Srihari Son Meghamsh Srihari: తండ్రితో చివరి సంభాషణ గురించి చెబుతూ శ్రీహరి కొడుకు ఎమోషనల్‌!

తండ్రితో చివరి సంభాషణ గురించి చెబుతూ శ్రీహరి కొడుకు ఎమోషనల్‌!

ప్రముఖ దివంగత నటుడు శ్రీహరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఆయన చిన్న కుమారుడు మేఘాన్ష్‌ శ్రీహరి. 19 ఏళ్ల వయసులోనే సినిమా పరిశ్రమలోకి వచ్చారు. 2019లో వచ్చిన ‘రాజ్‌ ధూత్‌’ సినిమాతో హీరోగా మారారు. దాదాపు మూడేళ్లు అవుతోంది మేఘాన్ష్‌ సినిమా రిలీజై. ప్రస్తుతం ఆయన కోతి కొమ్మచ్చి, మిస్టర్‌ బ్రహ్మ.. ఏంటి ఈ భ్రమ అనే సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా, ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తండ్రితో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు.

మేఘాన్ష్‌ శ్రీహరి మాట్లాడుతూ.. ‘‘ ఆర్థికంగా చాలా ఇబ్బందిపడ్డాం. కానీ, మరీ అంత ఇబ్బంది కాదు. మమ్మీ ఆస్పత్రి ఖర్చులు బాగా ఎక్కువయ్యాయి. నాన్న చనిపోయిన తర్వాత అమ్మ మూడేళ్ల పాటు చాలా ఇబ్బందులు పడ్డారు. నాన్న చనిపోయినపుడు నాకు తెలీదు. మా తాతయ్య చనిపోయాడని అనుకున్నా. తర్వాత అమ్మ చెప్పింది. రెండు నెలలు బ్లాంక్‌ మైండ్‌లో ఉండిపోయాను. నాన్న గారు చనిపోయే ముందు నేను నాన్నతో చాక్లెట్లు తెమ్మని అన్నాను. మాకు చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. నాన్న ఎక్కడికి వెళ్లి వచ్చినా..

ఓ బ్యాగు నిండా చాక్లెట్లు తెచ్చేవారు. నాన్న అందరికీ సాయం చేసేవారు. కానీ, ఏమీ ఆశించే వారు కాదు. మనవాళ్లు కదా అని చేసేవాళ్లు. డబ్బు సాయం బాగా చేసే వాళ్లు. పెద్ద పెద్ద సమస్యలను కూడా ఒక్క ఫోన్‌ కాల్‌తో సాల్వ్‌ చేసేవాళ్లు. నాన్నకు సాయం చేసిన వాళ్లకు కూడా ఆయన సాయం చేసే స్థాయికి ఎదిగారు. అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది’’ అని అన్నారు. మరి, తండ్రి బాటలో మేఘాన్ష్‌ శ్రీహరి కూడా సినిమాల్లోకి రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments