JIO కొంపముంచేలా TATA, BSNL సూపర్ ఐడియా! ఇన్నాళ్ళకి భలే దెబ్బ!

JIO కొంపముంచేలా TATA, BSNL సూపర్ ఐడియా! ఇన్నాళ్ళకి భలే దెబ్బ!

నేటికాలంలో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ లు ఉన్నాయి.  వీటి వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇదే సమయంలో టెలికాం సంస్థలు కూడా  కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక కొత్త ప్లాన్ ను, సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజాగా టాటా, బీఎస్ఎన్ఎల్ సూపర్ ఐడియాతో ముందుకు వచ్చాయి.

నేటికాలంలో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ లు ఉన్నాయి.  వీటి వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇదే సమయంలో టెలికాం సంస్థలు కూడా  కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక కొత్త ప్లాన్ ను, సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజాగా టాటా, బీఎస్ఎన్ఎల్ సూపర్ ఐడియాతో ముందుకు వచ్చాయి.

ప్రస్తుతం టెలికాం రంగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా 4జీ, 5జీ సేవలను అనేక టెలికాం సంస్థలు అందిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు 5జీ సేవలను చాలా వరకు అందిస్తున్నాయి. అలానే మరికొన్ని సంస్థలు కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు టెలికాం సంస్థలు  కొత్త కొత్త ఐడియాలో ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సంస్థలైన టాటా, బీఎస్ఎన్ఎల్ మాస్టర్ పాన్ వేశాయి. దీంతో ఇక నుంచి  చౌకగా సూపర్ ఫాస్ట్ గా ఇంటర్ నెట్ రానుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

నేటికాలంలో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ లు ఉన్నాయి.  వీటి వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇదే సమయంలో టెలికాం సంస్థలు కూడా  కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక కొత్త ప్లాన్ ను, సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దీంతో వినియోదారులు కూడా తమకు ఎక్కడ సౌకర్యంగా ఉంటే ఆ టెలికాం కంపెని సంస్థల సేవలపై మెగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో కస్టమర్లకు ఉత్తమ సేవలు అందించేందుకు అన్నీ టెలికాం సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే బీఎస్ఎన్ఎల్, టాటా సంస్థలు మాస్టర్ ప్లాన్ వేశాయి. మేడ్ ఇన్ ఇండియా 4జీ సేవను ప్రారంభించనన్నాయి.

బీఎస్ఎన్ఎల్ ఆగస్టులో ఈ సేవలను ప్రారంభించనుంది. ఈ క్రమంలోనే 4జీ సేవను సదరు కంపెనీ పరీక్షిస్తోంది. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ మార్కెట్లోకి ప్రవేశించింది. 40 నుండి 45 ఎంబీపీఎస్ వేగాన్ని అందజేస్తుందని  సంస్థ పేర్కొంది. 700 ఎంహెచ్ జెడ్ , 2100 ఎంహెచ్ జెడ్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌లపై బీఎస్ఎన్ఎల్  పరీక్షించింది. ఓ నివేదిక ప్రకారం…బీఎస్ఎన్ ఎల్ పంజాబ్ రాష్ట్రంలో తన సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే బీఎస్‌ఎన్‌ఎల్‌ ,టీసీఎస్ చెందిన టెలికాం పరిశోధన సంస్థ C-డాట్‌ కూడా సహకరించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ పైలట్ ప్రాజెక్ట్‌ కింద దాదాపు 8 లక్షల మంది కొత్త వినియోగదారులు 4జీ నెట్‌వర్క్‌ సేవలను జోడించినట్లు ఆ సంస్థ తెలిపింది.

ఇక ఈ కొత్త సేవల గురించి బీఎస్ఎన్ఎల్ సీనియర్ అధికారి మాట్లాడుతూ..సీ-డాట్ సృష్టించిన 4జీ కోర్ తో పంజాబ్ లో విసృత్తంగా సేవలు అందిస్తున్నాము. గతేడాది జులైలో దీన్ని నిర్మించి..ప్రస్తుతం పరీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. 4జీ నెట్‌వర్క్ కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ టీసీఎస్‌, తేజస్‌ నెట్‌వర్క్‌, ఐటీఐ ల నుండి సపోర్టు తీసుకుంది. ఇక 4జీ సేవల తరువాత బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ 5జీకి మార్చనుంది. బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌ను చాలా ప్రాంతాల్లో ఇన్‌స్టాల్ చేసినట్లు తేజస్ నెట్‌వర్క్ పేర్కొంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌లో సీ-డాట్ అనేది ఇంకా అందుబాటులో లేదని తెలిపింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్‌ను అందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ప్రణాళికను రూపొందించింది.

4జీ, 5జీ సేవల కోసం దేశవ్యాప్తంగా 1.12 లక్షల టవర్లను బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 4జీ సేవల కోసం 9 వేల టవర్లను ఏర్పాటు చేసింది. వీటిల్లో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా  ప్రాంతాల్లోల 6 వేలకు పైగా టవర్లు ఏర్పాటు చేశారు.  ఇదే సమయంలో పాత సిమ్‌ కార్డ్‌లను ఉపయోగించే వినియోదారులు కొత్త నెట్‌వర్క్ నుండి సేవలు పొందలేరు. దీని కోసం బీఎస్ఎన్ఎల్ కంపెనీ సిమ్ కార్డును కూడా మార్చుకునే అవకాశం ఇస్తోంది. ఇది ఇలా ఉంటే బీఎస్ఎన్ఎల్ కొన్నేళ్లు 4జీ సేవలకు అనుకూలంగా ఉండే చేసే సిమ్‌లను అందిస్తోంది.

Show comments