భర్త గవర్నమెంట్‌ టీచర్‌.. ఆమె నర్సు! హ్యాపీ లైఫ్‌లో ఊహించని మలుపు

Karnataka Crime News: మనిషికి మృత్యువు ఎలా పొంచి ఉంటుందో ఎవరూ ఊహించలేరు. ఇటీవల ఎన్నో రకాలుగా మనిషి అకారణంగా చనిపోతున్నారు

Karnataka Crime News: మనిషికి మృత్యువు ఎలా పొంచి ఉంటుందో ఎవరూ ఊహించలేరు. ఇటీవల ఎన్నో రకాలుగా మనిషి అకారణంగా చనిపోతున్నారు

 భర్తకు ప్రభుత్వ ఉద్యోగం. అయినా కూడా మరింత ఆర్థిక బలం కోసం ఆమె కూడా నర్సుగా పనిచేస్తోంది. కానీ, మృత్యువు మనిషిని ఎప్పుడు ఎలా కబలిస్తుందో ఎవరికీ తెలియదు. ఇంటి నుంచి బయటికి వెళ్లిన వారు తిరిగి ఇంటికి చేరే వరకు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎన్నో కుటుంబాలు అనాథలుగా మిగిలిపోతున్నారు. ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా ఈ ప్రమాదాలు అరికట్టలేకపోతున్నారు. కొంతమంది నిర్లక్ష్యం ఓ కుటుంబంలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే..

ప్రభుత్య ఉద్యోగం చేస్తున్న భర్త.. పీహెచ్‌సీలో నర్సుగా భార్య పనిచేస్తుంది. ఇద్దరూ ఎంతో సంతోషమైన జీవితం గడుపుతున్నారు. అంతలోనే విధి వారి జీవితాలతో ఆడుకుంది. కరెంట్ తీగ మృత్యురూపంలో ఆమె జీవితాన్ని బలితీసుకుంది. భర్తతో కలిసి బైక్ పై వెళ్తున్న లక్ష్మీబాయి జాదవ్ (36) పై కరెంట్ తిగ తెగిపడటంతో షాక్ తో చనిపోయింది. ఈ విషాద ఘటన తమకూరు జిల్లా.. ఇప్పాడి గ్రామంలో జరిగింది. వారి కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

లక్ష్మణ్ ఇప్పాడి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నాడు. అదే గ్రామంలో పీహెచ్‌సీ లో నర్సుగా పని చేస్తుంది లక్ష్మిబాయి జాదవ్. దంపతులిద్దరూ కుణిగల్ లో నివాసం ఉంటున్నారు. లక్ష్మీబాయి విధులు ముగించుకొని భర్తతో కలిసి బైక్ పై ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యంలో కరెంట్ తీగ తెగి వారిపై పడింది. ఈ ఘటనలో లక్ష్మీబాయి జాదవ్ కి తీవ్రంగా గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందింది. లక్ష్మణ్ కి బలమైన గాయాలు కావడంతో స్థానికులు హాస్పిటల్ కి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Show comments