రాసిపెట్టుకోండి.. ఈ సారి కప్పు SRHదే: కెప్టెన్స్‌ కమిన్స్‌

రాసిపెట్టుకోండి.. ఈ సారి కప్పు SRHదే: కెప్టెన్స్‌ కమిన్స్‌

SRH, Pat Cummins, IPL 2024: ఐపీఎల్‌ 2024 టైటిల్‌ మనదే అంటూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు పండుగ లాంటి వార్త చెప్పాడు కమిన్స్‌. మరి అతను అంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్పాడు? దాని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

SRH, Pat Cummins, IPL 2024: ఐపీఎల్‌ 2024 టైటిల్‌ మనదే అంటూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు పండుగ లాంటి వార్త చెప్పాడు కమిన్స్‌. మరి అతను అంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్పాడు? దాని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024 కప్పును సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గెలుస్తుందంటూ.. ఆ జట్టు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ చాలా నమ్మకంగా చెప్పాడు. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఏ రేంజ్‌లో ఆడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ అంటేనే ప్రత్యర్థి జట్లు భయపడే పరిస్థితి నెలకొంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమి పాలైనప్పటికీ.. ప్లే ఆఫ్స్‌కు చేరే హాట్‌ ఫేవరేట్‌ టీమ్స్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఒకటిగా ఉంది. ప్రస్తుతం 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి.. 10 పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం మూడు మ్యాచ్‌లు గెలిచినా.. సన్‌రైజర్స్‌ ఈజీగా ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది.

ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ పండుగ లాంటి విషయం చెప్పాడు. ఈ సారి సన్‌రైజర్స్‌ కప్పు కొడుతుందా? అని ఎదురైన ప్రశ్నకు కచ్చితంగా గెలుస్తుంది. దాన్ని లాక్‌ చేసుకోండి అంటూ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. కమిన్స్‌ అంత నమ్మకంగా చెప్పాడంటే.. కచ్చితంగా చేసి తీరుతాడు అని క్రికెట్‌ అభిమానులు సైతం భావిస్తున్నారు. పైగా కమిన్స్‌ ఏదైనా చెప్పాడంటే అది చేసి తీరుతాడంటూ.. ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ కమిన్స్‌ కామెంట్స్‌కు వంతపాడుతున్నారు. అయితే.. కమిన్స్‌ అంత బలంగా చెప్పడం వెనుక కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌ ఎంత బలంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేస్తే.. ఎస్‌ఆర్‌హెచ్‌ను ఆపే బౌలింగ్‌ ఎటాక్‌ ఏ టీమ్‌కు లేదు. ఎస్‌ఆర్‌హెచ్‌ తమ తర్వాతి మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌, ముంబై, లక్నో, గుజరాత్‌, పంజాబ్‌తో ఆడనుంది. వీటిలో రాజస్థాన్‌తో మ్యాచ్‌ ఒక్కటే ఎస్‌ఆర్‌హెచ్‌కు కాస్త టఫ్‌ కావొచ్చు. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ హాట్‌ఫేవరేట్‌గా మరిలోకి దిగుతుంది. బ్యాటింగ్‌ పిచ్‌ దొరికితే.. ఎస్‌ఆర్‌హెచ్‌ను రాజస్థాన్‌ కూడా ఆపలేదని, దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌ కచ్చితంగా ప్లే ఆఫ్స్‌కు చేరుతుందని, ఒక్కసారి ప్లే ఆఫ్స్‌కు వెళ్లిన తర్వాత.. ఎలా ఆడాలో, టీమ్‌ను ఎలా నడిపించాలో కమిన్స్‌కు బాగా తెలుసని, తన కెప్టెన్సీ బ్రెయిన్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌కు కప్పు అందిస్తాడని, అందుకే అంత నమ్మకంగా ఉన్నాడంటూ ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. మరి ఈ సారి ఎస్‌ఆర్‌హెచ్‌దే కప్పు అంటూ కమిన్స్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments