ఇలాంటి హీరోలను అభిమానిస్తే తప్పేంటి? మనసున్న మహారాజులు మన స్టార్స్!

Tollywood Actors Donate To Flood Relief: రీల్ లైఫ్​లోనే కాదు.. రియల్ లైఫ్​లోనూ తాము హీరోలమేనని ఎన్నోసార్లు నిరూపించారు టాలీవుడ్ స్టార్స్. ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రతిసారి తామున్నామంటూ ఆపన్న హస్తం అందిస్తూ వస్తున్నారు. మరోమారు గొప్ప మనసును చాటుకున్నారు తెలుగు హీరోలు.

Tollywood Actors Donate To Flood Relief: రీల్ లైఫ్​లోనే కాదు.. రియల్ లైఫ్​లోనూ తాము హీరోలమేనని ఎన్నోసార్లు నిరూపించారు టాలీవుడ్ స్టార్స్. ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రతిసారి తామున్నామంటూ ఆపన్న హస్తం అందిస్తూ వస్తున్నారు. మరోమారు గొప్ప మనసును చాటుకున్నారు తెలుగు హీరోలు.

ఆపదలో ఉన్నవారు ఎవరైనా సరే, తనవారిగా భావించి వాళ్ల కోసం ఫైట్ చేసేవాడే హీరో. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తానున్నానంటూ వాళ్లకు అండగా నిలిచేవాడే రియల్ హీరో. ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ కూడా ఇదే పని చేస్తున్నారు. రీల్ లైఫ్​లోనే కాదు.. రియల్ లైఫ్​లోనూ తాము హీరోలమేనని ఎన్నోసార్లు నిరూపించిన టాలీవుడ్ స్టార్స్.. మరోమారు గొప్ప మనసును చాటుకుంటున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రతిసారి తామున్నామంటూ ఆపన్న హస్తం అందిస్తూ వస్తున్న సినీ తారలు.. ఇంకోసారి జనాలకు తోడుగా నిలబడుతున్నారు. వరద బాధితులకు అండగా ఉంటున్నారు. ఒకరు, ఇద్దరు కాదు.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా మంది స్టార్స్ ప్రజలకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ప్రభాస్ నుంచి విశ్వక్​సేన్ వరకు అందరూ తలో చేయి వేసి ప్రజల్ని ఈ విపత్తు నుంచి బయటపడేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో కుదేలైపోయాయి. ఖమ్మం, విజయవాడ, మహబూబాబాద్ లాంటి ఏరియాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. వరదల వల్ల జనజీవనం స్తంభించిపోయింది. ఇళ్లల్లోకి నీళ్లు రావడం, కరెంట్ లేకపోవడం, బయటకు వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సాయం కోసం జనాలు ఎదురు చూస్తున్నారు. ఈ టైమ్​లో టాలీవుడ్ స్టార్స్ తమ మంచి మనసును చాటుకుంటున్నారు. ప్రభుత్వాలకు చేయూతనివ్వడానికి తెలుగు హీరోలు ముందుకొస్తున్నారు. తొలుత మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఏపీ, తెలంగాణకు కలిపి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా సినీ తారలు ఆపన్న హస్తం అందిస్తున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెరో కోటి రూపాయలు అనౌన్స్ చేశారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా వరద బాధితుల సహాయార్థం భారీ విరాళం ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్​కు రూ.1 కోటి, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి ఇస్తున్నట్లు ప్రభాస్ ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్​కు కలిపి రూ.1 కోటి అందిస్తున్నట్లు బన్నీ తెలిపారు. వీళ్లతో పాటు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్​సేన్ కూడా విపత్కర తరుణంలో వీలైనంత ఆర్థిక అండదండలు అందించారు. సిద్ధు జొన్నలగడ్డ 30 లక్షలు, విశ్వక్ సేన్ 10 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. హీరోయిన్ అనన్య నాగళ్ల 5 లక్షలు, హారికా హాసిని క్రియేషన్స్ 50 లక్షలు, వైజయంతీ మూవీస్ 50 లక్షలు, వెంకీ అట్లూరి 10 లక్షలు అందించారు. ఈ జాబితా ఇంకా అప్​డేట్ అవుతూనే ఉంది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు.

సామాన్యులు కష్టాల్లో ఉన్న ప్రతిసారి మన హీరోలు ముందుకొచ్చి చేయూతను అందివ్వడం గొప్ప విషయమని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. ఇంత మంచి మనసు ఉన్న రియల్ హీరోలు ఉండటం టాలీవుడ్ అదృష్టమని చెబుతున్నారు. కష్టాల్లో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించే మనసున్న మహారాజులు మన స్టార్స్ అని.. వాళ్లను అభిమానించడం ఎంతమాత్రం తప్పు కాదంటున్నారు. జీవితంలో పెద్ద స్థాయికి చేరుకునేందుకు వీళ్లను స్ఫూర్తిగా తీసుకోవాలని చెబుతున్నారు. రూపాయి సాయం చేయడానికి కూడా వంద సార్లు ఆలోచించే వారు ఉన్న ఈ రోజుల్లో టాలీవుడ్ స్టార్లు ఈ రేంజ్​లో డొనేషన్స్ ఇవ్వడం ఎందరికో స్ఫూర్తిని ఇస్తుందని ప్రశంసిస్తున్నారు. మరి.. వరద బాధితులకు టాలీవుడ్ హీరోలు అండగా నిలవడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments