Dharani
Election 2024: రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. జూన్ 4 కౌంటింగ్ వరకు వాటిని భద్రంగా కాపాడాలి. మరి ఈవీఎంలకు ఎలాంటి భద్రత కల్పిస్తారు అంటే..
Election 2024: రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. జూన్ 4 కౌంటింగ్ వరకు వాటిని భద్రంగా కాపాడాలి. మరి ఈవీఎంలకు ఎలాంటి భద్రత కల్పిస్తారు అంటే..
Dharani
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా.. దేశవ్యాప్తంగా మే 13, సోమవారం నాడు.. నాలుగో దశ పోలింగ్ ముగిసింది. దీనిలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం జనాలు ఓటేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ జరగ్గా.. తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏపీలో భారీ పోలింగ్ నమోదయ్యింది. ఓటేసేందుకు జనాలు పోటెత్తారు. అర్థరాత్రి వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. అక్కడక్కడ చెదరుమదురు ఘటనలు మినహాయిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సార్వత్రిక ఎన్నికలు ఇంకా ముగియలేదు. మరో మూడు ఫేజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పోలింగ్ పూర్తైన నియోజకవర్గాల్లో.. ఈవీఎంల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జూన్ 4న కౌంటింగ్ ఉండగా.. అప్పటి వరకు అనగా మూడు వారాల పాటు.. ఎంతో సురక్షితంగా ఈవీఎంలను కాపాడేందుకు ప్రభుత్వం, ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంది.
పోలింగ్ ముగిసిన తర్వాత.. ఈవీఎంలను సురక్షితంగా ఉంచేందుకు వాటిని స్ట్రాంగ్ రూమలుకు తరలించారు. ఇప్పటికే వాటిని రెడీ చేశారు ఈసీ అధికారు. ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను ఉంచడానికి స్ట్రాంగ్ రూమ్ చాలా సురక్షితమైన ప్రాంతం. ఒక్కసారి వీటిని ఇక్కడకు చేరిస్తే.. కనీసం చీమ కూడా ఇక్కడ దూరేందుకు అవకాశం లేదు. అంత భద్రత ఏర్పాటు చేస్తారు. అందుకే వీటిని స్ట్రాంగ్ రూమ్‌లు అంటారు. మిగతా దశల్లో పోలింగ్ ముగిసిన తర్వాత.. కౌంటింగ్ నాడు.. ఈవీఎంలను.. స్ట్రాంగ్ రూమ్ నుంచి బయటకు తీసుకెళ్తారు.
ఇక ఈవీఎంలను భద్రపర్చడానికి ఉపయోగించే స్థలం.. దాని స్వంత ప్రమాణాలను కలిగి ఉంటుంది. ఎన్నికల సంఘం ప్రకారం స్ట్రాంగ్ రూమ్‌గా నిర్ణయించిన గదికి ఒకే తలుపు ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడనికి వేరే మార్గం కూడా ఉండదు. గదిలో డబుల్ లాక్ సిస్టమ్ ఉంటుంది. ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను ఇక్కడ ఉంచిన తర్వాత.. స్ట్రాంగ్‌రూమ్‌కు తాళం వేసి ఉంచుతారు. దాని తాళాల్లో ఒకటి ఇంఛార్జ్, ఏడీఏం లేదా.. అంతకంటే ఎక్కువ స్థాయి అధికారి వద్ద ఉంటుంది. ఇక స్ట్రాంగ్ రూమ్‌ను తయారు చేసేటప్పుడు.. వర్షం, వరద నీరు చేరకుండా ఎత్తుగా ఉండే గదిని సెలక్ట్ చేసుకుంటారు. అలాగే అగ్ని ప్రమాదం నుంచి కాపాడేలా స్ట్రాంగ్ రూమ్‌ను ఏర్పాటు చేస్తారు.
ఈవీఎంలు, వీవీప్యాట్‌లను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. స్ట్రాంగ్‌రూమ్ భద్రత కోసం.. సీఏపీఎఫ్ జవాన్లను నియమించారు. వీరు 24 గంటల పాటు విధుల్లోనే ఉంటారు. భద్రతా సిబ్బంది మోహరింపు మాత్రమే కాక.. సీసీ కెమరాల ద్వారా.. 24 గంటల పాటు స్ట్రాంగ్ రూమ్‌ని పర్యవేక్షిస్తారు. దాని ముందు భాగంలో.. కంట్రోల్ రూం ఏర్పాటు చేసి.. దాని భద్రతను పర్యవేక్షిస్తారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్‌ని పర్యవేక్షించడం కోసం.. ఒక పోలీసు అధికారి, ప్రభుత్వ అధికారి అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటారు.
ఇక స్ట్రాంగ్ రూమ్‌కి మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తారు. మొదటి సర్కిల్‌కి సీఏపీఎఫ్ గార్డులు కాపలగా ఉంటారు. రెండో సర్కిల్‌కి పోలీసు బృందం, మూడో సర్కిల్ భద్రత కోసం జిల్లాల కార్యనిర్వాహక దళానికి చెందిన గార్డులను మోహరిస్తారు. 24 గంటలు సీసీటీవీ కెమరాలు రికార్డ్ చేస్తూనే ఉంటాయి. స్ట్రాంగ్ రూమ్‌కి నిరంతర విద్యుత్ సరఫరా ఉంటుంది. జనరేటర్‌లు కూడా ఏర్పాటు చేస్తారు. కౌంటింగ్ తేదీ వరకు కనీసం చీమ కూడా దూరలేనంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి.. ఈవీఎంలు, వీవీప్యాట్‌లను సంరక్షిస్తారు.