డ్రాగన్ బాల్ సృష్టికర్త అకిరా తోరియామా కన్నుమూత!

Akira Toriyama Passed away: బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో రకాల కార్టూన్లు వచ్చాయి.. వాటిలో కొన్ని ఇప్పటికీ మర్చిపోలేని సీరీస్ ఉన్నాయి. అలాంటి వాటిలో డ్రాగన్ బాల్ ఒకటి.

Akira Toriyama Passed away: బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో రకాల కార్టూన్లు వచ్చాయి.. వాటిలో కొన్ని ఇప్పటికీ మర్చిపోలేని సీరీస్ ఉన్నాయి. అలాంటి వాటిలో డ్రాగన్ బాల్ ఒకటి.

ప్రపంచ వ్యాప్తంగా బుల్లితెరపై పిల్లల కోసం ఎన్నో రకాల కార్టూన్లు, యానిమేషన్ పిక్చర్స్ వచ్చాయి. వాటిలో పాపులర్ అయిన కొన్ని కార్టూన్లు ఇప్పటికే మంచి ఆదరణ లభిస్తూనే ఉంది. అలాంటి పాపులర్ కార్టున్స్ లో ఒకటి డ్రాగన్ బాల్. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొంది విజయవంతమైన మాంగాలలో ఒకటిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 260 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి. 1996 లో డ్రాగన్ బాల్ జీటీ అనే పేరుతో యానిమే ప్రసారం చేయడం ప్రారంభిచారు. దీనికి మంచి ఆధరణ లభించింది. డ్రాగన్ బాల్ సృష్టికర్త అకిరా తొరియామా మూయడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.

ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆధరణ పొందిన ‘డ్రాగన్ బాల్’ సీరీస్ సృష్టికర్త అకిరా తొరియామా (68) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన తీవ్రమైన సబ్‌డ్యూరల్ హెమటోమాతో బాధపడుతున్నాడు. ఇది మెదడుకి సంబంధించిన వ్యాధి.. దీని తీవ్రత చాలా ప్రమాదకరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అకిరాకు మార్చి 1న మెదడులో రక్త స్రావం కావడంతో వెంటనే హాస్పిటల్ లో చేర్పించారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ ఆయన చివరి శ్వాస విడిచారు. అకిరా జపనీస్ కామిక్స్ లో అత్యధికంగా అమ్ముడు పోయిన వాటిలో డ్రాగన్ బాల్ ఒకటిగా నిలిచింది. అప్పట్లో డ్రాగన్ బాల్ సీరీస్ ఒక పెను సంచలనం సృష్టించింది.

అకిరా తొరియామా కన్నుమూసినట్లు డ్రాగన్ బాల్ ఫ్రాంచైజీ అధికారిక ఖాతా ద్వారా ‘X’ లో విడుదల చేశారు. అకిరా తోరియామా 1984లో డ్రాగన్ బాల్‌ను సృష్టించాడు. అకిరా తోరియామా ఏప్రిల్ 5, 1955 న జపాన్‌లోని నగోయాలో జన్మించారు. 1981లో డాక్టర్ స్లంప్‌తో ఉత్తమ షోనెన్ మాంగాగా షోగాకుకన్ మాంగా అవార్డును పొందాడు. జపాన్‌లో 35 మిలియన్ కాపీలకు పైగా అమ్ముడైంది. ఆయన మృతితో మరోసారి అందరూ తమ చిన్నతరంలోని డ్రాగన్ బాల్ చూసిన రోజులను గుర్తు చేసుకుంటున్నారు. డ్రాగన్ బాల్ సీరీర్ అప్పట్లో చిన్నా.. పెద్ద అందరినీ బాగా అలరించాయి. తమ బాల్యాన్ని మధురంగా మార్చినందుకు తిరియామకు ధన్యవాదలు చెబుతూ నివాళుర్పిస్తున్నారు.

Show comments