బద్వేలు ఉప ఎన్నికలో పోటీపై టీడీపీ అధికారిక ప్రకటన

వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీపై రెండు రోజుల నుంచి జరుగుతున్న ఊహాగానాలకు తెలుగుదేశం పార్టీ తెరదించింది. ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. చనిపోయిన వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య సతీమణి పోటీ చేస్తున్నందున తాము పోటీకి దూరంగా ఉంటున్నట్లు టీడీపీ అధికారికంగా ప్రకటించింది. బద్వేలు ఉప ఎన్నికకు షెడ్యూల్‌ రాక ముందే.. అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఓబుళాపురం రాజశేఖర్‌ను ప్రకటించిన టీడీపీ ఇప్పుడు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించడం విశేషం.

వైఎస్సార్‌ కడప జిల్లాలోని పులివెందుల నేతలు.. రామ్‌మోహన్‌ రెడ్డి, బిటెక్‌ రవిలు పోటీ చేయాలంటుండగా.. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి మాత్రం పోటీ చేయడం వల్ల ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డారు. పోటీపై స్థానిక నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉండగా.. టీడీపీ పోలిట్‌బ్యూరో మాత్రం పోటీ చేయకూడదని నిర్ణయించింది. అయితే ఏ నిర్ణయమైనా నేతల ద్వారా చెప్పించే చంద్రబాబు నాయుడు.. ఈ విషయంలోనూ కూడా అదే పంథాను కొనసాగించారు. పోటీ చేయడం వల్ల ఉపయోగం ఉండదని జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి చెప్పినా.. అది చంద్రబాబు మాటగానే భావించవచ్చు.

పూర్తి వివరాలు ఈ కథనంలో చూడండి : బద్వేల్ పోటీ నుంచి టీడీపీ తప్పుకుంటుందా?

Show comments