P Krishna
ఇటీవల చిన్నా పెద్దా అనే తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ కే జీవితాలు అంకితం చేస్తున్నారు.. కొంతమంది ఆన్‌లైన్ గేమింగ్స్ కి బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.
ఇటీవల చిన్నా పెద్దా అనే తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ కే జీవితాలు అంకితం చేస్తున్నారు.. కొంతమంది ఆన్‌లైన్ గేమింగ్స్ కి బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.
P Krishna
ఈ మద్య కాలంలో యువత ఎక్కువగా ఆన్ లైన్ గేమింగ్స్ కి బానిసై పోతున్నారు. ఈ వ్యసనం కారణంగా అప్పుల పాలై చనిపోవడమో.. లేదా హత్యలకు తెగబడటం లాంటివి చేస్తున్నారు. దారుణమైన విషయం ఏంటంటే ఆన్ లైన్ గేమింగ్ కి మగవాళ్లే కాదు.. ఆడవాళ్లు కూడా బానిసలై అప్పలు చేస్తూ వాటిని తీర్చే క్రమంలో క్రూరమైన చర్యలకు పాల్పపడుతున్నారు. కొంతమంది అప్పుల బాధ పడలేక ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. తాజాగా ఓ యువకుడు ఆన్ లైన్ గేమింగ్స్ కి బానిసై దారుణమైన నిర్ణయం తీసుకొని పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రదేశ్ ఫతేపూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హిమాన్షు అనే యువకుడు అప్పలు తీర్చడం కోసం కన్నతల్లినే కడతేర్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాన్షు అనే యువకుడు కొంత కాలంగా ఆన్ లైన్ గేమింగ్స్ ఆడుతూ వాటికి బానిసయ్యాడు. తల్లిదండ్రులు ఎంత మందలించినా.. బుద్ది మార్చుకోలేదు. ఆన్ లైన్ గేమింగ్స్ కారణంగా అప్పులపాలయ్యాడు. ఇటీవల అప్పుడ తీర్చేందుకు తన అత్త ఇంటి నుంచి నగలు దొంగలించి వాటిని అమ్మిన డబ్బుతో తల్లిదండ్రుల పేరు మీద రూ.50 లక్షల ఇన్సూరెన్స్ చేయించాడు. ఇన్సూరెన్స్ డబ్బు క్లయిమ్ చేసుకోవడానికి పక్కా ప్లాన్ ప్రకారం తన తల్లిని చంపేశాడు.
హిమాన్షు తన తండ్రి రోషన్ సింగ్ ని చిత్ర కూట్ ఆలయాన్ని సందర్శించడానికి పంపించాడు. ఆ తర్వాత తన తల్లి ప్రభ కొంతు కోసి చంపాడు. మృతదేహాన్ని జూట్ సంచిలో పెట్టుకొని, ట్రాక్టర్ పై యమునా నది ఒడ్డున పడవేశాడు. తండ్రి వచ్చిన తర్వాత ప్రభ అతని కొడుకు హిమాన్షు కనిపించలేదు. చుట్టుపక్కల వాళ్లు హిమాన్షు యమునా నది ఒడ్డున కనిపించాడని చెప్పారు. తర్వాత ఆరా తీయగా దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి 21 న ప్రభ మృతదేహాన్ని వెలికి తీసి హిమాన్షను అరెస్ట్ చేశాడు. జూపీ యాప్ లో ఆన్ లైన్ గేమింగ్ కి బానిసై రూ.4 లక్షల వరకు అప్పు చేశాడని అప్పు తీర్చడానికి స్నేహితుల వద్ద డబ్బు తీసుకోగా వారు ఒత్తిడి చేయడంతో ఈ ప్లాన్ చేసినట్లు హిమాన్షు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.