Venkateswarlu
Venkateswarlu
‘ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవ్వరూ లేరు’ అని కేజీఎఫ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ అక్షర సత్యం. ఎందుకంటే.. ఈ సృష్టిలో తల్లికంటే బాగా మనల్ని ఎవ్వరూ చూసుకోలేరు.. అర్థం చేసుకోలేరు. బిడ్డకు ఏదైనా జరిగితే తల్లి విలవిల్లాడిపోతుంది. తాను తిన్నా తినకపోయినా బిడ్డ ఆకలి తీర్చడానికే ప్రయత్నిస్తుంది. బిడ్డల కోసం ఎంతటి కష్టాన్నైనా.. ఇష్టంగా భరిస్తుంది. ఇలా తల్లి గురించి చెప్పుకుంటే పోతే మాటలు చాలవు. తల్లి ప్రేమకు నిదర్శనంగా నిలిచే సంఘటనలు మన సమాజంలో నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి.
ఓ తల్లి తన బిడ్డను ఒడిలో పెట్టుకుని ఆటో రిక్షా నడుపుతోంది. మగాళ్లు తమదిగా భావించే వృత్తిలోకి దిగటమే కాకుండా.. చంటి బిడ్డతో డ్రైవింగ్ చేయటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సంఘటన ఎప్పుడు? ఎక్కడ? జరిగిందో తెలియదు కానీ, ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వైరల్ భయానీ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రెండు రోజుల క్రితం పోస్టు అయిన ఈ వీడియోపై పెద్ద సంఖ్యలో స్పందన వస్తోంది.
ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు సదరు తల్లిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘‘ ఆమెపై నాకు చాలా గౌరవం ఏర్పడింది. పూట గడవటం కోసం డ్రైవింగ్ చేస్తున్న ఆమె.. ఇలా బిడ్డను ఒడిలో పెట్టుకుని కష్టాలు పడుతోంది’’.. ‘‘ తల్లి ప్రేమను మించిన ప్రేమ.. ఈ ప్రపంచంలో ఏదీ లేదు’’..‘‘ ఆమె నిజంగా ఓ యోధురాలు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియో మిలియన్‌కు పైగా వ్యూస్.. రెండు లక్షలకు పైగా లైక్స్ తెచ్చుకుంది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.