Ayodhya Ram Mandir-Lighting 5 Diyas: అయోధ్య రామ మందిరం: ఈ రోజు 5 దీపాలు ఎలా వెలిగించాలి? ప్రతి హిందువు ఇలా పాటించండి!

అయోధ్య రామ మందిరం: ఈ రోజు 5 దీపాలు ఎలా వెలిగించాలి? ప్రతి హిందువు ఇలా పాటించండి!

Ayodhya Ram Mandir Inauguration: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి హిందువు ఐదు దీపాలు వెలిగించాలి అని చెబుతున్నారు. ఆ క్రతువు ఎలా నిర్వహించాలంటే..

Ayodhya Ram Mandir Inauguration: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి హిందువు ఐదు దీపాలు వెలిగించాలి అని చెబుతున్నారు. ఆ క్రతువు ఎలా నిర్వహించాలంటే..

దేశంలోని యావత్‌ హిందువులు ఎంతో ఆత్రుతగా, భక్తిగా ఎదురు చూస్తోన్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం మరి కొన్ని గంటల్లో మొదలు కానుంది. ఈ అపురూప ఘట్టం కోసం మనం దేశంలోనేకాక.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వందల ఏళ్లుగా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో జనవరి 22, సోమవారం నాడు వారి కల సాకారం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆలయంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. అయితే అయోధ్య రామ మందిర ప్రారభోత్సవ తేదీ ప్రకటించిన నాటి నుంచి.. ఎందరో పండితులు, పూజారులు ఈరోజు ప్రతి హిందువు ఐదు దీపాలు వెలిగించాలని చెబుతున్నారు. తాజాగా విశ్వ హిందూ పరిషత్‌ సభ్యులు కూడా ఐదు  దీపాలు వెలిగించమని కోరారు. మరి 5 దీపాలు ఎలా వెలిగించాలి.. ఏం చేయాలి అంటే..

సోమవారం నాడు ఉదయాన్నే లేచి తల స్నానం చేయాలి. ఆ తర్వాత సంక్రాంతి పండుగ రోజున ఏవిధంగా అయితే వాకిళ్లలో ముగ్గులు వేస్తామో అలానే ముగ్గులు వేసుకుని.. రంగులు వేయాలి. ఆ తర్వాత గుమ్మాలకు మామిడాకుల తోరణాలు కట్టాలి. అయితే ఐదు దీపాలు ఉదయం వెలిగించకూడదు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ముగిసిన తర్వాత అనగా సోమవారం సాయంత్రం పూట ఐదు దీపాలు వెలిగించాలి. ఆ తర్వాత అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను ఇంటిల్లిపాది తలపై చల్లుకుని ఆశీర్వచనం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటి మీద కాషాయ జెండా కట్టాలి అని చెబుతున్నారు.

ఇక మరోవైపు ఈ నెల 22న జ‌ర‌గ‌నున్న అయోధ్య బాల రాముని ప్ర‌తిష్టా కార్య‌క్ర‌మాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఇళ్ల‌లో శ్రీరామ జ్యోతిని వెలిగించాల‌ని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అలానే ప్ర‌తి ఒక్క‌రూ రాముడు చూపిన బాట‌లో న‌డ‌వాల‌న్న‌దే త‌మ ఉద్దేశ‌మ‌ని మోదీ వెల్ల‌డించారు. రామాలయ ప్రారంభోత్సవంలో పాల్గొననుండటం తన పూర్వ జన్మ సుకృతం అన్నారు. ఇక రామమందిర ప్రతిష్ఠ మహోత్సవానికి దాదాపు 8 వేల మంది అతిథులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది.

ఇక మందిర నిర్మాణలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిలో ఒకటి శ్రీరామనవమి నాడు రాముడి నుదుటి మీద సూర్య తిలకం దిద్దేలా ప్రత్యేకంగా నిర్మాణం చేపడుతున్నారు. అయోధ్య మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశ విదేశాల నుంచి రాములోరికి, సీతమ్మ తల్లికి భారీ ఎత్తున కానుకలు తరలి వస్తున్నాయి. ఇక మందిర నిర్మాణం కోసం భక్తులు భారీ ఎత్తున విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. జనాలు ఇచ్చిన విరాళాలతోనే మందిరం నిర్మిస్తున్నారు.

Show comments