South Central Railway special trains Sankranti festival: సంక్రాంతికి ఊరెళ్లే వారికి రైల్వే శాఖ శుభవార్త.. అదేంటంటే?

సంక్రాంతికి ఊరెళ్లే వారికి రైల్వే శాఖ శుభవార్త.. అదేంటంటే?

సంక్రాంతి పండగను దృష్టిలో ఉంచుకొని తెలుగు రాష్ట్రాల ప్రజలకు సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్తను అందించింది. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో రైల్వే ప్రయాణికులకు భారీ ఊరట చేకూరనున్నది.

సంక్రాంతి పండగను దృష్టిలో ఉంచుకొని తెలుగు రాష్ట్రాల ప్రజలకు సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్తను అందించింది. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో రైల్వే ప్రయాణికులకు భారీ ఊరట చేకూరనున్నది.

ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పండగ సంక్రాంతి. ఇప్పటికే సంక్రాంతి సందడి షురువైంది. ప్రజలు పండగను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. పండగ వేళ ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చిన వారు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంటిల్లిపాది ఆనందంగా గడిపేందుకు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మూడు రోజుల పాటు సందడిగా సాగే ఈ పండగకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య ఘననీయంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. రైల్వే తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.

సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలుగు రాష్ట్రాల మధ్య సౌత్ సెంట్రల్ రైల్వే ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే 32 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత మరో నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే మరో ఆరు రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు సికింద్రాబాద్‌, తిరుపతి, కాకినాడ నగరాల మధ్య జనవరి 10 నుంచి 15 తేదీల్లో సర్వీసులందించనున్నాయి.

6 ప్రత్యేక రైళ్ల వివరాలివే:

తిరుపతి – సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (07055) జనవరి 10వ తేదీన రాత్రి 8.25గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.10గంటలకు గమ్యస్థానానికి చేరుకోనుంది.
సికింద్రాబాద్‌ -కాకినాడ టౌన్‌ రైలు (07056) జనవరి 11వ తేదీన రాత్రి 7గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయాన్నే 6.45గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. అలాగే, కాకినాడ టౌన్‌ -సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (07057) 12వ తేదీ రాత్రి 9గంటలకు కాకినాడలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30గంటలకు సికింద్రాబాద్‌ చేసుకోనుంది.
సికింద్రాబాద్‌- కాకినాడ టౌన్‌ ప్రత్యేక రైలు (07071) జనవరి 13వ తేదీన రాత్రి 9గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.
కాకినాడ టౌన్‌ – తిరుపతి ప్రత్యేక రైలు (07072) జవనరి 14న ఉదయం 10గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 8.20గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
తిరుపతి -కాచిగూడ ప్రత్యేక రైలు (02707) జనవరి 15న తెల్లవారుజామున 5.30గంటలకు బయల్దేరి అదేరోజు సాయంత్రం 5గంటలకు కాచిగూడకు చేరుకోనుంది.

04 ప్రత్యేక రైళ్ల వివరాలు:

ప్రత్యేక రైలు నెం.07021 జనవరి 11న రాత్రి 09 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.00 గం.లకు కాకినాడ టౌన్ చేరుకోనుంది. అలాగే కాకినాడ నుంచి ప్రత్యేక రైలు నెం.07022 జనవరి 12వ తేదీన సాయంత్రం 05.40 గం.లకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.55 గం.లకు సికింద్రాబాద్ చేరుకోనుంది. అలాగే ప్రత్యేక రైలు నెం.07023 జనవరి 12న సాయంత్రం 06.30 గం.లకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.10 గం.లకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. కాకినాడ నుంచి ప్రత్యేక రైలు నెం. 07024 జనవరి 13న రాత్రి 10.00 గం.లకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.30 గం.లకు హైదరాబాద్ చేరుకుంటుంది.

32 ప్రత్యేక రైళ్ల వివరాలు:

ట్రైన్ నెంబర్ 07089 సికింద్రాబాద్‌- బ్రహ్మపుర్‌ – జనవరి 7, 14 తేదీలు
ట్రైన్ నెంబర్ 07090 బ్రహ్మపుర్‌ – వికారాబాద్ – జనవరి 8, 15 తేదీలు
ట్రైన్ నెంబర్ 07091 వికారాబాద్- బ్రహ్మపుర్‌ – జనవరి 9, 16 తేదీలు
ట్రైన్ నెంబర్ 07092 బ్రహ్మపుర్‌ – సికింద్రాబాద్ – జనవరి 10, 17 తేదీలు
ట్రైన్ నెంబర్ 08541 విశాఖ – కర్నూలు సిటీ – జనవరి 10, 17, 24 తేదీలు
ట్రైన్ నెంబర్ 08542 కర్నూలు సిటీ – విశాఖ – జనవరి 11, 18, 25 తేదీలు
ట్రైన్ నెంబర్ 08547 శ్రీకాకుళం – వికారాబాద్ – జనవరి 12, 19, 26 తేదీలు
ట్రైన్ నెంబర్ 08548 వికారాబాద్ – శ్రీకాకుళం – జనవరి 13, 20, 27 తేదీలు
ట్రైన్ నెంబర్ 02764 సికింద్రాబాద్ – తిరుపతి – జనవరి 10, 17 తేదీలు
ట్రైన్ నెంబర్ 02763 తిరుపతి – సికింద్రాబాద్ – జనవరి 11, 18 తేదీలు
ట్రైన్ నెంబర్ 07271 సికింద్రాబాద్ – కాకినాడ – జనవరి 12 తేదీ
ట్రైన్ నెంబర్ 07272 కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ – జనవరి 13 తేదీ
ట్రైన్ నెంబర్ 07093 సికింద్రాబాద్ – బ్రహ్మపూర్ – జనవరి 8, 15 తేదీలు
ట్రైన్ నెంబర్ 07094 బ్రహ్మపూర్ – సికింద్రాబాద్ – జనవరి 9, 16 తేదీలు
ట్రైన్ నెంబర్ 07251 నర్సాపూర్ – సికింద్రాబాద్ – జనవరి 10 తేదీ
ట్రైన్ నెంబర్ 07052 సికింద్రాబాద్ – నర్సాపూర్ – జనవరి 11 తేదీ

Show comments