రాజేంద్రప్రసాద్.. టాలీవుడ్ సినీ చరిత్రలో కామెడీ హీరోగా చెరగని ముద్రవేశారు. ఆయన సినీ కెరీర్ లో చేసినన్ని కామెడీ మూవీలు మరే హీరో చేయలేదు అంటే అతిశయోక్తికాదు. తనదైన కామెడీ టైమింగ్ తో కామెడీ కింగ్ గా అవతరించారు రాజేంద్రప్రసాద్. తన హాస్యంతో ఎప్పుడూ నవ్వించే ఈ నవ్వుల రారాజు జీవితంలో గుండెలు పగిలే విషాదం ఉందని ఎవరూ ఊహించి ఉండరు. తాజాగా తన జీవితంలో ఉన్న విషాదాన్ని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. దీంతో ఎప్పుడూ నవ్వుతూ ఉండే రాజేంద్రప్రసాద్ లైఫ్ లో ఇంత బాధ ఉందని తొలిసారి లోకానికి తెలిసింది.
దసరా పండగ సందర్భంగా ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, నటి గౌతమి. వీరిద్దరు కలిసి నటించిన చిత్రం ‘#కృష్ణారామా’. ఈ మూవీ దసరా పండగ కానుకగా ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో సినిమా ప్రమోషన్లో భాగంగా.. ‘సుమ అడ్డా’ షోకు టీమ్ తో పాటు వచ్చారు. ఇక వీరితో పాటు రచ్చ రవి, మూవీ డైరెక్టర్ రాజ్ కూడా వచ్చారు. ఇక ఈ షోలో తన కామెడీ టైమింగ్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నారు రాజేంద్రప్రసాద్. ఇదిలా ఉండగా దసరా పండగను మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు అని సుమ ప్రశ్నించారు.
ఈ సందర్బంగా రాజేంద్రప్రసాద్ తన జీవితంలో దాగున్న విషాదాన్ని చెప్పుకొచ్చారు. “నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. అప్పుడు నాకు మూడు నెలలు ఆల్ మోస్ట్ చనిపోయే స్టేజ్ కు వెళ్లినప్పుడు.. నన్ను కనకదుర్గ గుడికి తీసుకెళ్లి ఒరేయ్ ఇక నుంచి మీ అమ్మ ఇంటి దగ్గర ఉండదు. ఇక్కడే ఉంటుందని అన్నారు” అంటూ భావోద్వేగానికి లోనైయ్యారు నటకిరీటి. దీంతో ఎప్పుడూ నవ్విస్తూ కనిపించే రాజేంద్రప్రసాద్ ను అలా చూసి.. అక్కడ ఉన్నవారంత కూడా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇప్పటికీ అభిమానులను నవ్విస్తూనే ఉన్నారు ఈ నవ్వుల రారాజు.