Sharukh Khan Jawan movie Ticket Offer: 'జవాన్' టీమ్ బంపరాఫర్.. ఆ మూడు రోజులు ఫ్రీ టికెట్!

‘జవాన్’ టీమ్ బంపరాఫర్.. ఆ మూడు రోజులు ఫ్రీ టికెట్!

  • Author Soma Sekhar Published - 06:45 PM, Thu - 28 September 23
  • Author Soma Sekhar Published - 06:45 PM, Thu - 28 September 23
‘జవాన్’ టీమ్ బంపరాఫర్.. ఆ మూడు రోజులు ఫ్రీ టికెట్!

సాధారణంగా సినిమా డిజాస్టర్ అయ్యి.. థియేటర్లలో ప్రేక్షకులు లేకపోతే టికెట్ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి థియేటర్ యాజమాన్యాలు. ఇది గతంలో ఎన్నో సినిమాల విషయంలో జరిగింది కూడా. ఇటీవలే ఆదిపురుష్ సినిమా విషయంలో కూడా చోటుచేసుకుంది. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అని, టికెట్ రేట్లపై భారీ తగ్గింపు అని ఆఫర్లు ప్రకటించారు మేకర్స్. ఇదిలా ఉండగా.. జవాన్ మూవీ టీమ్ ఇందుకు రివర్స్ గా సగటు సినీ ప్రేక్షకులకు బంపరాఫర్ ప్రకటించింది. ఆ మూడు రోజులు టికెట్లు బుక్ చేసుకున్న వారికి మెగా ఆఫర్ తీసుకొచ్చింది. మరి ఆఫర్ కు సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘జవాన్’. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ అట్లీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తూ.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. విడుదలైన తొలిరోజు నుంచే ప్రభంజనం సృష్టించింది జవాన్. ఇదిలా ఉండగా.. ఫ్యాన్స్ కోసం జవాన్ టీమ్ బంపరాఫర్ తీసుకొచ్చింది. ఈనెల 28, 29, 30 తేదీల్లో సినిమా చూసే వారికి ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ ఆఫర్ లో ఆన్ లైన్ లో ఒక టికెట్ బుక్ చేసుకుంటే.. మరో టికెట్ ఫ్రీగా లభిస్తుంది. దీంతో ఒక టికెట్ పై ఇద్దరు మూవీ చూడొచ్చన్నమాట.

ఇక ఆఫర్ కు సంబంధించిన విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు కింగ్ ఖాన్ షారుఖ్. ఈ వీకెండ్ ను మరింతగా ఎంజాయ్ చేయండంటూ జవాన్ మేకర్స్ ఈ ఆఫర్ ను ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ కేవలం ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసే వారికి మాత్రమే వర్తిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం సినిమా చూడని వారు వెంటనే టికెట్ బుక్ చేసుకోండి అంటున్నారు మేకర్స్. మరి జవాన్ మేకర్స్ ప్రకటించిన ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments