Idream media
Idream media
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఒక్కసారిగా పొలిటికల్ హాట్ టాపిక్ గా మారారు. రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ వేదికపై నుంచి ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీపైన ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఆ పార్టీ నేతలు కూడా పవన్ కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. ఇలా ఐదు రోజులుగా ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి.
ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సందర్భంలో ఒక్కోసారి పవన్ మాట్లాడుతున్న తీరుపై చర్చ జరుగుతోంది. రెండు రోజుల క్రితం విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ ఉద్యమంపై ఆయన వ్యాఖ్యలను పలు కార్మిక సంఘాలు, వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. ఇప్పుడు తాజాగా నేను ఇప్పటి వరకు రాజకీయాలు చేయలేదని, ఇక నుంచి రాజకీయ నాయకుడిగా పనిచేస్తానని చెప్పడం జనసేన వర్గాలను కూడా విస్మయానికి గురి చేసింది.
2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపిస్తున్నట్టుగా సినీనటుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణలోని మాదాపూర్ ప్రాంతంలోని నోవాటెల్ భవనంలో ఆవిర్భావ సభ నిర్వహించాడు. సినిమాలకు కూడా గుడ్ బై చెప్పి.. ప్రజాసేవ కోసం రాజకీయాలకు పరిమితం అవుతానని ప్రకటించారు. అన్నట్లుగానే 2019 ఎన్నికల వరకు జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం జరిగిన తొలి ఎన్నికలో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతుగా పని చేశారు.
Also Read : బద్వేలులో జనసేన బాబు వెంట వెళుతుందా..? బీజేపీతో ఉంటుందా..?
అనంతరం గత ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 సీట్లలో కూడా పోటీకి పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టారు. ఫక్తు రాజకీయ నాయకుడిగా ప్రసంగాలు చేశారు. సినీ ఆకర్షణ ఉన్న పవన్ సభల్లో చప్పట్లు బాగానే మార్మోగేవి. కానీ ఓట్లు మాత్రం పడడం లేదు. ఫలితంగా 174 సీట్లలో జనసేన పరాభవం పాలైంది. పవన్ కల్యాణ్ కూడా ఓటమిని మూటగట్టుకున్నారు.
మళ్లీ సినిమాల బాట పట్టిన పవన్.. మధ్య మధ్యలో మెరిసి వైసీపీ ని టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేయడం.. మళ్లీ మాయం కావడం పరిపాటిగా మారింది. దేవాలయాలపై దాడులు వంటి సంఘటనల ద్వారా రాజకీయంగా లబ్ధి పొందేలా మాట్లాడారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీకి మద్దతుగా పవన్ పూర్తిగా కాషాయికరణ చెందిన వ్యక్తిగా మాట్లాడడం ఆయన అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. ఇలా రాజకీయంగా వ్యవహరించిన పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు రాజకీయ నాయకుడిని కాదని, ఇకపైనే రాజకీయాలు చేస్తానని తాజాగా పేర్కొనడం హాస్యాస్పదంగా మారింది. దీనిపై వైసీపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
Also Read : పవన్ మీద ఆశలతో పార్టీని విస్మరిస్తున్నారు, టీడీపీ నేతల్లో అంతర్మథనం
అప్పుడేమి చేశారు ?’: పిఠాపురం ఎమ్మెల్యే
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పవన్ .. మీరు ఇంకా సినిమా భాషని.. సొంత భాషని మరిచిపోయినట్లు లేరు. ఆల్ రెడీ మీరు పోటీ చేసిన రెండు నియోజకవర్గాలో ప్రజలు మీ తాట తీశారు. అయినా మీకు సత్యం బోధపడలేదు . ఆరు నెలలకొకసారి మీడియా ముందుకు వచ్చి.. నీ భాషలో మాట్లాడడం రాజకీయం కాదు’ అని హితవు పలికారు.
‘కాపు ఉద్యమ సమయంలో మీరు చంద్రబాబుతో కలిసి సమ్మగా అంబలి తాగుతున్నారు. కాపులకు ఇచ్చిన హమీని అమలు చేయమని అడిగిన ముద్రగడను కుటుంబంతో సహా మోకాలితో తన్నారు. ఆవేళ మీరు ఏమయ్యారు. ఇదేంటని చంద్రబాబును అడగాలని అనిపించలేదా? కాపు ఉద్యమంలో అందరికి ఆహ్వానం ఉంది. మీ అన్న చిరంజీవి వచ్చే ప్రయత్నం చేశారు. మరి నువ్వెందుకు రాలేదు’ అని ఎమ్మెల్యే దొరబాబు ప్రశ్నించారు. ‘వైజాగ్ ప్రజలు ఓడించారని స్టీల్ ప్లాంట్ కోసం పోరాడను అని అంటున్నావ్. మరి మీ పార్టీని రాష్ట్ర ప్రజలంతా ఓడించారు. అలాంటప్పుడు రాష్ట్రం కోసం ఎందుకు మాట్లాడుతున్నావ్. ఇప్పుడు కొత్తగా ఇంకేం రాజకీయాలు చేస్తావు’ అని ప్రశ్నించారు.
Also Read : పవన్ ది ప్రభుత్వంపై అక్కసా? ఉక్కు ఉద్యమంపై చిన్నచూపా?