గోదాట్లో కలిసిన బుచ్చయ్య పెద్దరికం..!

వ్యక్తిగత, ఉద్యోగ జీవితమైనా, ప్రజా జీవితమైనా ముందు ఉన్న వాళ్లను చూసి కొత్తతరం నేర్చుకుంటుంది. డక్కీమొక్కీలు తీన్న పెద్దలు నడిచే బాట ఆదర్శంగా ఉంటుందని చెబుతారు. అందుకే పెద్దలను చూపి వారి బాటలో నడవాలని సూచిస్తుంటారు. పెద్దల మాట, బాటకు అంత విలువ ఉంటుంది. వ్యక్తిగత, ఉద్యోగ జీవితంలో ఈ విషయంలో ఏ మార్పులేకపోయినా.. ప్రజా జీవితంలో మాత్రం బలీయమైన మార్పే వచ్చింది. యువ నాయకులకు ఆదర్శంగా ఉండాల్సిన సీనియర్‌ నేతలు.. కట్టుతప్పి నడుస్తున్నారు. దుందుడుకు చర్యలు, మాటలతో యువతను మించిపోతున్నారు. వారికి హితబోధ చేయాల్సిన సాటి సీనియర్లు.. అది చేయకపోగా వెనకేసుకొస్తూ.. పెద్దరికానికి కొత్త అర్థం చెబుతున్నారు.

తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఆయనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణం. కానీ వ్యక్తిగత దూషణలు, అసభ్యపదజాలం ఉపయోగించడం గర్హనీయం. అయ్యన్న వ్యాఖ్యల తీవ్రతను తగ్గించేందుకు.. టీడీపీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. చెత్తపై పన్ను వేసే పాలనను చెత్తపాలన అనక మరేమంటారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను మరపించే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read : సీఎం జగన్‌పై అయ్యన్న అనుచిత వ్యాఖ్యలు.. చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు

అయితే ఆయ్యన్న మాత్రం.. వీరికి భిన్నంగా.. తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు. ‘‘ చర్చికి వెళ్లినప్పుడు ఫాదర్‌.. ఓహ్‌ మై సన్‌ అంటారు.. ఫాదర్‌ అంటే తప్పులేనిది.. నేను అంటే తప్పు కనిపించిందా..? ’’ అంటూ తన వ్యాఖ్యలను ఎవరూ హర్షించని రీతిలో సమర్థించుకుంటున్నారు.

ఇలాంటి తీరుతో వ్యవహరిస్తున్న అయ్యన్న పాత్రుడుకు హితబోధ చేయాల్సిన టీడీపీ సీనియర్‌ నేతలు కూడా ఆయన్ను వెనకేసుకొస్తున్నారు. అయ్యన్న చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఏముందంటూ.. సీనియర్‌ ఎమ్మెల్యే 76 ఏళ్ల గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నిస్తున్నారు. అయ్యన్నపాత్రుడు వాస్తవాలు చెబితే ఎందుకు భరించలేకపోతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

బహుసా అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు బుచ్చయ్య చౌదరి పూర్తిగా విన్నట్లు లేరు. అయ్యన్న పాత్రుడు ప్రభుత్వాన్ని విమర్శించారనే గోరంట్ల భావిస్తున్నట్లున్నారు. ఇలా అయితే అయ్యన్నపాత్రుడును గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెనకేసుకురావడాన్ని తప్పుబట్టలేం. కానీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని అయ్యన్నపాత్రుడు వాడిన పదజాలం విని కూడా.. ఆయన్ను వెనకేసుకొస్తే మాత్రం.. బుచ్చయ్య చౌదరి వయసు, ఇన్నేళ్ల రాజకీయ అనుభవం గోదాట్లో కలిసినట్లే.

Also Read : అయ్యన్నా.. మరీ ఇంత దిగజారుడా?!

Show comments