Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి అరుదైన గౌరవం! ఇదీ చరణ్ రేంజ్!

మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఈరోజున గ్లోబల్ స్టార్ గా పేరొందిన రామ్ చరణ్ కు.. మరొక ప్రత్యేక గౌరవం లభించనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఈరోజున గ్లోబల్ స్టార్ గా పేరొందిన రామ్ చరణ్ కు.. మరొక ప్రత్యేక గౌరవం లభించనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సినీ ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలుగా వస్తూ ఉంటారు. కానీ, కేవలం కొంతమంది మాత్రమే తమ స్వయం కృషితో కష్టపడి ఎదిగి.. తమకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకుంటారు. ఎప్పటికీ సినీ ఇండస్ట్రీ చరిత్రలో చెరిగిపోని ముద్రను వేస్తారు. ఇలా కష్టపడి ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయనను చూసి ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాగే మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కూడా ఇండస్ట్రీకి ఈ విధంగానే వచ్చారు. తండ్రి పేరుతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా కూడా.. తన కెరీర్ లో ఎన్నో అవమానాలను ఎదుర్కోక తప్పలేదు. కానీ, ఎక్కడా వెనుకడుగు వేయకుండా.. ఎక్కడైతే అవమానం పొందాడో అక్కడే తన స్థాయి ఏంటో నిరూపించుకుని.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గా పేరు తెచ్చుకుని.. క్రమంగా ఎదుగుతూ అభిమానుల చేత గ్లోబల్ స్టార్ గా పేరొందాడు రామ్ చరణ్. ఈ క్రమంలో తాజాగా రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలకు ప్రతిఫలంగా మరొక అరుదైన గౌరవం లభించబోతుంది.

రామ్ చరణ్ ఇండస్ట్రీలో ఈ పేరు ఇప్పుడు ఒక బ్రాండ్. 2007 లో విడుదలైన చిరుత సినిమాతో రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఎంత తండ్రి మెగాస్టార్ అయినా కూడా.. ప్రేక్షకులకు తెరపైన కనిపించేది మాత్రం హీరో , అతని నటన మాత్రమే. ఈ క్రమంలో ఒకానొక పరిస్థితిలో రామ్ చరణ్ కు కూడా అవమానాలు, ప్లాప్ లు, జడ్జ్మెంట్స్ తప్పలేదు. చాలా మంది అతని లుక్స్ ను కూడా ట్రోల్ చేశారు. ఆ తర్వాత 2009లో వచ్చిన మగధీర సినిమాతో.. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఇక ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో తన లుక్స్, స్టైలింగ్, యాక్టింగ్ తో .. అప్పటివరకు తన గురించి చేసిన ట్రోలింగ్స్, జడ్జిమెంట్స్ అన్నిటికి చెక్ పెట్టేలా చేసి.. అభిమానుల హృదయాలలో గ్లోబల్ స్టార్ గా నిలిచిపోయాడు. ఈ క్రమంలో.. ఇప్పుడు రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలకు ప్రతిఫలంగా.. రామ్ చరణ్ కు డాక్టరేట్ లభించనుంది.

ఈ నెల 13వ తేదీన చెన్నైలోని పల్లవరంలోని వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుక జరగనుంది. ఈ వేడుకలు యూనివర్శిటీ ఛాన్సలర్, సినీ నిర్మాత ఈసరి గణేష్ ఆద్వర్యంలో జరగనున్నాయి. కాగా ఈ వేడుకలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఇదే వేడుకలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అధ్యక్షుడు డీజీ సీతారాం.. రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నారు. ఇక ఈ వేడుకలలో రామ్ చరణ్ తో పాటు.. పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ నెలలే మిగిలి ఉండడంతో షూటింగ్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. మరి, రామ్ చరణ్ కు డాక్టరేట్ లభించిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments