Rohit Sharma Should Bat At Three Ajay Jadeja: టీ20 వరల్డ్ కప్ నెగ్గాలంటే రోహిత్ ఆ ఒక్క త్యాగం చేయాల్సిందే: మాజీ క్రికెటర్

టీ20 వరల్డ్ కప్ నెగ్గాలంటే రోహిత్ ఆ ఒక్క త్యాగం చేయాల్సిందే: మాజీ క్రికెటర్

టీ20 వరల్డ్ కప్​లో ఆడే భారత జట్టును ఇటీవల బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ టీమిండియా మాజీ క్రికెటర్ దీనిపై రియాక్ట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఓ త్యాగం చేస్తే ప్రపంచ కప్ మన సొంతం అవుతుందని అన్నాడు.

టీ20 వరల్డ్ కప్​లో ఆడే భారత జట్టును ఇటీవల బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ టీమిండియా మాజీ క్రికెటర్ దీనిపై రియాక్ట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఓ త్యాగం చేస్తే ప్రపంచ కప్ మన సొంతం అవుతుందని అన్నాడు.

టీ20 వరల్డ్ కప్​లో ఆడే భారత జట్టును ఇటీవల బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ఫుల్ స్క్వాడ్​ను అనౌన్స్ చేసింది బోర్డు. ఈ టీమ్​కు ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. అయితే ఈ జట్టుపై పలు విమర్శలు వస్తున్నాయి. సెలెక్షన్ బాగోలేదని, కొందరు ప్లేయర్లకు అన్యాయం జరిగిందని పలువురు మాజీ క్రికెటర్లు కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్-2024లో అదరగొడుతున్న వాళ్లను టీమ్​లోకి తీసుకోలేదని, ఈ టోర్నీలో ఫెయిలైన వారికి జట్టులో చోటు కల్పించడం సరికాదంటూ సీరియస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ టీమిండియా మాజీ క్రికెటర్ భారత స్క్వాడ్​పై రియాక్ట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఓ త్యాగం చేస్తే ప్రపంచ కప్ మన సొంతం అవుతుందని అన్నాడు.

టీ20 ప్రపంచ కప్​లో భారత్ నెగ్గాలంటే రోహిత్ తన ఓపెనింగ్ స్లాట్​ను త్యాగం చేయాలని మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అన్నాడు. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి జతగా హిట్​మ్యాన్ ప్లేస్​లో యశస్వి జైస్వాల్​ను మరో ఓపెనర్​గా ఆడించాలని అతడు సూచించాడు. కోహ్లీ-జైస్వాల్​ ఓపెనర్లుగా వస్తే అదిరిపోతుందన్నాడు. రోహిత్ మూడో నంబర్​లో ఆడాలని తెలిపాడు. థర్డ్ డౌన్​లో ఆడితే క్రీజులో సెటిల్ అయ్యేందుకు కాస్త ఎక్కువ టైమ్ దొరుకుతుందని, గేమ్​ను అర్థం చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాడు జడేజా. నిలకడకు మారుపేరైన విరాట్ జట్టులో ఉంటే కన్​సిస్టెంట్​గా రన్స్ వస్తాయని, అతడ్ని ఆ పని కోసం వాడుకోవాలని పేర్కొన్నాడు. టాప్​లో ఆడేందుకు అతడే బెస్ట్ ప్లేయర్ అని.. పవర్​ప్లే వల్ల అతడు క్రీజులో సెటిల్ అవడం ఈజీగా మారుతుందన్నాడు అజయ్ జడేజా.

కోహ్లీ క్రీజులో సెటిలైతే ఆ తర్వాత స్పిన్నర్లు వచ్చినా ఇబ్బంది ఉండదని, వాళ్లను ఎదుర్కొని రన్స్ చేయడం ఈజీ అవుతుందన్నాడు అజయ్ జడేజా. స్కోరు బోర్డు మీదకు 20 నుంచి 30 పరుగులు చేరితే విరాట్ మరింత స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపిస్తాడని, స్పిన్నర్లకు కూడా అతడ్ని ఆపడం కష్టంగా మారుతుందన్నాడు. తన మటుకైతే కోహ్లీ టీమ్​లో ఉన్నాడంటే అతడ్ని ఓపెనర్​గా దింపడాన్ని మించిన మరో ప్రత్యామ్నాయం లేదన్నాడు. కాగా, ఇప్పటిదాకా అంతర్జాతీయ క్రికెట్​లో టీ20ల్లో 9 సార్లు ఓపెనర్​గా వచ్చిన కింగ్.. 57.14 యావరేజ్​తో 400 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 161.29గా ఉంది. ఇందులో ఓ సెంచరీతో పాటు రెండు ఫిఫ్టీలు ఉన్నాయి. మరి.. రోహిత్​ తన ఓపెనింగ్ స్లాట్​ను త్యాగం చేయాలంటూ అజయ్ జడేజా చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments