎన్ని జాబులు వచ్చాయి, ఉద్యోగాలు ఇవ్వని చంద్రబాబును ప్రశ్నించని పవన్.. ఉద్యోగావకాశాలు కల్పించి, కల్పిస్తూనే ఉన్న జగన్ పై విమర్శలు చేయడం ఎంత వరకు సబబనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా ఆ పోస్టులో ఉన్న ఏ అంశాన్ని పరిశీలించినా భిన్న వాదనలే వినిపిస్తున్నాయి.
Also Read: కొత్త ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఎప్పటి వరకు పదవిలో ఉంటారో తెలుసా?