No Tax While Buy Home: ఇలా చేస్తే ఇల్లు కొన్నప్పుడు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించక్కర్లేదు!

ఇలా చేస్తే ఇల్లు కొన్నప్పుడు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించక్కర్లేదు!

ఇల్లు కొంటున్నారా? అయితే ఇలా చేస్తే మీరు కొన్న ఇంటి మీద పన్ను పడదు. అవును ఒక్క రూపాయి కూడా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే పని లేదు.

ఇల్లు కొంటున్నారా? అయితే ఇలా చేస్తే మీరు కొన్న ఇంటి మీద పన్ను పడదు. అవును ఒక్క రూపాయి కూడా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే పని లేదు.

సాధారణంగా ఏం కొన్నా గానీ పన్ను అనేది కంపల్సరీ. వస్తువులు, ప్రాపర్టీలు కొన్నా.. ఏది కొన్నా గానీ పన్ను కట్టాల్సిందే. అయితే ఈ విధంగా ఇల్లు కొంటే మాత్రం ఒక్క రూపాయి పన్ను కట్టాల్సిన పని లేదు. అవును. మీరు చదివింది నిజమే. వారసత్వంగా వచ్చిన బంగారు ఆభరణాలను అమ్మి ఆ డబ్బుతో ఇల్లు కొనుగోలు చేస్తే పన్ను అనేది పడదు. ఇకపై బంగారు నగలను అమ్మగా వచ్చిన లాభాలపై ట్యాక్స్ బెనిఫిట్ ఉండదు. ఈ డబ్బుతో ఇల్లు కొనుగోలు చేసినా ఇంకా ఏమైనా డబ్బు మిగిలినా కూడా దానిపై పన్ను భారం ఉండదు. ఇటీవల ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ బెంగళూరు బెంచ్ దీనిపై తీర్పు ఇచ్చింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54 ఎఫ్ కింద బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి క్లెయిమ్ చేసుకోగా.. ఆ క్లెయిమ్ ను ఐటీ సమీక్షాధికారి తిరస్కరించారు. దీనిపై ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది.

వారసత్వంగా వచ్చిన గోల్డ్ జ్యువెల్లరీని అమ్మగా వచ్చిన ఆదాయాన్ని ఇల్లు కొనుగోలుకు వాడితే.. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పన్ను మినహాయింపు ఉంటుందని ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఆ ఆదాయాన్ని ఇతర వనరుల నుంచి వచ్చిన ఆదాయంగా పరిగణించకూడదని పేర్కొంది. పూర్వీకుల నుంచి వచ్చిన దీర్ఘకాల మూలధన ఆస్తిగానే ఆ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం.. దీర్ఘకాల మూలధన ఆస్తులను అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇంటి కొనుగోలుకు వాడితే దానిపై వచ్చే లాభానికి ఎల్టీసీజీ పన్ను మినహాయింపు ఉంటుంది.

మూలధన ఆస్తుల కింద బంగారం, ఆభరణాలు, షేర్లు, బాండ్లు వంటి వారిని లెక్కలోకి తీసుకుంటారు. కానీ ఇంటిని మాత్రం మూలధన ఆస్తిగా పరిగణించరు. అంటే వారసత్వంగా వచ్చిన ఇంటిని అమ్మి మరో ఇల్లు కొనుగోలు చేస్తామంటే ట్యాక్స్ బెనిఫిట్ వర్తించదు. అయితే సెక్షన్ 54 ఎఫ్ కింద పన్ను మినహాయింపు పొందాలంటే.. ఆ వ్యక్తులు హిందూ అవిభాజ్య కుటుంబాలకు చెందిన వాళ్ళు అయి ఉండాలి. మూలధన ఆస్తులు అమ్మగా వచ్చిన డబ్బుతో ఇల్లుని మాత్రమే కొనాలి. అప్పుడే ట్యాక్స్ అనేది పడదు.

అలానే ఎవరైతే ఇల్లు కొంటున్నారో వారి పేరు మీద మరొక ఇల్లు ఉండకూడదు. ఒకవేళ బంగారం అమ్మగా వచ్చిన మొత్తం కంటే కొత్తగా కొన్న ఇల్లు విలువ ఎక్కువగా లేదా సమానంగా ఉంటే ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదు. అదే ఇంటి విలువ గోల్డ్ అమ్మగా వచ్చిన అమౌంట్ కంటే తక్కువగా ఉంటే మాత్రం మిగిలిన మొత్తంపై కన్ను చెల్లించాలి. 2024 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సవరణ ప్రకారం.. గరిష్టంగా 10 కోట్లపై మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుంది.                    

ఉదాహరణకు బాలు అనే వ్యక్తి నాన్నమ్మ 2000వ సంవత్సరంలో 10 లక్షల విలువైన బంగారం కొన్నారు. దాన్ని 2018లో బాలుకి ఇచ్చారు. బాలు ఆ బంగారాన్ని 2024లో 50 లక్షలకు విక్రయించారు. అయితే ఇక్కడ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లెక్కించడానికి కొనుగోలు చేసిన మొత్తాన్ని ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఇండెక్సేషన్ వర్తింపజేస్తారు. అప్పుడు ఆ బంగారం విలువ 35 లక్షలకు సమానమవుతుంది. అంటే దీర్ఘకాల మూలధన లాభం 15 లక్షలు అవుతుంది. దీనిపై 20 శాతం ఎల్టీసీజీ పన్ను వర్తింపజేస్తే 3 లక్షలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే 50 లక్షలతో ఇల్లు కొంటే 15 లక్షలపై పన్ను మినహాయింపు అనేది ఉంటుంది. అంటే మూడు లక్షలు ఆదా అయినట్టు.

Show comments