డిగ్రీ పాసయ్యారా? ఈ జాబ్స్ కొడితే లైఫ్ సెట్.. నెలకు 1,77,500 జీతం

మీరు డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 1,77,500 జీతాన్ని పొందొచ్చు.

మీరు డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 1,77,500 జీతాన్ని పొందొచ్చు.

ప్రస్తుత రోజుల్లో వేలాది మంది డిగ్రీలు పూర్తి చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. జీతం తక్కువైనా సరే గవర్నమెంట్ జాబ్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి మీరు కూడా డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? ప్రభుత్వ కొలువు సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీలాంటి నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ జాబ్ పొందే అవకాశం వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 1,77,500 జీతం అందుకోవచ్చు. లైఫ్ సెట్ అయ్యే ఈ ఉద్యోగాలకు వెంటనే అప్లై చేసుకోండి. ఇటీవల ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(ఏఎఫ్ క్యాట్) నోటిఫికేషన్ విడుదలైంది.

భారత త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. గ్రూప్–ఏ గెజిటెడ్ ఆఫీసర్స్ ఇన్ ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్) విభాగాల్లో కలిపి మొత్తం 304 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

ఏఎఫ్‌క్యాట్ – AFCAT – 02/2024

పోస్టుల సంఖ్య:

  • 304

విభాగాల వారీగా ఖాళీలు:

  • ఫ్లయింగ్ బ్రాంచ్: 29
  • గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్): 156
  • విభాగం: ఏరోనాటికల్ ఇంజినీరింగ్.
  • గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్): 119
  • విభాగం: వెపన్ సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్, ఎల్‌జీఎస్‌, అకౌంట్స్, ఎడ్యుకేషన్, మెటియోరాలజీ.
  • ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ
  • విభాగం: ఫ్లయింగ్ బ్రాంచ్.

అర్హత‌:

  • ఫ్లయింగ్ బ్రాంచ్ విభాగాలకు సంబంధించిన పోస్టులకు 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్ స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్‌లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. (లేదా) 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ అర్హత ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
  • గ్రౌండ్ డ్యూటీ టెక్నిక‌ల్ విభాగాలకు సంబంధించిన పోస్టుల‌కు ఏరోనాటిక‌ల్ ఇంజినీరింగ్‌ (ఎల‌క్ట్రానిక్స్‌/ మెకానిక‌ల్) విభాగాల్లో లేదా దాని అనుబంధ బ్రాంచీల్లో బీటెక్‌/బీఈ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంట‌ర్‌‌లో ఫిజిక్స్, మ్యాథ్స్ ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
  • గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నిక‌ల్) పోస్టుల్లో వివిధ విభాగాలను అనుసరించి ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్ స‌బ్జెక్టుల్లో ఉత్తీర్ణత, ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్ లేదా బీకాం/ బీఎస్సీ/ బీబీఏ/ సీఏ/ సీఎంఏ/ సీఎస్/ సీఎఫ్ఏ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • ఫ్లయింగ్ బ్రాంచ్: 20 – 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్న్ / నాటెక్నికల్): 20 – 26 సంవత్సరాల మధ్య ఉండాలి..

దరఖాస్తు ఫీజు:

  • రూ.550 చెల్లించాలి. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ అభ్యర్థులకు ఫీజు ఉండదు.

ఎంపిక విధానం:

  • రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

పేస్కేలు:

  • శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. శిక్షణ తర్వాత ఫ్లయింగ్ ఆఫీసర్ ర్యాంకుతో రూ.1,77,500 చెల్లిస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 30-05-2024

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది:

  • 28-06-2024
Show comments