Idream media
Idream media
అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో బాఘంబరీ మఠంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలు అనుమానాల నేపథ్యంలో ఆశ్రమంలోని వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు.
అఖిల భారతీయ అఖాడా పరిషత్ కు భారతదేశంలోని సాధువుల సంస్థల్లో ప్రముఖంగా పేరుంది. అయోధ్యలో రామ జన్మభూమి వివాదంలో ఈ సంస్థ పోరాడింది. హిందూ మతం, సంస్కృతి పరిరక్షణ కోసం పాటు పడుతోంది. ఈ సంస్థకు అధ్యక్షుడిగా మహంత్ నరేంద్ర గిరి వ్యవహరించేవారు.
సోమవారం ఈయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన భౌతికకాయం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ఉన్న బాఘంబరి మఠంలో కనుగొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆయన ఉరి వేసుకున్నట్టు తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు. అయిదు పేజీల సూసైడ్ నోట్‌ను కూడా కనుగొన్నారు.
Also Read:ఆ ఎన్నికల్లో మోదీ మంత్రం పనిచేయదు! బీజేపీలో యడ్డీ వ్యాఖ్యల కలకలం
సహజ మరణమేనా..?
ఇటీవల తన శిష్యుడు స్వామి ఆనంద గిరి, స్వామీజీ నరేంద్ర గిరికి మధ్య వివాదం చెలరేగినట్లు ప్రచారం జరుగుతోంది. సన్యాసి నిబంధనలకు విరుద్ధంగా తన శిష్యుడు.. కుటుంబాన్ని తరచుగా కలుస్తున్న కారణంగా ఆయనను బాఘంబరీ మఠం నుంచి బహిష్కరించారు స్వామీజీ. ఆ తర్వాతే ఆయన పరమపదించడం పలు అనుమానాలకు తావిస్తుందని ఆశ్రమవాసులు అంటున్నారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫోరెన్సిక్ బృదంతో పాటు ఒక ప్రత్యేక బృందం ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించింది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆశ్రమంలోని వ్యక్తులను విచారిస్తున్నారు.
ప్రధాని మోదీ సంతాపం
కాగా, మహంత్ నరేంద్ర గిరి ఇక లేరనే వార్త విషాదం నింపినట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఒక ట్వీట్‌లో సంతాపం తెలిపారు. మహంత్ నరేంద్ర గిరి మృతిపై ముందుగా స్పందించిన వారిలో సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఉన్నారు. నరేంద్ర గిరి స్వామీజీ మరణం తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి, ఆయన శిష్యులకు మనోనిబ్బరం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానని అన్నారు. కాగా, మమంత్ నరేంద్ర గిరి ఈ ఏడాది జూలైలో కరోనా పాజిటివ్‌తో రిషీకేష్‌లోని ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. స్వస్థత చేకూరిన తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
Also Read:హెరాయిన్- ఆంధ్రప్రదేశ్ : బోడిగుండుకు మోకాలికి ముడిపెడుతున్న ఓ వర్గం మీడియా