జవాన్ తెలుగు వెర్షన్ టీవీలో వచ్చేది ఎప్పుడంటే?

జవాన్ తెలుగు వెర్షన్ టీవీలో వచ్చేది ఎప్పుడంటే?

బాలీవుడ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన షారుఖ్ ఖాన్ మాస్ యాక్షన్ సినిమా ఇప్పుడు తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధం అవుతుంది.

బాలీవుడ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన షారుఖ్ ఖాన్ మాస్ యాక్షన్ సినిమా ఇప్పుడు తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధం అవుతుంది.

2023లో విడుదలై బాలీవుడ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన షారుఖ్ ఖాన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్ ఇప్పుడు తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధం అవుతుంది. మాస్ సినిమాలను గ్రాండ్ స్టైల్ లో తెరకెక్కిస్తారని పేరున్న ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, దీపికా పదుకునే హీరోయిన్లుగా నటించారు.

తాజా అప్డేట్ ప్రకారం జవాన్ తెలుగు వెర్షన్ మార్చి 17, 2024 సాయంత్రం 05:30 గంటలకు జీ తెలుగు ఛానెల్లో గ్రాండ్ టెలివిజన్ ప్రీమియర్ కానుంది. థియేట్రికల్ రిలీజ్ లో ఎన్నో రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం ఓటీటీలో కూడా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. మరి టీవీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరున్న అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి అద్భుతమైన పాటలను అందించారు. ఇప్పటికీ ఈ సినిమాలోని ఛలేయా పాట ఆడియో ప్లాట్ ఫారంలలో టాప్ లిస్ట్ లో ఉంటుంది. ఇక అనిరుధ్ తన మార్కు ఎనర్జిటిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో తెర పై షారుఖ్ ఖాన్ ని హై లెవెల్ లో ఎలివెట్ చేశారు. దర్శకుడు అట్లీ షారుఖ్ ను ఇంతకు ముందెన్నడూ చూడని మాస్ అవతార్ లో చూపించి అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా అలరించారు. రా ఆఫీసర్ విక్రమ్ రాథోడ్ – జైలర్ ఆజాద్ గా డబుల్ రోల్ లో షారుఖ్ ఖాన్ అద్భుతమైన నటనతో పాటు కళ్ళు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా తన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారు. మరి ఇన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాకి టివీ ప్రీమియర్ లో కూడా రికార్డులు క్రియేట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పాలి.

జవాన్ – బుల్లితెర పై షారుఖ్ ఖాన్ షో

Show comments