Rohit Sharma: వరల్డ్ కప్ ముందు టీమిండియాను టెన్షన్ పెడుతున్న రోహిత్.. ఆ తప్పు సరిదిద్దుకోకపోతే..!

Rohit Sharma: వరల్డ్ కప్ ముందు టీమిండియాను టెన్షన్ పెడుతున్న రోహిత్.. ఆ తప్పు సరిదిద్దుకోకపోతే..!

T20 వరల్డ్ కప్ ముందు టీమిండియాను టెన్షన్ పెడుతున్నాడు రోహిత్ శర్మ. ఆ వీక్ నెస్ నుంచి రోహిత్ బయటపడకపోతే.. మరో ప్రపంచ కప్ కూడా చేజారి పోతుందని ఫ్యాన్స్ అభిప్రాయాపడుతున్నారు. మరి ఇంతకీ రోహిత్ బలహీనత ఏంటి?

T20 వరల్డ్ కప్ ముందు టీమిండియాను టెన్షన్ పెడుతున్నాడు రోహిత్ శర్మ. ఆ వీక్ నెస్ నుంచి రోహిత్ బయటపడకపోతే.. మరో ప్రపంచ కప్ కూడా చేజారి పోతుందని ఫ్యాన్స్ అభిప్రాయాపడుతున్నారు. మరి ఇంతకీ రోహిత్ బలహీనత ఏంటి?

ఐపీఎల్ 2024 సీజన్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బాగానే ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ ల్లో 311 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ కూడా ఉంది. అయితే టీ20 వరల్డ్ కప్ ముందు రోహిత్ చేస్తున్న ఓ పెద్ద తప్పువల్ల టీమిండియా టెన్షన్ పడుతోంది. ఈ ఐపీఎల్ సీజన్ పదే పదే అదే తప్పును రిపీట్ చేస్తున్నాడు. దీంతో టీమిండియా తెగ టెన్షన్ పడుతోంది. టీ20 వరల్డ్ కప్ దగ్గరపడుతుండటంతో.. ఆ వీక్ నెస్ నుంచి రోహిత్ బయటపడకపోతే.. మరో ప్రపంచ కప్ కూడా చేజారి పోతుందని ఫ్యాన్స్ అభిప్రాయాపడుతున్నారు. మరి ఇంతకీ రోహిత్ చేస్తున్న ఆ తప్పు ఏంటి?

ప్రస్తుతం అందరు ఐపీఎల్ 2024 సీజన్ ను ఎంజాయ్ చేస్తున్నప్పటికీ.. వారి దృష్టి మాత్రం జూన్ లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ పైనే ఉంది. ఈ మెగాటోర్నీలో పాల్గొనే 20 జట్లతో పాటుగా ప్లేయర్లు, ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఈ టోర్నీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు అద్భుతమైన ఆటతీరుతో వరల్డ్ కప్ టీమ్ లో ప్లేస్ పక్కా చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ టీమ్ కు టెన్షన్ గా మారాడు. అతడు ఈ సీజన్ లో పదే పదే ఒకే తప్పును రిపీట్ చేస్తున్నాడు. ఈ తప్పును అతడు సరిదిద్దుకోలేదు అనుకో.. భారత్ కు వరల్డ్ కప్ దక్కడం కష్టమే. ఇంతకీ ఆ తప్పేంటేంటే?

ఈ ఐపీఎల్ సీజన్ లో రోహిత్ శర్మ అవుటైన తీరును పరిశీలిస్తే.. అతడి వీక్ నెస్ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. ఇక ఈ సీజన్ లో హిట్ మ్యాన్ ప్రధానంగా చేసే తప్పు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల బౌలింగ్ లో ఎక్కువగా అవుట్ కావడం. ఇప్పటికే ట్రెంట్ బౌల్ట్ రెండుసార్లు రోహిత్ ను పెవిలియన్ కు పంపగా.. తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో అదే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. వీటితో పాటుగా గత మ్యాచ్ ల్లో సైతం ఎడమ చేతి వాటం బౌలర్ల చేతిలోనే బలైయ్యాడు. ఈ వీక్ నెస్ నుంచి హిట్ మ్యాన్ ఇంకా బయటపడటం లేదు. పదే పదే అదే తప్పును రిపీట్ చేస్తూ.. టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనబోయే జట్లకు హింట్ ఇస్తున్నాడు. ఇక రోహిత్ బలహీనతను గమనించి.. అదే ప్లాన్ తో సిద్ధంగా ఉంటాయి ప్రత్యర్థి టీమ్స్. ఇదే జరిగితే.. టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. ఇప్పటికైనా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లను ఎదుర్కొనేందుకు సరికొత్త అస్త్రంలో రోహిత్ సిద్ధం కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Show comments