Idream media
Idream media
అవును.. అది నిజమే ఆ చర్చ తెలంగాణలో ఇప్పుడు జోరుగా సాగుతోంది. వాస్తవంగా కూడా కేసీఆర్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేంటి.. కవిత కేసీఆర్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయడం ఏంటనే అనుమానం రావచ్చు. కానీ ఇది నిజమే. సాక్షాత్తూ పెద్దల సభలోనే కల్వకుంట్ల కవిత తన ఆవేదనను వ్యక్తం చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలపై కవిత శాసనమండలిలో గళం విప్పారు. ప్రతినిధులకు కనీసం కూర్చోడానికి కూడా కుర్చీలు లేవని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును నిలదీశారు. స్వయంగా ఎర్రబెల్లి చొరవ తీసుకోవాలని కోరారు. ఎంపీపీలకు తగిన కార్యాలయాలు లేవని విధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కవిత పేర్కొన్నారు.
గత కొన్ని రోజులుగా కేసీఆర్ కుటుంబంలో సఖ్యత లేదనే ప్రచారం జరుగుతోంది. ప్రతి ఏడాది తన సోదరుడు మంత్రి కేటీఆర్ కు కవిత రాఖీ కట్టేవారు. ఆ సందర్భంగా కవిత కేటీఆర్ కు ఇచ్చే బహుమతి చాలా భిన్నంగా ఉండేది. ఆ బహుమతి కూడా ఆలోచింపజేవిధంగా ఉండేది. అయితే ఈ ఏడాది ఆమె రాఖీ కట్టలేదు. ఊహించని విధంగా ఈసారి తన సోదరుడు కేటీఆర్ కు అసలు రాఖీనే కట్టకపోవడం పొలిటికల్ సర్కిళ్లలో పెద్ద చర్చ సాగింది. కేటీఆర్ కు రాఖీ కట్టకపోవడానికి కారణం ఏమై ఉంటుందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే రాఖీ కట్టకపోయినప్పటి కేటీఆర్ తో దిగిన ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పెట్టారు.
కవితకు మీడియాకు అధిక ప్రాదాన్యత ఇస్తుంది. ఇటీవల ఆమె ఎక్కడా మీడియాలో కనిపించిన సందర్భాలు కూడా లేవు. ఎందుకు ఆమె మీడియాకు కేసీఆర్ కుటుంబానికి దూరంగా ఉంటుందనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. తెలంగాణలో నిర్వహంచే అతి ముఖ్యమైన పండుగల్లో బతుకమ్మ పండుగ ఒకటి. ఈ ఉత్సావాల్లో కవిత సందడి చేసేవారు. తొమ్మది రోజులు బతుకమ్మను అలంకరించి ఆటపాటలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. మరి ఈ బతుకమ్మ పండుగను కవిత గతంలో మాదిరిగా ఉత్సాహం జరుకుంటుందా లేదా అనే సందేహం కూడా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఒక్కసారి కవిత తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి చేయడం పెద్ద చర్చకు దారితీసింది. ఆమెను ఎమ్మెల్సీగా చేసినప్పటి నుంచీ కేబినెట్ లోకి తీసుకుంటారనే ప్రచారం జోరుగా సాగింది. ఇప్పటి వరకు కవితకు ఆ అవకాశం దక్కలేదు. ఈ క్రమంలో తాజాగా ఆమె ప్రభుత్వంపై అసంతృప్తి చేయడంపై పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.