Rohit Sharma: IPL  చరిత్రలో రోహిత్ శర్మ చెత్త రికార్డ్.. రెండో ప్లేస్ లో ధోని!

Rohit Sharma: IPL  చరిత్రలో రోహిత్ శర్మ చెత్త రికార్డ్.. రెండో ప్లేస్ లో ధోని!

KKRతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డ్ ను తనపేరిట లిఖించుకున్నాడు. ఇక ఈ లిస్ట్ లో చెన్నై మాజీ కెప్టెన్ ధోని సెకండ్ ప్లేస్ లో ఉండటం గమనార్హం. ఆ వివరాల్లోకి వెళితే..

KKRతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డ్ ను తనపేరిట లిఖించుకున్నాడు. ఇక ఈ లిస్ట్ లో చెన్నై మాజీ కెప్టెన్ ధోని సెకండ్ ప్లేస్ లో ఉండటం గమనార్హం. ఆ వివరాల్లోకి వెళితే..

IPL 2024 సీజన్ లో అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. దాంతో ముంబై టీమ్ పరాజయాలకు తాను కూడా ఓ కారణంగా నిలుస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ ల్లో 326 పరుగులు మాత్రమే చేశాడు. ఇక తాజాగా కోల్ కత్తాతో జరిగిన మ్యాచ్ లో సైతం విఫలం అయ్యి విమర్శల పాలవుతున్నాడు. ఈ మ్యాచ్ లో 12 బంతుల్లో 11 పరుగులు చేసి సునీల్ నరైన్ బౌలింగ్ లో మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఐపీఎల్ హిస్టరీలో ఓ చెత్త రికార్డు ను తన పేరిట మూటగట్టుకున్నాడు.

రోహిత్ శర్మ.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో బ్యాటింగ్ లో విఫలం అవుతూ వస్తున్నాడు. దాంతో ముంబై జట్టుకు భారంగా మారుతున్నాడు. ఈ సీజన్ లో ఓ సెంచరీ చేసినప్పటికీ.. ఆ తర్వాత అదే ఫామ్ ను కొనసాగించలేకపోతున్నాడు. భారీ స్కోర్లు చేయలేక చేతులెత్తేస్తున్నాడు. కాగా.. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో కూడా తన పూర్ ఫామ్ ను కొనసాగిస్తూ.. కేవలం 11 రన్స్ కే నరైన్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలోనే ఓ చెత్త రికార్డ్ ను తనపేరిట లిఖించుకున్నాడు హిట్ మ్యాన్.

ఐపీఎల్ లో అత్యధిక సార్లు ఒకే బౌలర్ చేతిలో అవుట్ అయిన బ్యాటర్ గా రోహిత్ చెత్త రికార్డ్ ను క్రియేట్ చేశాడు. సునీల్ నరైన్ బౌలింగ్ లో ఏకంగా 8 సార్లు పెవిలియన్ చేరాడు హిట్ మ్యాన్. ఇక రోహిత్ తర్వాత జహీర్ ఖాన్ బౌలింగ్ లో 7 సార్లు అవుటై ధోని సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.  ఈ లిస్ట్ లో ఏడుసార్లు చొప్పున అవుటైన బ్యాటర్లు ఎవరంటే? కోహ్లీ vs సందీప్ శర్మ, అంబటి రాయుడు vs మోహిత్ శర్మ,  రోహిత్ vs అమిత్ మిశ్రా, ఊతప్ప vs అశ్విన్,  పంత్ vs బుమ్రా, రహానే vs భువనేశ్వర్ ఉన్నారు. మరి ఈ వరల్డ్ కప్ ముందు ఈ వరస్ట్ రికార్డ్ రోహిత్ క్రియేట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments