Arjun Suravaram
Teja Sajja: హీరోలకు స్టార్ డమ్ రావడం చాలా కష్టమనే సంగతి అందరికి తెలిసిందే. అయితే అలా వచ్చిన స్టార్ ఇమేజ్ ను కొనసాగించడం కూడా చాలా కష్టం. అలాంటి సమస్యను ఇప్పటికే అనేక మంది హీరోలు ఫేజ్ చేసి..నిలబడ్డారు. తాజాగా ఆ జోన్ లో హనుమాన్ హీరో తేజ సజ్జా కూడా ఎదుర్కొనున్నారని టాక్ వినిపిస్తోంది.
Teja Sajja: హీరోలకు స్టార్ డమ్ రావడం చాలా కష్టమనే సంగతి అందరికి తెలిసిందే. అయితే అలా వచ్చిన స్టార్ ఇమేజ్ ను కొనసాగించడం కూడా చాలా కష్టం. అలాంటి సమస్యను ఇప్పటికే అనేక మంది హీరోలు ఫేజ్ చేసి..నిలబడ్డారు. తాజాగా ఆ జోన్ లో హనుమాన్ హీరో తేజ సజ్జా కూడా ఎదుర్కొనున్నారని టాక్ వినిపిస్తోంది.
Arjun Suravaram
హనుమాన్..హనుమాన్..హనుమాన్.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన సినీ ప్రియుల నోటి నుంచి విపిస్తోన్న పేరు ఇది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సంక్రాంతి కానుగా జనవరి 12న విడుదల పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొనడంతో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించిన చర్చలే జరిగాయి. బాక్సాఫీస్ వద్ద హనుమాన్ తన బలం ఏంటో చూపిస్తోంది. ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరి..రికార్డు సృష్టించింది. ఇలా సాగుతున్న హనుమాన్ సక్సెస్.. హీరో తేజాకి మాత్రం భారం కానుందా అనే టాక్ వినిపిస్తోంది.
యంగ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా కాంబినేషన్ లో వచ్చిన హనుమాన్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఇద్దరికీ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు లభించింది. ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీని తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలానే హీరో తేజా నటనకు సినీ ప్రియులు ఫిదా అయ్యారు. తెలుగు తో పాటు హిందీలోనూ ఈ సినిమా దుమ్ములేపుతోంది. ఇక ఈ సినిమా హిట్ తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు, హీరో తేజాకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక తేజా సజ్జకు అయితే హనుమాన్ సినిమాతో స్టార్ హీరోగా మారాడు. పాన్ ఇండియా లెవెల్ లో తేజాకు మంచి గుర్తింపు లభించింది.
ఇక ఈ సినిమాతో వచ్చిన ఇమేజ్ ను కాపాడుకునేందుకు తేజా గట్టిగానే కృషి చేయాలి. చిన్న హీరోగా ఉన్నప్పుడు సమస్యలు అనేవి చాలా తక్కువే ఉంటాయి. ఎలాంటి కథను ఎంచుకున్నా..ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. చిన్న హీరోలు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఉంటేనే పెద్ద హీరోలుగా మారతారు. అయితే చిన్న హీరోలు కూడా పెద్ద హీరోలు చేసే రెగ్యులర్ ఫార్మాట్ మాస్ మసాలా ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ చేస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరు. స్టార్ డమ్ వచ్చిన తరువాత దానిని నిలుపుకోవడం అనేది ప్రతి హీరోకు పెద్ద సమస్య అనేది తెలిసిందే. టైర్-1,టైర్-2 హీరోలకే ఈ సమస్య తప్పలేదు. వారు తమ స్టార్ డమ్ ను నిలుపుకునేందుకు ఎంతో ఆలోచించి కథలను ఎంచుకునే ఇప్పుడు సక్సెస్ బాటలో వెళ్తున్నారు.
అలానే తేజ సజ్జా మంచి యంగ్ డైరెక్టర్లతో వైవిధ్యమైన ప్రాజెక్ట్ ఎంచుకోవడం అత్యవసరం. తొందరపడి ఏ ప్రాజెక్ట్ కళ్ల పడితే ఆ ప్రాజెక్ట్ ఓకే చేస్తే కెరీర్ ముప్పు వస్తుంది. అయితే తేజ కూడా సినీ ఇండస్ట్రీ వాతావరణం గురించి బాగా తెలుసు. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తేజ.. అనేక మంది హీరోల సినిమాల్లో నటించాడు. సినిమా వాతావరణంలో పెరిగిన అతడి కథ ఎంపికపై అవగాహన ఉంటుంది. కాబట్టి హనుమాన్ తో తేజకు వచ్చిన స్టార్ డమ్ ను తరువాతి సినిమాల్లో కూడా నిలుపుకుంటాడని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి.. తేజ పై వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.