పుష్ప 2లో సాయిపల్లవి – నిజమేనా ?

పుష్ప 2లో సాయిపల్లవి – నిజమేనా ?

ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప పార్ట్ 2 ది రూల్ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 1న మొదలు కాబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. అల్లు కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్వంత స్టూడియోస్ ని అదే రోజు ప్రారంబించబోతున్నట్టుగా తెలిసింది. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవితో పాటు భారీ ఎత్తున సెలబ్రిటీ హాజరుతో గ్రాండ్ గా చేసేందుకు ప్లానింగ్ జరిగిందట. ఇప్పటిదాకా మీడియాకు దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇవ్వనప్పటికీ లీకవుతున్న వార్తలను బట్టి చూస్తే పక్కా ప్రణాళికతో అంతా సిద్ధం చేసినట్టు టాక్. రామానాయుడు, అన్నపూర్ణ, సారథి స్టూడియోలకు ధీటుగా దీని నిర్మాణం జరిగిందట.

ఇక పుష్ప 2 విషయానికి వస్తే ఈ వెర్షన్ కోసం బోలెడు మార్పులు చేసిన దర్శకుడు సుకుమార్ ఇందులో మరో హీరోయిన్ ని తీసుకుంటారట. ఎవరో కాదు సాయిపల్లవినే అని ఫిలిం నగర్ డిస్కషన్. ఆల్రెడీ నెరేషన్ అయ్యిందని, రష్మిక మందన్న ఉన్నప్పటికీ తనతో సమాన ప్రాధాన్యం ఉండేలా గిరిజన యువతి క్యారెక్టర్ ని డిజైన్ చేసినట్టు తెలిసింది. అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేదాకా ఇది నిజమని చెప్పలేం కానీ నిప్పు లేనిదే పొగరాదుగా. ఫస్ట్ పార్ట్ లో ఉన్న అనసూయ, సునీల్, ధనుంజయ్, జగదీష్ తదితరులను కొనసాగిస్తూనే అదనపు తారాగణాన్ని భారీగా జోడించారట. ఒక యువ హీరో కూడా ఉంటాడని ఇంకో టాక్ ఉంది.

విడుదలకు మాత్రం చాలా టైం పట్టేలా ఉంది. అక్టోబర్ లో మొదలుపెట్టినా పూర్తవ్వడానికి ఎంతలేదన్నా ఆరేడు నెలలు గడిచిపోతాయి. అది కూడా ఎలాంటి అవాంతరాలు రాకుంటేనే. అలా అయితే 2023 దసరాకో దీపావళికో రిలీజ్ ప్లాన్ చేసుకోవచ్చు. అది మిస్ అయితే ఏకంగా 2024 సంక్రాంతి తప్ప వేరే ఆప్షన్ ఉండదు. లేదూ పుష్ప 1 సెంటిమెంట్ ని ఫాలో అవుతూ డిసెంబర్ మూడో వారంకి ఫిక్స్ చేయొచ్చు. దేవిశ్రీ ప్రసాద్ ఆల్రెడీ ట్యూన్స్ ఇచ్చేశాడు. ఈసారి షూటింగ్ ని కేవలం మారేడుమిల్లి ప్రాంతంలోనే కాకుండా విదేశాల్లో ఉండే డీప్ ఫారెస్ట్ లోనూ తీస్తారట. అంటే ఫారిన్ షెడ్యూల్ ఉంటుంది. మొత్తానికి స్టార్ట్ కాకుండానే పుష్ప 2 హాట్ టాపిక్ గా మారుతోంది

Show comments