Saree Cancer: ఆడవాళ్లను భయపెడుతోన్న చీర క్యాన్సర్.. ఇందులో నిజమేంత..?

ఆడవాళ్లను భయపెడుతోన్న చీర క్యాన్సర్.. ఇందులో నిజమేంత..?

మహిళలు ఎక్కువగా, ఇష్టంగా ధరించేవి చీరలు. శారీస్ అంటే మహిళలకు పంచ ప్రాణాలు. ఆడవాళ్లు తమ జీవిత కాలంలో ఎక్కువగా ధరించే వస్త్రం కూడా చీరనే. ఐదున్నర నుండి ఆరు గజాల చీర ఇప్పుడు వారికి నష్టం చేకూరుస్తుంది.

మహిళలు ఎక్కువగా, ఇష్టంగా ధరించేవి చీరలు. శారీస్ అంటే మహిళలకు పంచ ప్రాణాలు. ఆడవాళ్లు తమ జీవిత కాలంలో ఎక్కువగా ధరించే వస్త్రం కూడా చీరనే. ఐదున్నర నుండి ఆరు గజాల చీర ఇప్పుడు వారికి నష్టం చేకూరుస్తుంది.

భారత నారీమణులకు చీరలంటే ప్రాణం.. ఎన్ని చీరలు ఉన్నా, కొత్తవి కొంటూనే ఉంటారు. పాతవి బీరువాలో మూలుగుతూనే ఉన్నా.. కొత్త కొత్త శారీస్ కొనుక్కొని మళ్లీ వాటిని అదే బీరువాలో భద్ర పరుస్తాం. ఫలానా సినిమాలో హీరోయిన్ కలర్ ఫుల్ శారీ కట్టిందా.. మార్కెట్, ఆన్ లైన్ యాప్స్‌లో దొరికేస్తుందా అర్జంటుగా కొనేయాల్సిందే. పక్కింటి మహిళ రంగు రంగుల చీర కట్టి.. మన ముందు కలరింగ్ ఇస్తుందా.. ఇక భర్త పర్సు ఖాళీ అయినట్లే. ఫెస్టివల్స్, ఇంట్లో ఫంక్షన్స్‌తో పనిలేదు.. ఎప్పుడు షాపింగ్ చేయాలనిపిస్తే.. అప్పుడు కొనాల్సిందే. పట్టు, ఫ్యాన్సీ, నైలాన్, వర్క్, షిఫాన్, జార్జెట్, సింథటిక్ ఏదైనా సరే.. తమకు నచ్చే ఒక్క శారీ కోసం వస్త్ర దుకాణాల్లో గంటల గంటల పాటు షాపింగ్ చేసే ఓపిక కేవలం స్త్రీలకు మాత్రమే ఉంది. ఎన్ని చీరలు ఉంటే అంత మనశ్శాంతి, ఆత్మ సంతృప్తి.

చీరలు మహిళలకు అందాన్ని, వన్నెను తెచ్చిపెట్టడమే కాదూ.. రోగాన్ని కూడా తీసుకు వస్తున్నాయట. ఏంటీ శారీస్‌తో రోగాలా అని ఆశ్చర్యపోకండి. హా అవును, క్యాన్సర్ వస్తుందట. ఇప్పటి వరకు మీరు రకరకాల క్యాన్సర్ల గురించి విని ఉంటారు. గర్భాశయ, ఆండాశయం, జీర్ణాశయం, పేగులు, రొమ్ము క్యాన్సర్, గొంతు, నోటి క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, పేగులకు సంబంధించిన క్యాన్సర్స్ గురించి విని ఉంటారు కానీ.. ఈ శారీ క్యాన్సర్ ఏంటీ అనుకుంటున్నారా… చీర కట్టే విధానం వల్ల వస్తుందట ఈ మాయదారి రోగం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ క్యాన్సర్ స్టార్ అయ్యిందని తెలుస్తోంది. దీన్ని వైద్య పరిభాషలో స్క్వామల్ సెల్ కార్సినోమా అని పిలుస్తారట. ముంబయిలోని ఆర్ఎణ్ కూపర్ ఆసుపత్రిలో చీర క్యాన్సర్ పై పరిశోధనలు చేయగా.. 68 సంవత్సరాల మహిళకు ఈ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

అసలు ఈ శారీ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే.. చీరలు ధరించేందుకు చాలా మంది శారీ పెటికోట్ (లో దుస్తులు (లంగా)) బొందు/తాడును నడుముకు గట్టిగా కట్టుకుంటూ ఉంటారు. దీని వల్ల నడుము ప్రాంతంలో చెమట చేరుతుంది. అలా ఎక్కువ సేపు కట్టుకుని ఉండటం వల్ల నడుము వద్ద నల్లగా మారి.. అది దురుదను క్రియేట్ చేస్తుంది. దీంతో రుద్దడం వంటివి చేయడం వల్ల చర్మం దెబ్బతిని అది నిరంతరం చికాకు తెప్పించడమే కాకుండా దీర్ఘకాలంలో గాయం పెద్దగా మారి క్యాన్సర్‌కు కారణం అవుతుందని తెలుస్తోంది. ఇప్పుడు బాధితురాలు అయిన మహిళ కూడా తన 13 ఏట నుండి చీర కట్టడం వల్ల శారీ క్యాన్సర్ బారిన పడింది. చీర సరైన క్లీనింగ్ లేకపోయినా పిగ్మెంటేషన‌లో మార్పులు, నడుముపై దురద వచ్చి ఈ వ్యాధి బారిన పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కాబట్టి వదులైన దుస్తులు వేయాలని చెబుతున్నారు వైద్యులు. నిత్యం శారీ పెటీ కోట్ టైట్‌గా కట్టవద్దని సూచిస్తున్నారు. లూజు దుస్తులు ధరించాలని పేర్కొంటున్నారు. ఐదున్నర గజాల చీరల వల్ల కూడా ఆడవాళ్లకు నష్టం చేకూరుతుందని తెలుస్తోంది.

Show comments