ఐపీఎల్ 2021# చెన్నై -ముంబై మ్యాచ్ – మ్యాచ్ హీరో అతను

టాస్ గెలిచిన చెన్నై… బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ.. పిచ్ రిపోర్ట్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంది… చెన్నై తొమ్మిదో వికెట్ వరకు బ్యాటింగ్ ఉంది… అంటే దాదాపుగా చెన్నై 180 నుంచి 200 కొట్టొచ్చు… మొదటి ఓవర్ పడటానికి ముందు క్రికెట్ ఫాన్స్ లో ఉన్న అంచనాలు అవి. బౌల్ట్ ఫస్ట్ ఓవర్, బ్యాట్ కి బాల్ తగిలినా తగలకపోయినా భయమే… సీనియర్ ఆటగాడు డూప్లేసిస్ తొలి ఓవర్ చివరి బంతికి అవుట్. అతని నుంచి అర్ధ సెంచరీ ఆశించింది టీం. కాని షాక్ ఇచ్చాడు… ఆ వెంటనే రెండో ఓవర్ లో హిట్టర్ మోయీన్ అలీ డకౌట్…

ఆ తర్వాత అంబటి రాయుడు గాయంతో డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్ళిపోయాడు. ఆ వెంటనే పొట్టి ఫార్మాట్ స్పెషలిస్ట్ రైనా… బౌల్ట్ బౌలింగ్ లో కేవలం నాలుగు పరుగులకే అవుట్. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ ధోనీ… మూడు పరుగులకే అనవసర షాట్ కు అవుట్. ఈ పరిస్థితిలో టీం స్కోర్ కనీసం వంద అయినా దాటుతుందా అనే అనుమానాలు. ఆ తర్వాత వచ్చింది జడేజా… హిట్టింగ్ చేయగలడు లేదా స్టాండ్ ఇవ్వగలడు… భారీ ఇన్నింగ్స్ ఆడతాడో లేదో అనే అనుమానాలు. జట్టులో ఉన్న బ్యాట్స్మెన్ లో టాప్ ఆర్డర్ లో రుతురాజ్ గైక్వాడ్.

అతను అనుభవం లేని ఆటగాడు ఒత్తిడి తట్టుకుంటాడా అనే అనుమానాలు. ముంబై బౌలింగ్ చాలా కట్టుదిట్టంగా ఉంది. అప్పటి వరకు జట్టు స్కోర్ కనీసం వంద నుంచి 120 పరుగులు ఉంటే చాలు అనుకున్నారు. జడేజా తో కలిసి గైక్వాడ్ నిదానంగా ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్ళాడు. జడేజా వన్డే తరహాలో ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపిస్తున్నాడు. వీరి జోడీని విడగొట్టాలని ముంబై కెప్టెన్ పోలార్డ్… క్రునాల్ పాన్ద్యాకు బౌలింగ్ అప్పగించాడు. అప్పటి వరకు ఆచితూచి ఆడిన గైక్వాడ్ ఒక్కసారిగా గేర్ మార్చేశాడు.

ఊహించని షాట్ లతో ఆ ఒక్క ఓవర్ లో 18 పరుగులు రాబట్టింది చెన్నై. ఇక అక్కడి నుంచి గైక్వాడ్ దూకుడుగా ఆడటం

మొదలుపెట్టాడు. 17 వ ఓవర్ బూమ్రా… ఈ ఓవర్ నుంచి జట్టుకి స్కోర్ పెంచే పరిస్థితి. రెండో బాల్ కు గైక్వాడ్ కవర్స్ లో కొట్టిన సిక్స్ కు మ్యాచ్ చూసే వాళ్ళు ఫిదా అయిపోయారు. ఆ ఓవర్ లో మొత్తం జట్టుకి 9 పరుగులు వచ్చాయి. అయితే భారీ షాట్ ఆడటానికి ప్రయత్నం చేసి జడేజా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్రావో ఇన్నింగ్స్ కు ముంబై శిభిరం లో చెమటలు పట్టాయి.

బౌల్ట్ ఓవర్ లో అతను కొట్టిన మూడు సిక్స్ లు మ్యాచ్ స్వరూపాన్నే పూర్తిగా మార్చేశాయి. 8 బంతుల్లో 23 పరుగులు చేసి జట్టు స్కోర్ ని పరుగులు పెట్టించాడు. బ్రావో అవుట్ అయ్యేసరికి ఇంకో నాలుగు బంతులు మిగిలి ఉన్నాయి. చివరి ఓవర్ కాబట్టి కనీసం రెండు సిక్స్ లు అయినా ఆశించారు. బూమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం తో పెద్దగా పరుగులు రాలేదు గాని గైక్వాడ్ చివర్లో కొట్టిన సిక్స్ కు మైదానంలో మ్యాచ్ చూసేవాళ్ళు అందరూ షాక్ అయ్యారు. ఈ మ్యాచ్ లో గెలుపు ఓటమిని పక్కన పెట్టి మ్యాచ్ చూస్తే గైక్వాడ్ ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది.

58 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సులతో 88 పరుగులు చేసాడు. సీనియర్ లు అవుట్ అవుతున్నా సరే ఏ మాత్రం కూడా అతనిలో ఒత్తిడి కనపడలేదు. కీలక వికెట్ లు పడిన తర్వాత చాలా కూల్ గా ఆడుతూ… తన పని తాను చేసాడు. చెన్నై స్కోర్ అక్కడి వరకు వెళ్ళింది అంటే కచ్చితంగా అది అతని పుణ్యమే. పిచ్ స్వింగ్ కి అనుకూలంగా ఉన్నప్పుడు డిఫెన్స్ ఆడుకుని అవసరం అయితే బంతులను వదిలేసి… బంతి పాతబడిన కొద్దీ దూకుడుగా ఆడాడు. అతను ఆడిన షాట్ లు కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి.

Show comments