Rinku Singh Another Dhoni Said Ashwin: టీమిండియాలో నయా ధోని.. ఫ్యూచర్​కు ఇక ఢోకా లేదు: అశ్విన్

Ravichandran Ashwin: టీమిండియాలో నయా ధోని.. ఫ్యూచర్​కు ఇక ఢోకా లేదు: అశ్విన్

టీమిండియాకు నయా ధోని దొరికాడని సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఇక భవిష్యత్తుకు ఢోకా లేదని చెప్పాడు. అశ్విన్ చెప్పిన ఆ మరో ధోని ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియాకు నయా ధోని దొరికాడని సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఇక భవిష్యత్తుకు ఢోకా లేదని చెప్పాడు. అశ్విన్ చెప్పిన ఆ మరో ధోని ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆఫ్ఘానిస్థాన్​తో మూడు టీ20ల సిరీస్ టీమిండియాకు చాలా విధాలుగా ఉపయోగపడింది. చిన్న జట్టుతో సిరీస్ కదా ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ముందు చాలా మంది విమర్శలు చేశారు. కానీ ఆఫ్ఘాన్​తో సిరీస్ వల్ల టీ20 వరల్డ్ కప్​-2024కు వెళ్లే టీమ్ సెలక్షన్, కాంబినేషన్ విషయంలో కొంతమేర క్లారిటీ వచ్చింది. వన్డే వరల్డ్ కప్ ఓటమి, ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి పీకేయడంతో తీవ్ర నిరాశలో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మలో జోష్ నింపింది ఈ సిరీస్. చివరి మ్యాచ్​లో మెరుపు సెంచరీ, సూపర్ ఓవరల్​లో తెలివిగా వ్యవహరించి గెలిపించడంతో సూపర్ పాజిటివ్​గా ఉన్నాడతను. కెప్టెన్​గా, ప్లేయర్​గా తనపై డౌట్స్ వద్దని చెప్పకనే చెప్పాడు హిట్​మ్యాన్. శివమ్ దూబె, రింకూ సింగ్ రూపంలో మరో రెండు బిగ్ పాజిటివ్స్ కూడా ఈ సిరీస్​తో దక్కాయి. వీళ్లు మ్యాచ్​లు ఫినిష్ చేసిన తీరు సూపర్బ్ అనే చెప్పాలి. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇదే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు నయా ధోని దొరికాడని చెప్పాడు.

రింకూ రూపంలో భారత జట్టుకు మరో ధోని దొరికాడన్నాడు అశ్విన్. అతడి ఆటతీరు అద్భుతమని మెచ్చుకున్నాడు. ఇక ఫ్యూచర్ విషయంలో టీమిండియాకు ఢోకా లేదన్నాడు. ‘రింకూను నేను లెఫ్టాంటెడ్ ధోని అని పిలుస్తాను. మాహీ భాయ్​తో అతడ్ని పోల్చలేను. ఎందుకంటే ధోని తన కెరీర్​లో ఎంతో సాధించాడు. అయితే మాహీలా కూల్​గా, కంపోజర్​గా ఉంటాడు రింకూ. సంయమనం, ఓపికను ప్రదర్శిస్తూనే అవసరాన్ని బట్టి అటాకింగ్​కు దిగుతాడు. అతడు ఉత్తర్ ప్రదేశ్​ తరఫున డొమెస్టిక్ క్రికెట్​లో కంటిన్యూస్​గా రన్స్ చేశాడు. దాన్నే టీమిండియాకు ఆడుతూ కొనసాగిస్తున్నాడు. అతడు యూపీ తరఫున ఆడినప్పుడు చాలా కష్టపడ్డాడు. ఎంతటి కఠిన పరిస్థితుల్లోనైనా రాణించగలనని, టీమ్​ను గెలపించగలనని అప్పుడే ప్రూవ్ చేశాడు’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. యూపీ తరఫున సూపర్బ్ ఇన్నింగ్స్​లు ఆడుతూ టీమిండియాలో ఆడే సత్తా తనకు ఉందని రింకూ నిరూపించాడని తెలిపాడు.

ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్ తరఫున రింకూ ఆడటం మీదా అశ్విన్ రియాక్ట్ అయ్యాడు. చాలా ఏళ్ల పాటు కేకేఆర్ టీమ్​లో అతడికి చోటు దక్కలేదన్నాడు. ఒక్క ఛాన్స్ కోసం ఏళ్ల పాటు అతడు బెంచ్ మీద కూర్చున్నాడని తెలిపాడు. ‘కేకేఆర్​కు ఆడేటప్పుడు రింకూ చాలా ఏళ్ల పాటు బెంచ్​ మీదే ఉన్నాడు. అతడికి ప్రాక్టీస్​లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ కూడా దక్కలేదని నాతో చాలా మంది చెప్పారు. త్రోడౌన్స్ సమయంలో బ్యాటర్లు కొట్టే బంతుల్ని అతడు కలెక్ట్ చేసి తీసుకొచ్చి బౌలర్లకు ఇచ్చేవాడు. అలా చాలా ఏళ్ల పాటు కేకేఆర్​తో అతడు తన జర్నీని కొనసాగించాడు. కానీ యూపీ తరఫున బాగా ఆడటంతో అతడికి అవకాశాలు దక్కాయి. కఠిన సమయాల్లో కూల్​గా మ్యాచ్​ను ఫినిష్ చేయడం అతడి బలం. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా లేదా ఛేజింగ్ అయినా సరే రింకూ ఆటతీరులో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. మరి.. రింకూనే మరో ధోని అంటూ అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి:
Tilak Varma: సెంచరీతో చెలరేగిన తెలుగు కుర్రాడు తిలక్‌! ఇక టెస్ట్‌లోకి ఎంట్రీ ఫిక్స్‌?

Rohit Sharma: రోహిత్‌ వికెట్‌ కీపింగ్‌ చేస్తాడని తెలుసా? కానీ, ఎందుకు కొనసాగించలేదంటే?

Show comments