P Krishna
ఇటీవల దేశంలో మహిళలపై ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకొని కట్టుకున్న భార్య అని చూడకుండా కొంతమంది భర్తలు దారుణాలకు తెగబడుతున్నారు.
ఇటీవల దేశంలో మహిళలపై ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకొని కట్టుకున్న భార్య అని చూడకుండా కొంతమంది భర్తలు దారుణాలకు తెగబడుతున్నారు.
P Krishna
దేశంలో నిత్యం ఎక్కడో అక్కడ మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు మృగాళ్లు రెచ్చిపోతున్నారు. నిత్యం ఎక్కడో ఆడవాళ్లపై లైంగిక వేధింపులు, హత్యలు, అత్యాచారాలకు సంబంధించిన కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే దేశంలో వరకట్నం తీసుకోవడం చట్టరిత్యా నేరం, దురాచారం అంటారు. కానీ వరకట్నం లేనిదే పెళ్లి తంతు ముగియదన్న విషయం అందరికీ తెలిసిందే. పెళ్లికి ముందు ఇరు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు కట్నకానుకల గురించి మాట్లాడుకున్న తర్వాతే పెళ్లి తంతుకు సిద్దమవుతారు. అయితే కొంతమంది కట్నకానుకలు సమర్పించినా వివాహానంతరం వరకట్నం కోసం ఆడబిడ్డలను హింసించి చంపుతున్న వార్తలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అలాంటి ఘటనే చిత్రదుర్గంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
చిత్రదుర్గ జిల్లా హుసదుర్గ పట్టణంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో కన్నుమూసింది. తన కూతురుని అత్తమామలు, భర్త కలిసి హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమకూరకు చెందిన గీతాశ్రీ వివాహం హుసదుర్గ పట్టణం గోరవనకల్లు గ్రామానికి చెందిన ప్రభు కుమార్ తో ఆరేళ్ల క్రితం జరిగింది. తాను మంచి చదువులు చదివాను.. త్వరలో ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని గీతాశ్రీని వారి తల్లిదండ్రులను నమ్మిస్తూ వచ్చాడు ప్రభాకర్. ఓ ప్రైవేట్ బ్యాంక్ లో పనిచేస్తున్నాడు. గీతాశ్రీ ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తుంది. పెళ్లైన కొత్తలో భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉండేవారు. వీరికి ఓ కూతురు.
ఇటీవల ప్రభు తనకు డబ్బు అవసరం ఉందని.. పుట్టింటికి వెళ్లి పట్టుకురావాలని గీతాశ్రీ ని వేధించడం మొదలు పెట్టాడు. అందుకు అత్త మామలు కూడా తోడయ్యారు. ఈ క్రమంలోనే తరుచూ గీతాశ్రీ తో గొడవలు పెట్టుకోవడం, కొట్టడం లాంటివి చేస్తున్నాడు ప్రభు. ఇటీవల ఇద్దరి మధ్య పెద్ద గొడవ కావడంతో పుట్టింటికి వెళ్లిపోయింది గీతాశ్రీ. తన కష్టాల గురించి తల్లిదండ్రులకు చెప్పింది. వారు ఎలాగైనా అల్లుడికి సర్ధి చెబుతామని గీతాశ్రీకి చెప్పారు. తల్లిదండ్రులు చెప్పడంతో మూడు రోజుల క్రితం భర్త ఇంటికి వచ్చింది గీతాశ్రీ. మళ్లీ కట్నం కోసం గీతాశ్రీని భర్త, అత్తమామలు హింసించి కొట్టి చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి సోదరుడు నిరంజన్ ఆరోపించాడు. ఈ క్రమంలోనే వారిపై హోస్‌దుర్గా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గీతాశ్రీ భర్త ప్రభు, తల్లిదండ్రులపై హత్య కేసు నమోదు కావడంతో నిందితులు పరారీలో ఉన్నారు.