ఎట్టకేలకు ఆనం విజయ్ కుమార్ కుటుంబానికి పదవి

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి అనేక కుటుంబాలు రాజకీయాల్లోకి వచ్చాయి. ప్రజా జీవితంలో తమదైన ముద్ర వేశాయి. నెల్లూరు జిల్లా నేతలకు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన గెలిచిన చరిత్ర ఉంది. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్‌ రాజకీయాల్లో ఉన్న కుటుంబం ఆనం వారిది. 8 దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్నా వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లాలో ఆనం కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత దక్కింది.

ప్రస్తుతం ఆ కుటుంబం నుంచి తొలిసారి ఓ మహిళ ప్రజా జీవితంలోకి వచ్చారు. ఆనం రామ్‌నారాయణరెడ్డి, వివేకానంద రెడ్డి, జయకుమార్‌ రెడ్డి, విజయకుమార్‌రెడ్డిలు సోదరులు.ఆనం నలుగురు సోదరుల్లో విజయ్‌కుమార్‌ రెడ్డి,జయకుమార్ రెడ్డి కవలలు. విజయ్‌కుమార్‌ రెడ్డి  సతీమణి ఆనం అరుణమ్మ జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా పదవీ బాధ్యలు స్వీకరించారు.

ఆనం వివేకానంద రెడ్డి చనిపోయారు. ప్రస్తుతం ఆనం రామ్‌నారాయణ రెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆది నుంచి ఆనం విజయకుమార్‌ రెడ్డి.. తన అన్నలకు మద్ధతుగా ఉన్నారు. రాజకీయంగా వారి వ్యవహారాలను చక్కబెట్టారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు సిటీ, రూరల్‌ నియోజకవర్గంలో విజయకుమార్‌ రెడ్డి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అనుచరగణాన్ని తయారు చేసుకున్నారు.విజయకుమార్ రెడ్డి,డీకే అరుణ వియ్యంకులు. విజయ కుమార్ రెడ్డి కొడుకు కార్తీక్ డీకే అరుణ కూతురిని వివాహం చేసుకున్నాడు.

Also Read : బోయ గిరిజమ్మ జెడ్పీ చైర్మన్ కావటానికి నాటి పసుపు కుంకుమ పోరాటమే కారణమా?

రాష్ట్ర విభజన తర్వాత ఆనం సోదరులు.. టీడీపీలో చేరారు. వారితో విభేదించిన ఆనం విజయకుమార్‌ రెడ్డి వైసీపీలో చేరారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తమ కుటుంబానికి సముచిత స్థానం ఇచ్చారన్న ఆయన వైఎస్‌ జగన్‌ వెంట నడిచారు. ఆనం సోదరుల్లో ఏర్పడిన ఈ చీలిక అప్పట్లో జిల్లాలో హాట్‌ టాపిక్‌ అయింది. ఎన్ని అడ్డంకులు, ఒత్తిడిలు వచ్చినా ఆనం విజయకుమార్‌ రెడ్డి వైఎస్‌ జగన్‌ వెంట నడిచారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం నుంచి 2019లో పోటీ చేయాలని ఆశించారు. అయితే సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డికి మరోమారు సీటు దక్కినా.. ఆనం విజయకుమార్‌ రెడ్డి ఎక్కడా నిరుత్సాహపడలేదు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించారు. కోటం రెడ్డి విజయానికి పని చేసి వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై అచెంచల విశ్వాసంతో మెలిగారు.

Also Read : విశ్వాసానికి అందలం.. దళిత మహిళా నేతకు జెడ్పి పదవి 

వైసీపీ అధికారంలోకి రావడంతో పార్టీ పట్ల విధేయతతో, వైఎస్‌ జగన్‌ నాయకత్వంపై నమ్మకంతో పని చేసిన ఆనం విజయకుమార్‌ రెడ్డికి మంచి పదవి దక్కుతుందని పార్టీలో చర్చ జరిగింది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ప్రచారం కూడా సాగింది. అయితే అందరి అంచనాలకు భిన్నంగా.. ఆనం విజయకుమార్‌ రెడ్డి సతీమణì ని నెల్లూరు జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ పీఠంపై కూర్చొబెట్టారు వైఎస్‌ జగన్‌.

నెల్లూరు జిల్లాలో 46 జడ్పీటీసీలకు గాను అన్ని స్థానాలను వైసీపీ గెలుచుకుంది. నెల్లూరు రూరల్‌ మండలం నుంచి ఆనం అరుణమ్మ జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఆనం అరుణమ్మ, మాజీ మంత్రి, బీజేపీ నేత డికే అరుణలు వియ్యపురాళ్లు. అరుణమ్మ కుమారుడు కార్తికేయ రెడ్డికి, డీకే అరుణ మూడో కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. వియ్యపురాలు డికే అరుణ మాదిరిగానే ఆనం అరుణమ్మ కూడా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు.

Also Read : జడ్పీ చైర్మన్‌ వెంకాయమ్మ అంటేనే డేరింగ్ డెసిషన్స్

Show comments