ఆ విషయంలో మా డ్రెస్సింగ్‌ రూమ్‌లో చాలా గొడవ జరిగింది: శ్రేయస్‌ అయ్యర్‌

ఆ విషయంలో మా డ్రెస్సింగ్‌ రూమ్‌లో చాలా గొడవ జరిగింది: శ్రేయస్‌ అయ్యర్‌

Shreyas Iyer, KKR, IPL 2024: ఐపీఎల్‌లో సూపర్‌ విజయాలతో దూసుకెళ్తోంది కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌. ఒక వైపు విజయాలు వస్తున్నా.. మరోవైపు డ్రెస్సింగ్‌ రూమ్‌లో గొడవ జరుగుతుందంటూ కెప్టెన్‌ అయ్యర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Shreyas Iyer, KKR, IPL 2024: ఐపీఎల్‌లో సూపర్‌ విజయాలతో దూసుకెళ్తోంది కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌. ఒక వైపు విజయాలు వస్తున్నా.. మరోవైపు డ్రెస్సింగ్‌ రూమ్‌లో గొడవ జరుగుతుందంటూ కెప్టెన్‌ అయ్యర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయంతో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఫ్లే ఆఫ్స్‌కు మరింత దగ్గరైంది. నిన్నటి వరకు పాయింట్ల పట్టికలో నంబర్‌ వన్‌గా ఉన్న రాజస్థాన్‌ రాయల్స్‌ను కిందికి లాగి.. కేకేఆర్‌ ప్రస్తుతం టేబుల్‌ టాపర్‌గా ఉంది. మరో మ్యాచ్‌ గెలిస్తే.. అధికారికంగా కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. ఆదివారం లక్నోలోని ఎకానా స్టేడియంలో ఎల్‌ఎస్‌జీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ ఏకంగా 98 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. మొత్తంగా 8 విజయాలతో కేకేఆర్‌ ఈ సీజన్‌లో దూసుకుపోతుంది. ఇంత మంచి ఫామ్‌లో ఉన్నా కూడా.. కేకేఆర్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో గొడవలు జరుగుతున్నాయని ఆ జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ వెల్లడించాడు. ఏ విషయంలో గొడవలు జరుగుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ సీజన్‌లో అత్యధిక టాస్‌లు ఓడిపోయిన కెప్టెన్‌గా చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ రికార్డు సృష్టిస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన 11 మ్యాచ్‌ల్లో రుతురాజ్‌ ఏకంగా 10 సార్లు టాస్‌ ఓడిపోయాడు. ఆ తర్వాత కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అ‍య్యర్‌ గురించే చెప్పుకోవాలి. గత కొన్ని మ్యాచ్‌ల్లో అయ్యర్‌ టాస్‌ గెలవడం లేదు. మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్‌ చేయాలా? బౌలింగ్‌ చేయాలా అని డిసైడ్‌ చేసుకుందాం అంటే.. ముందు కెప్టెన్‌ టాస్‌ గెలవాలి కానీ, కేకేఆర్‌ విషయంలో అది జరగడం లేదు.

శ్రేయస్‌ అయ్యర్‌ ప్రతిసారి టాస్‌కు వెళ్లడం ఓడిపోవడం జరుగుతోంది. ఆదివారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో కూడా అయ్యర్‌ టాస్‌ ఓడిపోయాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది. ఇలా ప్రతిసారి జరుగుతుండటంతో కేకేఆర్‌ ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లో తనపై గొడవకు దిగినట్లు స్వయంగా శ్రేయస్‌ అయ్యరే వెల్లడించాడు. అసలు టాస్‌ సమయంలో ఏం అవుతుందని తన టీమ్‌ మేట్స్‌ గొడవకు దిగుతున్నారంటూ అయ్యర్‌ సరదాగా పేర్కొన్నాడు. అయితే.. టాస్‌లు ఓడిపోతున్నా.. మ్యాచ్‌లు మాత్రం గెలుస్తున్నాం అంటూ శ్రేయస్‌ అయ్యర్‌ పేర్కొన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments