AP e Office Not Function-Jan 25th-To 31st: AP ప్రజలకు అలర్ట్.. ఈనెల 25 నుంచి 6 రోజులు ఈ సేవలు బంద్

AP ప్రజలకు అలర్ట్.. ఈనెల 25 నుంచి 6 రోజులు ఈ సేవలు బంద్

ఏపీ ప్రజలకు ప్రభుత్వం కీలక అలర్ట్‌ జారీ చేసింది. ఆరు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని సేవలు బంద్‌ అని ప్రకటించింది. ఆ వివరాలు.

ఏపీ ప్రజలకు ప్రభుత్వం కీలక అలర్ట్‌ జారీ చేసింది. ఆరు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని సేవలు బంద్‌ అని ప్రకటించింది. ఆ వివరాలు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. ఆరు రోజుల పాటు సేవలు బంద్‌ కానున్నట్లు ప్రకటించారు. ఇంతకు అవి ఏ సేవలు.. ఎందుకు బంద్‌ కాన్నునాయి.. ఎప్పటి నుంచి నిలిచిపోనున్నాయి అంటే.. జనవరి 25-31 వరకు ఆరు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ-ఆఫీస్‌లు పని చేయవని అధికారులు ప్రకటించారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి సచివాలయ శాఖలు, శాఖాధిపతులు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, రాష్ట్ర యూనిట్లు, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఉన్న ఈ–ఆఫీస్‌ల సేవలను ఆరు రోజుల పాటు నిలిపివేయనున్నట్లు ప్రకటించారు అధికారులు. ప్రస్తుత వెర్షన్‌ నుంచి కొత్త వెర్షన్‌కు మార్పు చేస్తున్నందున ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు ప్రస్తుత పాత వెర్షన్‌లోని ఈ–ఆఫీస్‌లు పనిచేయవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ-ఆఫీసులు పని చేయని ఈ 6 రోజుల్లో కార్యాలయాల్లో అత్యవసర సేవలు సజావుగా సాగేందుకు గాను.. ఆయా శాఖల ఉన్నతాధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త వెర్షన్‌ ఈ–ఆఫీస్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అప్పటి వరకు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి అత్యవసర ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా సీఎస్‌ జవహర్‌ రెడ్డి సూచించారు.

త్వరలో తీసుకురానున్న కొత్త వెర్షన్‌పై ఈ నెల 23, 24 తేదీల్లో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల వరకు మాస్టర్‌ శిక్షకులను డెవలప్‌ చేయనున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది. రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో మాస్టర్‌ శిక్షకులకు కొత్త వెర్షన్‌పై శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీ శాఖ స్పష్టం చేసింది. సచివాలయ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాల నుంచి మాస్టర్‌ శిక్షణకు సిబ్బందిని పంపాలని ఐటీ శాఖ సూచించింది. ఈఆఫీసులు తిరిగి  ప్రాంరభించిన తర్వాత మళ్లీ దీనిపై ప్రకటన చేస్తామని తెలిపారు.

Show comments