Idream media
Idream media
ఏపీలో జరుగుతున్న బద్వేల్ ఉప ఎన్నిక రాజకీయంగా కొత్త సమీకరణాలను తెరపైకి తెస్తోంది. ఇప్పటి వరకు వెల్లువెత్తుతున్న అనుమానాలను బలపరుస్తోంది. పవన్ బీజేపీకి దూరమై, మళ్లీ టీడీపీకి దగ్గరవుతారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. బద్వేల్ పై జనసేన, టీడీపీ, బీజేపీ తీసుకున్న నిర్ణయాలతో ఈ తరహా చర్చ జరుగుతోంది. పవన్ ఎప్పటికీ మాకు మిత్రుడే అంటున్న బీజేపీ మాత్రం జనసేనాని ప్రకటనకు విలువ ఇవ్వకుండా ఉప ఎన్నికలో పోటీకి ఆసక్తి చూపుతోంది. అప్పటికే అభ్యర్థిని ప్రకటించిన తెలుగుదేశం మాత్రం పవన్ ప్రకటన అనంతరం పోటీ నుంచి తప్పుకుంది. దీంతో కొత్త పొత్తు ల అంశం తెరపైకి వచ్చింది.
నవ్యాంధ్రప్రదేశ్ తొలి ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పార్టీలకు పవన్ కల్యాణ్ మద్దతుగా నిలిచారు. ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. కొద్ది కాలం తర్వాత గడిచేకొద్దీ ప్రత్యేక హోదా పేరుతో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం నుంచి తన మంత్రులను ఉప సంహరించుకున్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందంటూ టీడీపీకి జనసేన అధినేత పవన్ గుడ్ బై చెప్పారు. ఫలితంగా ఏపీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసారు. అనంతరం ఏడాదిన్నర తర్వాత జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కొంత కాలంగా టీడీపీ కూడా వారితో కలిసేందుకు ఉత్సాహం చూపుతున్నా.. బీజేపీ మాత్రం ససేమిరా అంటోంది. అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఢీ కొట్టాలంటే ఒంటరిగా తన వల్ల కాదని భావిస్తున్న టీడీపీ పొత్తుల కోసం అర్రులు చారుస్తోంది.
Also Read : ఎట్టకేలకు కన్నా లక్ష్మీనారాయణకు పదవీ
ఉప ఎన్నిక వద్దు పోటీ అసలు వద్దు అంటూ స్వస్తి చెప్పేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆ సమయంలో ఆయన మిత్రపక్షం బీజేపీతో చర్చించారో లేదో తెలియదు కానీ ఇపుడు బీజేపీ మాత్రం మేము పోటీకి రెడీ అంటోంది. బద్వేల్ పోరుకు బస్తీమే సవాల్ అని కమలనాధులు తెగ హుషార్ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్ధిని కూడా ఖరారు చేసింది. అంతే కాదు తమ పార్టీ అభ్యర్ధి తరఫున ప్రచారం చేయడానికి మిత్రుడు పవన్ బద్వేల్ వస్తారని ధీమాగా ప్రకటిస్తున్నారు. అంతే కాదు పవన్ ఎప్పటికీ మా మిత్రుడే మా దోస్తీ మీద అంతా బేఫికర్ గా ఉండొచ్చు అంటూ కూడా చెబుతున్నారు. టీడీపీ బీజేపీ పొత్తు ఊహాగానాల మీద అసలు మాట్లాడనని సోము వీరాజు అంటున్నారు.
కానీ పవన్ ఉప ఎన్నికే వద్దు ఏకగ్రీవం అయితే బెస్ట్ అంటూ చెప్పేశారు. ఆయన మాటను విన్నట్లుగా టీడీపీ కూడా బద్వేల్ లో పోటీ వద్దు అనుకుంది. అంటే నిజమైన మిత్రుడి మాదిరిగా టీడీపీ పవన్ నిర్ణయాన్ని సమర్ధించడమే కాదు తాను అమలు చేసింది. కానీ తమకు ప్రాణ మిత్రుడు పవన్ అంటున్న బీజేపీ మాత్రం మొండిగా పోటీకి రెడీ అంటోంది. ఇక పవన్ని తెచ్చి ప్రచారం చేయిస్తామని చెప్పడం కూడా వింతా విడ్డూరమే. మరి ఇదంతా పవన్ని టెస్ట్ చేయడానికా లేక బద్వేల్ పోరుతో మిత్రుడి వ్యవహారం ఏంటన్నది చూడాలన్నా కోరిక ఏమైనా ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది.
Also Read : ఇక ఈటల కూడా బీజేపీ ‘కీలక’ నేత.. స్పెషల్ స్టేటస్