రాజమౌళి- మహేష్‌ సినిమా.. బడ్జెట్‌ ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు!

SSMB 29 Movie Budjet: రాజమౌళి- మహేష్‌ బాబు సినిమాకు సంబంధించి రోజుకో అప్‌డేట్‌ తెరపైకి వస్తోంది. నిన్న స్క్రిప్ట్‌ వర్క్‌కు సంబంధించిన న్యూస్‌ బయటకు వచ్చింది. ఇప్పుడు బడ్జెట్‌ న్యూస్‌ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

SSMB 29 Movie Budjet: రాజమౌళి- మహేష్‌ బాబు సినిమాకు సంబంధించి రోజుకో అప్‌డేట్‌ తెరపైకి వస్తోంది. నిన్న స్క్రిప్ట్‌ వర్క్‌కు సంబంధించిన న్యూస్‌ బయటకు వచ్చింది. ఇప్పుడు బడ్జెట్‌ న్యూస్‌ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

రాజమౌళి-మహేష్‌ బాబుల కాంబినేషన్‌లో ఓ ప్యాన్‌ వరల్డ్‌ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే ఈ మూవీకి సంబంధించి ప్రకటన వచ్చింది. అయినప్పటికి చిత్రానికి సంబంధించి అఫిషియల్‌ అప్‌డేట్లు అయితే రాలేదు. కానీ, చాలా నెలల తర్వాత నిన్న ఓ అద్భుతమైన అప్‌డేట్‌ వచ్చింది. మూవీ కథ పూర్తి అయినట్లు చిత్ర ‍కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ మహేష్‌ బాబుతో ఓ స్టోరీ చేస్తున్నాను. కథ పూర్తయింది.

అజయ్‌ దేవగణ్‌ గారితో ఓ స్టోరీ చేస్తున్నాను. కథ సిద్ధం చేస్తున్నాము. అది కూడా అవుతోంది. మూడు నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి’’ అని అన్నారు. దీంతో రాజమౌళి, మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. అతి త్వరలో మూవీ షూటింగ్‌ ప్రారంభం కానుందని సంతోషిస్తున్నారు. స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిందన్న సంతోషంలో ఉన్న రాజమౌళి, మహేష్‌ బాబు ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్‌ అందింది. ఈ మూవీ నిర్మాతలు, బడ్జెట్‌కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.

రాజమౌళి- మహేష్‌ సినిమాను ప్రముఖ నిర్మాత కేఎల్‌ నారాయణ, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ సంయుక్తంగా నిర్మించనున్నారట. యాక్షన్‌ అడ్వెంజర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ప్యాన్‌ వరల్డ్‌ మూవీగా తెరకెక్కనుంది. దాదాపు 1000 కోట్ల రూపాయలతో ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఇండియన్‌ సినిమా చరిత్రలోనే మొదటి సారి ఇంత బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావటం విశేషం. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

హాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ‘ఇండియానా జోన్స్‌’లా ఈ మూవీ ఉండనుందట. ఈ విషయాన్ని స్వయంగా విజయేంద్ర ప్రసాద్‌ వెల్లడించారు. అడవి బ్లాక్‌ డ్రాప్‌లో మూవీ ఉంటుందని చెప్పారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించి త్వరలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరగన్నాయి. ఆ తర్వాత షూటింగ్‌ ప్రారంభం కానుంది. రాజమౌళి ఈ మూవీ కోసం రెండు మూడు సంవత్సరాలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మరి, రాజమౌళి-మహేష్‌ బాబుల కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments