Aditya N
Animal Movie Victory On OTT: ఇటీవల రిలీజ్ అయిన యానిమల్ మూవీ అద్బుత విజయాన్ని సాధించడమే కాదు.. కలెక్షన్ల పరంగా రికార్డు క్రియేట్ చేస్తుంది. ఓటీటీలో కూడా దుమ్మురేపుతుంది.
Animal Movie Victory On OTT: ఇటీవల రిలీజ్ అయిన యానిమల్ మూవీ అద్బుత విజయాన్ని సాధించడమే కాదు.. కలెక్షన్ల పరంగా రికార్డు క్రియేట్ చేస్తుంది. ఓటీటీలో కూడా దుమ్మురేపుతుంది.
Aditya N
బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యాక్షన్ డ్రామా యానిమల్, గత డిసెంబర్ లో విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే కేవలం థియేటర్ల వద్ద రికార్డు కలెక్షన్స్ నమోదు చేయడమే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఈ సినిమా విజయ యాత్రను కొనసాగిస్తుంది. డిజిటల్ రిలీజ్ అయి దాదాపు మూడు వారాలు కావస్తున్నా ఇంకా యానిమల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
నాన్-ఇంగ్లీష్ ఫిల్మ్ కేటగిరీలో నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్‌లలో ఇప్పటికీ ఈ చిత్రం హవా కొనసాగుతోంది. వరుసగా మూడు వారాల పాటు, అంటే ఫిబ్రవరి 5 నుండి 11 వరకు 1.9 మిలియన్ల వ్యూస్ సంపాదించి, టాప్ 10 గ్లోబల్ చార్ట్‌లలో 8వ స్థానంలో నిలిచింది. ఎంత మంది ఈ సినిమాను తక్కువ చేయాలని చూసినా ప్రేక్షకులు మాత్రం యానిమల్ సినిమాకు తమ మద్దతును తెలియజేస్తూనే ఉన్నారు. రష్మిక మందన్న, అనిల్ కపూర్, త్రిప్తి దిమ్రీ కీలక పాత్రల్లో నటించిన యానిమల్‌ను టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ నిర్మించాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.
ఇక యానిమల్ సినిమా కథ విషయానికి వస్తే… రణ్ విజయ్ సింగ్ బల్బీర్ (రణబీర్ కపూర్)కి తన తండ్రి బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) అంటే పిచ్చి ప్రేమ. అయితే, బల్బీర్ సింగ్ బిజీ బిజినెస్ మెన్. భారత దేశంలోనే అతిపెద్ద స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీని నిర్వహిస్తుంటాడు. ఆ బిజీ లైఫ్ లో కొడుకుతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా రణ్ విజయ్ సింగ్ కి – బల్బీర్ సింగ్ కి మధ్య దూరం పెరుగుతుంది. దాంతో, కొడుకుని బోర్డింగ్ స్కూల్‌కు పంపిస్తాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల రణ్ విజయ్, గీతాంజలి (రష్మిక)తో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోతాడు. ఐతే, బల్బీర్ పై జరిగిన హత్యాయత్నం జరిగిందని తెలుసుకుని, తిరిగి ఇండియాకి వస్తాడు. అసలు బల్బీర్ సింగ్ ను చంపాలనుకుంది ఎవరు ? తన తండ్రి శత్రువులపై విజయ్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు ? ఆ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ? చివరికి ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.