ప్రముఖ సంగీత గాయకుడు బలవన్మరణం!

Sadi Mohammad Passes away: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. కొంత కాలంగా డిప్రేషన్ లో ఉన్న ప్రముఖ సింగర్ బలవన్మరణాని పాల్పపడ్డారు.

Sadi Mohammad Passes away: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. కొంత కాలంగా డిప్రేషన్ లో ఉన్న ప్రముఖ సింగర్ బలవన్మరణాని పాల్పపడ్డారు.

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు, ప్రముఖ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలా ఎంతోమంది కన్నుమూస్తున్నారు. వారి మరణంతో కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. రోడ్డు ప్రమాదాలు, వయోభారం, అనారోగ్యం, హార్ట్ ఎటాక్ తో కొంతమంది మరణిస్తే.. ఇండస్ట్రీలో కెరీర్ సరిగా సాగక, ఆర్థిక ఇబ్బందులు తలెత్తి డిప్రేషన్ లోకి వెళ్లి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే ఇండస్ట్రీలో చోటు చేసుకుంది.  ప్రముఖ సంగీత గాయకుడు ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రముఖ రవీంద్ర సంగీత గాయకుడు సౌదీ మహమ్మద్ (70) బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రముఖ డ్యాన్సర్ షమీర్ అర నిపా, సౌదీ మహ్మద్ తమ్ముడు షిబ్లీ మహ్మద్ మీడియాకు ధృవీకరించారు. బుధవారం రాత్రి సౌది మహ్మద్ మృతదేహం తన గదిలో ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది. ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బంగ్లాదేశ్ కు చెందిన గాయకుడు, ఉపాధ్యాయుడు,  కంపోజర్ సౌదీ మహ్మద్ కు అద్భుతమైన పోర్ట్ ఫోలియో ఉంది. పలు చిత్రాలు, నాటకాల్లో ఆయన పాటలు పాడారు. 2007 లో ‘అమాకే ఖుజే పాబే భోరేర్ శిశిరే’ ఆల్బామ్ రిలీజ్ చేసి సంగీత స్వరకర్తగా అరంగేట్రం చేశాడు.

జూలై 8, 2023న ఆయన తల్లి జెబున్నెషా సలీం ఉల్లా(96) వృద్ధాప్యం కారణంగా మరణించారు. తన తల్లిపై ఎంతో అభిమానం చూపించే సౌదీ మహమ్మద్ అప్పటి నుంచి డిప్రేషన్ లోకి వెళ్లినట్లు డ్యాన్సర్ షమీర్ అర నిపా తెలిపారు. ఈ కారణంతోనే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. మహమ్మద్ విశ్వభారతి విశ్వవిద్యాలయం నుంచి రవీంద్ర సంగీతంలో బ్యాచిలర్ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2009 లో శ్రబోన్ అకాషే, 2012 లో శార్ధోక్ జానోమ్ అమర్ ఆల్బామ్ లను రిలీజ్ చేశారు. ఆయన మహ్మద్ రబీ రాగ్ సంస్థకు డైరెక్టర్ గా పనిచేశారు. 2012 లో ఛానల్ i ద్వారా ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’, 2015 లో బంగ్లా అకాడమీ ద్వారా ‘రవీంద్ర అవార్డు’ తో సహా పలు అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Show comments