P Krishna
Nizamabad Crime News: తమ పిల్లలు చదువుకొని గొప్ప ఉద్యోగాలు చేస్తూ సమాజంలో మంచి పొజీషన్లో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు.
Nizamabad Crime News: తమ పిల్లలు చదువుకొని గొప్ప ఉద్యోగాలు చేస్తూ సమాజంలో మంచి పొజీషన్లో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు.
P Krishna
నేటి పోటీ ప్రపంచంలో విద్య ఎంతో అవసరం. తమ పిల్లలకు ఉన్నత చదువులు చదివించేందుకు తల్లిదండ్రులు తమ స్థోమతకు మించి ఖర్చు చేస్తుంటారు. తమ పిల్లలు మంచి మార్కులతో పాస్ అవ్వాలని ప్రైవేట్ విద్యా సంస్థల్లో చేర్పిస్తుంటారు. కానీ కొంతమంది పిల్లలు మాత్రం హాస్టల్ లో ఉంటూ చెడు సవాసాలు పడుతు తమ జీవితాలను నాశనం చేసుకుంటారు. తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేస్తుంటారు. బాగా చదువుకోమని చెప్పిన వారిపై కక్ష్య పెంచుకోని వారిని ఎదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు కొంతమంది విద్యార్థులు. అలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థులను చదువుకోమని చెప్పడమే అతని ప్రాణాలకు ముప్పు తెచ్చింది. వివరాల్లోకి వెళితే..
నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని బోధన్ పట్టణంలో బీసీ బాయ్స్ హాస్టల్ లో ఇటీవల విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే గొడవ చేయకుండా బుద్దిగా చదువుకోవాలని.. తల్లిదండ్రుల ఆశలు నిలబెట్టాలని డిగ్రీ విద్యార్థి వెంకట్ ఇంటర్ విద్యార్థులకు హితబోద చేశాడు. అది మనసులో పెట్టుకొని వెంకట్ ని ఆరుగురు ఇంటర్ విద్యార్థులు అతి దారుణంగా హత్య చేశారు. సోమవారం ఈ ఘటన బోధన్ లో తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలానికి చెందిన వెంకట్ హిరియాల్ (19) ప్రస్తుతం డిగ్రీ చేస్తున్నాడు. బీసీ హాస్టల్ లో స్టడీ అవర్స్ ఇన్ చాన్జిగా ఉన్నాడు. ఆదివారం రాత్రి పలువురు ఇంటర్ విద్యార్థులు చదువుకోకుండా మాట్లాడుకుంటూ గొడవ చేయడం తో వారిని వెంకట్ మందలించాడు.
ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి.. శ్రద్దగా చదువుకోకుండా గొడవ చేయడం తప్పు అని వారికి సూచించాడు. వెంకట్ తమపై ఆజమాయిషీ చూపిస్తున్నాడన్న కోపంతో ఆరుగురు ఇంటర్ విద్యార్థులు రాత్రి గదిలో నిద్రపోతున్న వెంకట్ పై దాడి చేశారు. అందరూ గొంతునులిమి హత్యచేశారు. తర్వాత అక్కడ నుంచి పారిపోయారు. గది నుంచి శబ్ధాలు రావడంతో మిగతా విద్యార్థులు అక్కడికి వెళ్లి చూడగా ఆపస్మారక స్థితిలో ఉన్న వెంకట్ ని హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే వెంకట్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని ఆరుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.