స్థిరంగా బంగారం ధరలు.. నేడు ఎంతంటే?

దేశంలో ప్రస్తుతం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. వెండి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. కొనుగోలుదారులకు ఇదే సరైన సమయం అంటున్నారు నిపుణులు.

దేశంలో ప్రస్తుతం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. వెండి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. కొనుగోలుదారులకు ఇదే సరైన సమయం అంటున్నారు నిపుణులు.

ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువుల్లో ఒకటి బంగారం. మహిళలు బంగారు ఆభరణాలు ధరించేందుకు ఎంతో ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా పండుగలు, వివాహాది శుభకార్యాలకు పది మంది ముందు విలువైన ఆభరణాలు ధరిస్తే ఎంతో గౌరవంగా భావిస్తుంటారు. అందుకే మన దేశంలో పసిడికి చాలా డిమాండ్ ఉంటుంది. గత ఏడాది బంగారం ధరలు చుక్కలు చూపించగా.. ఈ ఏడాది మాత్రం భారీగా పతనం అవుతూ వస్తుంది.  అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాల ప్రభావం బంగారం, వెండి పై పడటంతో తరుచూ ధరల్లో మార్పులు చేర్పులు సంభవిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ రోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మహిళలకు గుడ్ న్యూస్.. గత వారం రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూ.. స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయి. ఈ సమయంలో పసిడి కొనుగోలు చేస్తే చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. రాబోయే సమ్మర్ సీజన్ లో మళ్లీ పసిడి, వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో నేటి గోల్డ్ రేటు ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు  రూ.57,490 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.62,720 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 76,400 వద్ద ట్రెండ్ అవుతుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 57,640 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసడి ధర రూ.62,870 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై,బెంగుళూరు,కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.57,490 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 62,720 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,210 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.72,600, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.74,400 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ. 75,900 లు ఉండగా, ఢిల్లీ, ముంబై లో రూ.74,400 వద్ద కొనసాగుతుంది. పసిడి ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఇప్పుడు బంగారం కొంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Show comments